19-9-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”
(లేదా...)
“ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా”
(రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి ధన్యవాదాలతో...)
చ.చిర సుయశోధనార్జనకు చిత్రమునందు నటించె వాడు పే రు రయము దక్క వేషములు, రూపులు మార్చుచు పాత్రలందు తా నెరుగని రీతి తోచెను, యథేచ్ఛను దృశ్యములోన వచ్చెడా యిరువురు మువ్వురున్ నలువురేవురు నార్గురు నొక్కరే కదా !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంపరమేశ్వరు ప్రతిబింబమువరుసగ నద్దాల మండపమ్మున గాంచన్మెరయగఁ బైన నలుదిశలనిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో!చంపకమాలదరిసెనమొంద పంచభుజ దర్పణ మండపమందు కృష్ణునిన్బరవశమొందమే మిగుల పంకజనేత్రుని తేజమొప్పగన్మెరయగఁ జూడ పైనఁగన మిన్నగ చుట్టును దివ్యరూపమేయిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!
కరిముఖుని పూజకొరకై విరాళమును గైకొనుటకు విచ్చేసిరిగా మరల మరల నేతెంచెడుఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరివీరభయంకరులే విరటుని సేవించుటదియె వింతయె సుమ్మీనరుడవు వలలుండను మీ రిరువురు, మువ్వురును, నలువు, రేవు రొకరె పో.విరటుని కొల్వుకూటమున వీరులు పాండు కుమారు లెల్లరున్ పరిచరులై చరించుటది వాస్తవ మంచన నుత్తరుండనెన్ నరుడవు నీవు భీముడును నారియు ధర్మజు, మాద్రి పుత్రులాయిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా.
స్థిరమగు కీర్తితోడుతను చిత్రపరిశ్రమ యందు ఎంటియార్సిరులు గడించినాడు పలు చిత్రములందు నటించి చక్కగన్విరివిగ మార్చుచున్ తనదు వేషము పాత్రలు కానవచ్చె తాయిరువురు మువ్వురున్ నలువురేవురు నార్గురు నొక్కరే కదా
హరికథకుఁడు చావడిలోపరికించెను ప్రేక్షకాళి పరిమిత మవగాసరియగు సంఖ్యను కనుగొననిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పోహరికథ చెప్పఁ దానరిగె నచ్చటి చక్కని రచ్చపట్టుకున్బరిమితమైన ప్రేక్షకులు వచ్చెడి పోయెడి జాడ తోచగాసరియగు సంఖ్యతేల్చుటకు చప్పున లెక్కలు పెట్టి చూడగానిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
హరిహరులును త్రిభువనములుపరికించగ నాల్గు శ్రుతులు ప్రకృతీ ఋతువుల్ అరయగనద్వైతమ్మున ఇరువురు మువ్వురును నలువురేవురొకరెపో
ఇరవగు కామము మూలముయరిషడ్వర్గమ్ము లనెడు యడుసున గూలన్నరులకునీ యొక్కండునుఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో
ఇరవుగనొక్క కోర్కి మదినెల్లలు దాటగ వైరి షట్కముల్తెరకుగ వచ్చి చేరునది తీరక కొందలపాటు గూర్చుచున్వరుసగ నొక్కటొక్కటిగ వచ్చెడు దాయలు నెమ్మనమ్మునందిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరేకదా
పురమున శంభు ని చిత్రము లరుదగు రీతిగను గి్చి యలరిన వేళ న్ మురిపము లొల్క గ గన బడె నిరు వురు మువ్వురు ను నలువు రే వు రొక రె పో
కం:"సరిగా జెప్పుము పాండవులిరువురొ,మువ్వురొ, నలువురొ,యేవురొ" యన తింగరి మనుమ డిట్లనెను "వారిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో!"(తెలియనిదో,మర్చిపోయిందో అడిగితే కొందరు పిల్లలకి చికాకు పుట్టి తింగరి సమాధానా లిస్తారు. )
చం:ఇరువురు రామలక్ష్మణులె యిందున,నిందున సీత కూడె,దగ్గర భరతుండు జేరె నిట ,దాపున బావని నిల్చె నందు,నల్వుర ,మరి సీతయున్ హనుమ నచ్చగ గీసితి నిందు,బ్రేమ లో నిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా”(ఒక బొమ్మలో రామలక్ష్మణు లిద్దరిని,ఇంకో బొమ్మలో సీతారామ లక్ష్మణుల్ని,ఇంకో బొమ్మలో ఈ ముగ్గురితో హనుమంతుడు,మరొకదానిలో అందరినీ బొమ్మలుగా గీసాను.ఎందరైనా ప్రేమలో వారందరూ ఒకటే కదా!)
