ఆర్యుల మాటలు మరచిన ధైర్యమ్మించుకయు లేని దరితుడు చెప్పెన్ భార్యకు శంకరులను నా చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్
ఆర్యులు చెప్పిరైరి యిల హైందవ జాతికి చూడ శంకరా చార్యులె పెద్ద దిక్కని ప్రచారము జేసిరి కాని నీచుడే ధైర్యము లేక నా పరమతస్థుల తో వచియించె శంకరా చార్యుల చేత హైందవము సర్వవిధంబుల భ్రష్టమై చెడెన్.
కం:ఆర్యా! వైష్ణవ మత మా థుర్యము నీ వెరుగుమయ్య! దుస్తర్కము, దు శ్చర్యల శంకరులను నా చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్” (ఒక విశిష్టాద్వైతి,వైష్ణవుడు శంకరుల అద్వైతతత్త్వాన్ని నిందించినట్లు.)
ఉ:"భార్యలు రామచంద్రునకు బల్వు" రటంచు సమస్య యిచ్చునే ధైర్యము జేసి? యందరును దానిని పూరణ జేతు రేల ? దు శ్చర్యయె కాదె యిద్ది? సరసత్వ మెరుగని కంది శంకరా చార్యుల చేత హైందవము సర్వవిధంబుల భ్రష్టమై చెడెన్” (కంది శంకయ్య గారు "భార్యలు రామచంద్రునకు బల్వురు" అంటూ సమస్య ఇచ్చారట.దానికి ఒక వీర హిందుత్వ వాది అలా సమస్య ఇవ్వటమే హిందూ మతాన్ని అవమానించటం అని తగవు వేసుకున్నాడట.ఇలాంటి అతివాద సంఘటన ఒక మారు నిజంగానే జరిగింది.)
ఆర్యావర్తము నందున
రిప్లయితొలగించండిమర్యాద గలిగి బహుజన మతమై, మూఢా
చార్యపు శంకరులను నా
చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్
రిప్లయితొలగించండిఆర్యుల మాటలు మరచిన
ధైర్యమ్మించుకయు లేని దరితుడు చెప్పెన్
భార్యకు శంకరులను నా
చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్
ఆర్యులు చెప్పిరైరి యిల హైందవ జాతికి చూడ శంకరా
చార్యులె పెద్ద దిక్కని ప్రచారము జేసిరి కాని నీచుడే
ధైర్యము లేక నా పరమతస్థుల తో వచియించె శంకరా
చార్యుల చేత హైందవము సర్వవిధంబుల భ్రష్టమై చెడెన్.
కందం
రిప్లయితొలగించండిసూర్యసమానులనఁగ నా
చార్యులు హైందవము నిలుప, సణఁగ తగునె? యె
ట్లార్యా! శంకరులను నా
చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్?
ఉత్పలమాల
ఆర్యులు కార్యదక్షుఁగని హారతులన్ వచియింప, శంకరా
చార్యుల చేత హైందవము సర్వవిధంబుల శ్రేష్టమై మనెన్!
సూర్యుని పైన నుమ్మిడియు స్రుక్కెడు వాగుడు కాదె? "శంకరా
చార్యుల చేత హైందవము సర్వవిధంబుల భ్రష్టమై చెడెన్"
ఆర్యుఁడు శంకరుడు నిలిపె
రిప్లయితొలగించండిధైర్యముగా హైందవమ్ము ధరలో నిపుఁడా
తిర్యక్శంకరులను నా
చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్
మరొక పూరణ:
రిప్లయితొలగించండికార్యాకార్యము లివియని
నార్యావర్తమున దెలిపె, నౌరా! యననా
శ్చర్యమె! శంకరులను నా
చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్
ఆర్యావర్తము నందున
రిప్లయితొలగించండికార్యాచరణము కొరకొర ఘటించు చుండన్
భార్యవశంకరులను నా
చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్
కార్యోన్ముఖుడైన పిదప
రిప్లయితొలగించండినార్యావర్తమున గెలిచెనద్వైతంబే!
ఆర్యా! శంకరులను నా
చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్
కార్యము హైందవోన్నతియె కావున హిందువులందునన్ మన
స్థైర్యము పెచ్చరిల్లి గురితప్పక వైభవ మొందె శంకరా
చార్యుల చేత హైందవము; సర్వవిధంబుల భ్రష్టమై చెడెన్
బర్యవసానమై ద్వయము పాపము గూడ శమించెనందురే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికార్యనిమగ్నతన్ విహిత
రిప్లయితొలగించండికర్మల సద్గతి నొందుమార్గ మౌ
దార్యము నింపి జీవన వి
ధానము జూపి రహించు ధాత్రిపై
స్థైర్యము నింపి హృద్గతి వి
చారణ బెంచగ నేల శంకరా
చార్యుల చేత హైందవము
సర్వవిధమ్ముల భ్రష్టమై చెడెన్?!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య!
రిప్లయితొలగించండి" శంకరాచార్యుల చేత హైందవము సర్వ విధంబుల భ్రష్టమై చెడెన్ "
ఉత్పలమాల:
-------------
ఆర్యులు జెప్పె నాత్మ పరమాత్మలు గాంచగ నొక్కటంచు ; తా
సూర్యుడు హైందవమ్మునకు;క్షుణ్ణుడు, శ్రాంతుడు, ధర్మ మూర్తి ; యౌ
దార్యము జూపువారు; గన దైవ సమానుల దెట్లు శంకరా
చార్యుల చేత హైందవము సర్వ విధంబుల భ్రష్టమై చెడెన్?
( క్షుణ్ణుడు అనగా వ్యుత్పన్నుఁడు.. శాస్త్రములు తెలిసినవారు)
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
కం:ఆర్యా! వైష్ణవ మత మా
రిప్లయితొలగించండిథుర్యము నీ వెరుగుమయ్య! దుస్తర్కము, దు
శ్చర్యల శంకరులను నా
చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్”
(ఒక విశిష్టాద్వైతి,వైష్ణవుడు శంకరుల అద్వైతతత్త్వాన్ని నిందించినట్లు.)
ఉ:"భార్యలు రామచంద్రునకు బల్వు" రటంచు సమస్య యిచ్చునే
రిప్లయితొలగించండిధైర్యము జేసి? యందరును దానిని పూరణ జేతు రేల ? దు
శ్చర్యయె కాదె యిద్ది? సరసత్వ మెరుగని కంది శంకరా
చార్యుల చేత హైందవము సర్వవిధంబుల భ్రష్టమై చెడెన్”
(కంది శంకయ్య గారు "భార్యలు రామచంద్రునకు బల్వురు" అంటూ సమస్య ఇచ్చారట.దానికి ఒక వీర హిందుత్వ వాది అలా సమస్య ఇవ్వటమే హిందూ మతాన్ని అవమానించటం అని తగవు వేసుకున్నాడట.ఇలాంటి అతివాద సంఘటన ఒక మారు నిజంగానే జరిగింది.)