12, సెప్టెంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5242

13-9-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దుష్టసమాసములు గృతిని దోష మెటులగున్”

(లేదా...)

“దోషము గాదు కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో”

9 కామెంట్‌లు:

  1. కందం
    దృష్టిని వ్యాకరణమ్మున
    స్పష్టముగ నిలిపి లిఖింప సత్పండితులున్
    పుష్టి నలంకృతులను ని
    ర్దుష్టసమాసములు గృతిని దోష మెటులగున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      భూషణమౌను కావ్యమదె పొందిక వ్యాకరణాది లక్షణాల్
      పోషణ నిచ్చి వెల్గినను మోదము గూర్చును పండితాళికిన్
      ఘోష వలెన్ వినన్ జెవిని ఘూర్ణిలఁ జేయుననంగ నెంచ ని
      ర్దోషము గాదు కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో!

      తొలగించండి
  2. ఉ.
    భూషము మాడ్కి శోభలను పూనిక నిచ్చు పద ప్రయోగముల్
    భాషను పెక్కు కల్గు కన పచ్చని కావ్యత కూర్ప వాడినన్
    దోషము కాదు కావ్యమున, దుష్ట సమాసము లెక్కువైనచో
    తోషములీన చెల్లదది దుప్పుల వోలె బుధాళి కుమ్ముగా !

    రిప్లయితొలగించండి
  3. ఇష్టముగ శిష్యుల కొరకు
    కష్టపడుచు వ్యాకరణపు గ్రంథము వ్రాయన్
    దృష్టి నిలిపిన విభాగము
    దుష్టసమాసములు , గృతిని దోష మెటులగున్

    రిప్లయితొలగించండి

  4. శిష్ట జనారాధకులిల
    యిష్టంబని చెప్పునట్టి యింపగు కృతిలో
    పుష్టిగ గష్టంబగు ని
    ర్దుష్టసమాసములు గృతిని దోష మెటులగున్.


    భేషనరెవ్వరాతనిని విద్యలు నేర్వని మూర్ఖుడైన యా
    వేషము గాంచినంత నొక విజ్ఞుని వోలెను కానవచ్చినన్
    భాషనెఱుంగనట్టి కడు పామరు డిట్లనె తోటివారితో
    దోషము గాదు కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో.


    భేషనుచున్ నుతించుచు వివేకులు మెచ్చెడి తెన్గు పద్యమే
    భూషణమౌ సమాసములు పుష్టిగ నుండిన శోభనిచ్చు, నా
    భాషకు ప్రాణమై నిలుచు పద్యమునున్ పఠియించు వారకున్
    దోషము గాదు కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో.

    *(వారకు తోషముగాదు కావ్యమున.......)*

    రిప్లయితొలగించండి
  5. శిష్టులు కూర్చిన పదములు
    దుష్ట సమాసములయినను దోషరహితమౌ
    స్పష్టమగు శబ్దములు ని
    ర్దుష్టసమాసములు గృతిని దోష మెటులగున్

    భూషణ రత్నదీపికలఁ బోలునటంచు వచించు చుందురే
    తోషము గూర్చునట్టివగు దుష్టసమాసము లేర్చి కూర్చినన్
    దోషము గాదు కావ్యమున; దుష్టసమాసము లెక్కువైనచో
    భీషణమౌను కావ్యమని విశ్వసనీయులు తెల్పుచుందురే

    రిప్లయితొలగించండి
  6. యోషకు స్వర్ణహారములు యుక్తము లౌచును పెంచు శోభనున్

    భాషకు చక్కనైన పదబంధము లందము గూర్చు నెప్పుడున్

    దోషముకాదు కావ్యమున,దుష్టసమాసము లెక్కువైన సం

    తోషము కూర్చబోవవియు దూషణకున్ గురియౌచు నుండుగా

    రిప్లయితొలగించండి
  7. స్పష్టపు ట ర్థ ము నిచ్చు చు
    పుష్టిని చేకూర్చు నట్టి పొంకపు పదము ల్
    సృష్టి o చి రచించిన ని
    ర్డు ష్ట సమాస ములు గృతిని దో ష మెటు లగు న్?

    రిప్లయితొలగించండి