కం॥ ధరణిని మనుజులు కొల్చినస్థిరమగు చిత్తమున వివిధ దేవతలనటుల్సరియగు జ్ఞానము నొందఁగానిరువురు మువ్వురును నలవు రేవు రొకరె పోచం॥ ధరణినిఁ బెక్కు దేవతలఁ దత్పరులౌచు జనాళి కొల్చినన్బరము నొసంగు వాఁడు హరి భక్తుల పాలిటి కామధేనువై స్థిరమగు జ్ఞానసంపదల సిద్ధినిఁ బొందఁగఁ దేట తెల్లమౌ యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!మరొక పూరణ అండిచం॥ అరయఁగ సూర్యబింబములు నబ్థినిఁ బెక్కులు కానఁగానగున్విరియు తరంగముల్ కదల విస్మయ మొందెడు రీతి మధ్యలోనెరుగఁగ నాదిత్యుండొకడె యీవిధి దైవము నొక్కఁడే సుమాయిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!సముద్రము మధ్యలో అలలు చిన్నవిగా ఉండి నెమ్మదిగా కదులుతుంటే అనేక సూర్యబింబాలు కనపడుట సామాన్యమే నండి.
కర మాశించి పడయఁగాఁ ద్వరితం బెద నిర్ణయించి తత్క్షణమే యప్పురమునఁ గొన్న దడుగఁగా నిరువురు మువ్వురును నలువు రేవు, రొకరె పో నర వరు లెవ్వరేన్ వరుస నైపుణ మేర్పడ నెంచి చూచినం దరుణులు నశ్వులున్, హర విధాతృ రమేశులు, ఋత్విజుల్, పృథా వర తనయుల్, నిజ ద్విషులు, బ్రహ్మము సంఖ్యల యందు నింపుగా నిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా
మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
వరమును వేడి రక్ష నిలువంగనుఁగోరిరి వేల మౌనులే నరకుని సత్య కూల్చగను నాయము దీరును వారి కోర్కెయన్ సరసపు లాటలన్ వనిని చల్లని పున్నమిఁజేర శ్రీహరేఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!
తరములు మారి సంతతియు తగ్గెను నింటను నొక్కరిద్దరన్ తిరిగియు వ్రాయనోపు నిక తీరుగ దాట సుతుండు నానుడిన్ ఇరువురి బేధమేమి మరి నింతయు తిండియు పెట్టి పెంచగన్ ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.హరియున్ గోపికలందరిసరసన నొక్కండు చేరి సరసములాడన్మెరిసెన్ అందరి చెంతనునిరువురు,మువ్వురును,నలువు,రేవు రొకరె పో!
కరములతోబంధించగచిరునగవులుచిందజేసి శ్రీకృష్ణుడటన్స్థిరముగ నిలవగ దలచిరి*“నిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”*కరమునవిల్లుజారగనుకౌరవసేనలజూచి భీతితోసరుగునద్రిప్పుమయ్యనటుస్యందనమంచునుత్తరుండనన్చిరుదరహాసమొప్పగనుచెప్పగగుట్టునువిస్మయంబుతో*“యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా”*
చ.
