శా:గుట్కా ద్రావెడు నొక్క చెడ్డ గుణమే కూడంగ, నిర్వాణమన్ షట్కమ్మున్,మరి వాక్యవృత్తి నెరుగున్ షడ్దర్శనమ్ముల్,స్మృతుల్ షట్కాలమ్ముల బోధ జేయు ననుచున్ సద్భక్తి తో నెల్లరున్ గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే (గుట్కా త్రాగే ఒక్క చెడ్డ గుణం ఉన్నా శంకరుల నిర్వాణషట్కాన్ని, వాక్యవృత్తిని తెలిసిన వాడు, షడ్దర్శనాలని,స్మృతులని ఆరు ఋతువులలో బోధించే వాడు కనుక అతన్ని గురువు గా కీర్తిస్తారు.)
శా.
రిప్లయితొలగించండిజట్కాబండిని తోలుచున్ దినములన్ సంచారముల్ సేసి యీ
పుట్కం బైదిలి పిల్లలన్ సొరిది తా బోషించుచున్ రాత్రులం
గాట్కం బోలెడి గోడపై చదువులం గల్పించు, విద్యార్థులా
గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే !
మట్కా నాడుట కొరకయి
రిప్లయితొలగించండిజట్కా నెక్కి యదియాడు జాగా వెదుకన్
అట్కావు నొందుచుండగ
గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్
కందం
రిప్లయితొలగించండిమట్కా నాడుచు నిత్యము
కిట్కులు విని దూరి రాజకీయములందున్
జిట్కా లెన్నో పారగ
గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్!
శార్దూలవిక్రీడితము
మట్కా నాడుచు నిత్యమున్ దినఁగ సంపాదించుటల్ మృగ్యమై
కిట్కుల్ నేరిచి రాజకీయములఁ దా గెల్వంగఁ గాలూనుచున్
జిట్కాలెన్నియొ పారగన్ నెగడుచున్ జేరంగ గమ్యమ్ము వా
గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే!
రిప్లయితొలగించండిమట్కా తో వీధిని పడ
జట్కా నడుపంగ నేర్పె సత్కృప తోడన్
గుట్కా తినెడి వాడే
గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్.
ఈట్కా ప్రాస యె కష్ట సాధ్యమని నేనీపద్యమున్ వ్రాయగా
చిట్కాతెల్పు మటంచు మా గురువు శాస్త్రిన్ జేరగా నాతడే
గుట్కానించుక నోట వేసుకొనుచున్ కూర్చుండి తాజేప్పగా
గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే.
మట్కాజూదమునాడెను
రిప్లయితొలగించండిజట్కాబండిని నడిపెను షట్కాలములున్
జిట్కావైద్యము నేర్పగ
గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్
మట్కాజూదము నాడిగెల్చు నతడే మావూరిలోనెన్నడున్
జట్కాబండిని దోలినాడు గతమున్ జాగ్రత్తగా గుట్టపై
చిట్కావైద్యము చేసినాడటు పయిన్ శీఘ్రంబుగా నొజ్జయై
గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే
ఘట్కేసరుపుర వీధుల
రిప్లయితొలగించండిపట్కాలో నాయుధమున పాంసనుడొక్కం
డట్కాయించుచు నబలల
గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్
కం॥పట్కాబిగించి దృఢముగ
రిప్లయితొలగించండిషట్కాలమ్ములను జోర జాణ గుణములున్
మట్కాజూదము వరలఁగ
గుట్కా సేవించు వాఁడె గురువై నెగడెన్
శా॥ పట్కానట్లు బిగించి యోచనల సౌభాగ్యమ్ము నేపారఁగన్
షట్కాలమ్ములఁ జోరవిద్యఁ గని విస్తారమ్ముగా నొప్పఁగన్
మట్కా జూదము నింగి నంట నటు సమ్మానించి యాపేక్షతో
గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే!
పట్కా belt
జట్కా తోలుచు చదువుచు
రిప్లయితొలగించండిచిట్కా లను నేర్చి తాను సిరి గల వాడై
మట్కా లాడేడి వారికి
గుట్కా సేవించు వాడు గురువై నెగ డెన్
కం:జట్కా త్రోలెడు వానికి
రిప్లయితొలగించండిమట్కా జూదమ్ము లాడు మానిసి, దానన్
చిట్కాలు తెలిపి నిరతము
గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్”
శా:గుట్కా ద్రావెడు నొక్క చెడ్డ గుణమే కూడంగ, నిర్వాణమన్
రిప్లయితొలగించండిషట్కమ్మున్,మరి వాక్యవృత్తి నెరుగున్ షడ్దర్శనమ్ముల్,స్మృతుల్
షట్కాలమ్ముల బోధ జేయు ననుచున్ సద్భక్తి తో నెల్లరున్
గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే
(గుట్కా త్రాగే ఒక్క చెడ్డ గుణం ఉన్నా శంకరుల నిర్వాణషట్కాన్ని, వాక్యవృత్తిని తెలిసిన వాడు, షడ్దర్శనాలని,స్మృతులని ఆరు ఋతువులలో బోధించే వాడు కనుక అతన్ని గురువు గా కీర్తిస్తారు.)
కిట్కనఁగ రాదు కిటు కను
రిప్లయితొలగించండిగుట్కలు నట్కులు తగు నన గుటకలు నటుకుల్
గుట్కా పరదేశ పదము
గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్
చిట్కా లున్నవి పోవఁగా వ్యసనముల్ శీఘ్రంబ మేల్గూర్పఁగా
మట్కా యన్నది యాట నూతనము వే మానంగ మేల్మేదినిన్
గుట్కా శబ్దము సుప్రసిద్ధ మగు నొక్కో యన్య దేశ్యంబునై
గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే ?
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
జట్కా నడిపెడు వాడే
మట్కా జూదమ్ము నాడు మాన్యులకైనన్
చిట్కాలను బోధించుచు
గుట్కా సేవించువాడె గురువై నెగడెన్.