రిప్లయితొలగించండిచిర సుయశోధనార్జనకు చిత్రమునందు నటించె వాడు పే
రు రయము దక్క వేషములు, రూపులు మార్చుచు పాత్రలందు తా
నెరుగని రీతి తోచెను, యథేచ్ఛను దృశ్యములోన వచ్చెడా
యిరువురు మువ్వురున్ నలువురేవురు నార్గురు నొక్కరే కదా !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిపరమేశ్వరు ప్రతిబింబము
వరుసగ నద్దాల మండపమ్మున గాంచన్
మెరయగఁ బైన నలుదిశల
నిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో!
చంపకమాల
దరిసెనమొంద పంచభుజ దర్పణ మండపమందు కృష్ణునిన్
బరవశమొందమే మిగుల పంకజనేత్రుని తేజమొప్పగన్
మెరయగఁ జూడ పైనఁగన మిన్నగ చుట్టును దివ్యరూపమే
యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!
రిప్లయితొలగించండికరిముఖుని పూజకొరకై
విరాళమును గైకొనుటకు విచ్చేసిరిగా
మరల మరల నేతెంచెడు
ఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅరివీరభయంకరులే
విరటుని సేవించుటదియె వింతయె సుమ్మీ
నరుడవు వలలుండను మీ
రిరువురు, మువ్వురును, నలువు, రేవు రొకరె పో.
విరటుని కొల్వుకూటమున వీరులు పాండు కుమారు లెల్లరున్
పరిచరులై చరించుటది వాస్తవ మంచన నుత్తరుండనెన్
నరుడవు నీవు భీముడును నారియు ధర్మజు, మాద్రి పుత్రులా
యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా.
స్థిరమగు కీర్తితోడుతను చిత్రపరిశ్రమ యందు ఎంటియార్
రిప్లయితొలగించండిసిరులు గడించినాడు పలు చిత్రములందు నటించి చక్కగన్
విరివిగ మార్చుచున్ తనదు వేషము పాత్రలు కానవచ్చె తా
యిరువురు మువ్వురున్ నలువురేవురు నార్గురు నొక్కరే కదా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిహరికథకుఁడు చావడిలో
రిప్లయితొలగించండిపరికించెను ప్రేక్షకాళి పరిమిత మవగా
సరియగు సంఖ్యను కనుగొన
నిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో
హరికథ చెప్పఁ దానరిగె నచ్చటి చక్కని రచ్చపట్టుకున్
బరిమితమైన ప్రేక్షకులు వచ్చెడి పోయెడి జాడ తోచగా
సరియగు సంఖ్యతేల్చుటకు చప్పున లెక్కలు పెట్టి చూడగా
నిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహరిహరులును త్రిభువనములు
తొలగించండిపరికించగ నాల్గు శ్రుతులు ప్రకృతీ ఋతువుల్
అరయగనద్వైతమ్మున
ఇరువురు మువ్వురును నలువురేవురొకరెపో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇరవగు కామము మూలము
రిప్లయితొలగించండియరిషడ్వర్గమ్ము లనెడు యడుసున గూలన్
నరులకునీ యొక్కండును
ఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇరవుగనొక్క కోర్కి మదినెల్లలు దాటగ వైరి షట్కముల్
రిప్లయితొలగించండితెరకుగ వచ్చి చేరునది తీరక కొందలపాటు గూర్చుచున్
వరుసగ నొక్కటొక్కటిగ వచ్చెడు దాయలు నెమ్మనమ్మునం
దిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరేకదా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపురమున శంభు ని చిత్రము
రిప్లయితొలగించండిలరుదగు రీతిగను గి్చి యలరిన వేళ న్
మురిపము లొల్క గ గన బడె
నిరు వురు మువ్వురు ను నలువు రే వు రొక రె పో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:"సరిగా జెప్పుము పాండవు
రిప్లయితొలగించండిలిరువురొ,మువ్వురొ, నలువురొ,యేవురొ" యన తిం
గరి మనుమ డిట్లనెను "వా
రిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో!"
(తెలియనిదో,మర్చిపోయిందో అడిగితే కొందరు పిల్లలకి చికాకు పుట్టి తింగరి సమాధానా లిస్తారు. )
చం:ఇరువురు రామలక్ష్మణులె యిందున,నిందున సీత కూడె,ద
రిప్లయితొలగించండిగ్గర భరతుండు జేరె నిట ,దాపున బావని నిల్చె నందు,న
ల్వుర ,మరి సీతయున్ హనుమ నచ్చగ గీసితి నిందు,బ్రేమ లో
నిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా”
(ఒక బొమ్మలో రామలక్ష్మణు లిద్దరిని,ఇంకో బొమ్మలో సీతారామ లక్ష్మణుల్ని,ఇంకో బొమ్మలో ఈ ముగ్గురితో హనుమంతుడు,మరొకదానిలో అందరినీ బొమ్మలుగా గీసాను.ఎందరైనా ప్రేమలో వారందరూ ఒకటే కదా!)
కం॥ ధరణిని మనుజులు కొల్చిన
రిప్లయితొలగించండిస్థిరమగు చిత్తమున వివిధ దేవతలనటుల్
సరియగు జ్ఞానము నొందఁగా
నిరువురు మువ్వురును నలవు రేవు రొకరె పో
చం॥ ధరణినిఁ బెక్కు దేవతలఁ దత్పరులౌచు జనాళి కొల్చినన్
బరము నొసంగు వాఁడు హరి భక్తుల పాలిటి కామధేనువై
స్థిరమగు జ్ఞానసంపదల సిద్ధినిఁ బొందఁగఁ దేట తెల్లమౌ
యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!
మరొక పూరణ అండి
చం॥ అరయఁగ సూర్యబింబములు నబ్థినిఁ బెక్కులు కానఁగానగున్
విరియు తరంగముల్ కదల విస్మయ మొందెడు రీతి మధ్యలో
నెరుగఁగ నాదిత్యుండొకడె యీవిధి దైవము నొక్కఁడే సుమా
యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!
సముద్రము మధ్యలో అలలు చిన్నవిగా ఉండి నెమ్మదిగా కదులుతుంటే అనేక సూర్యబింబాలు కనపడుట సామాన్యమే నండి.
కర మాశించి పడయఁగాఁ
రిప్లయితొలగించండిద్వరితం బెద నిర్ణయించి తత్క్షణమే య
ప్పురమునఁ గొన్న దడుగఁగా
నిరువురు మువ్వురును నలువు రేవు, రొకరె పో
నర వరు లెవ్వరేన్ వరుస నైపుణ మేర్పడ నెంచి చూచినం
దరుణులు నశ్వులున్, హర విధాతృ రమేశులు, ఋత్విజుల్, పృథా
వర తనయుల్, నిజ ద్విషులు, బ్రహ్మము సంఖ్యల యందు నింపుగా
నిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా
మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివరమును వేడి రక్ష నిలువంగనుఁగోరిరి వేల మౌనులే
రిప్లయితొలగించండినరకుని సత్య కూల్చగను నాయము దీరును వారి కోర్కెయన్
సరసపు లాటలన్ వనిని చల్లని పున్నమిఁజేర శ్రీహరే
ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!
తరములు మారి సంతతియు తగ్గెను నింటను నొక్కరిద్దరన్
రిప్లయితొలగించండితిరిగియు వ్రాయనోపు నిక తీరుగ దాట సుతుండు నానుడిన్
ఇరువురి బేధమేమి మరి నింతయు తిండియు పెట్టి పెంచగన్
ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
హరియున్ గోపికలందరి
సరసన నొక్కండు చేరి సరసములాడన్
మెరిసెన్ అందరి చెంతను
నిరువురు,మువ్వురును,నలువు,రేవు
రొకరె పో!
కరములతోబంధించగ
రిప్లయితొలగించండిచిరునగవులుచిందజేసి శ్రీకృష్ణుడటన్
స్థిరముగ నిలవగ దలచిరి
*“నిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”*
కరమునవిల్లుజారగనుకౌరవసేనలజూచి భీతితో
సరుగునద్రిప్పుమయ్యనటుస్యందనమంచునుత్తరుండనన్
చిరుదరహాసమొప్పగనుచెప్పగగుట్టునువిస్మయంబుతో
*“యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా”*