7, నవంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5298

8-11-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి”
(లేదా...)
“మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ”

9 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      శల్య సారధ్యమన్నది శాపమౌచు
      యుద్ధమందున కర్ణునకూనమయ్యె
      ముందు నడుపుచు పరులకు సందుచూచి
      మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి!

      ఉత్పలమాల
      ఆలమునందునన్ గుదిరి యార్కికి సాదిగ శల్యుడెప్పుడున్
      జాలము మేరకున్ మిగుల సాయము జేయుచు పాండవాళికిన్
      వాలెను నేలకున్ దుదిని పాపము పండగ! వైరి పక్షమై
      మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ!

      తొలగించండి

  2. మిత్రుడవటంచు నెప్పుడు మిన్నగాను
    చెప్పుకున్న నేమిర చూడ చేత లందు
    భేద మెంతయొ చూపుచు విద్విషునకు
    మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి.


    మాలిమి జూప నేమి కడు మందుడు మిత్రుడు కాదు వాడిలన్
    బేలతనమ్ముతో కపట ప్రేమ నటించుచు మాటలాడు దు
    శ్శీలుడు నిన్ను కోడిగము చేయుచు నిత్యము కానివానికిన్
    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ.

    రిప్లయితొలగించండి
  3. దివసమంత ను పగతునిదెస దలచుచు
    మరచిబోత నాడు బయనమగుట గూర్చి ,
    పయన మొంద నెంచిన బండి బన్నమొందె
    మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి

    రిప్లయితొలగించండి
  4. సమస్య


    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ


    ఉ. మా
    ------

    ఆలిని బ్రేమ జూచి తన యాశల దీర్చుచు మేలు నేలినన్

    శీలము వీడి తా బ్రియుని జెంతకు జేరి వసించ గోరుచున్

    జాలిక నీతొ బంధమని చంపగ జూచెను బ్రాణనాథునే

    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  5. పాలు పోసిపెంచిన నేమి వీలుచూచి
    కచ్చితంబుగ కాటేయు గాలిదిండి
    మిత్రుడనని వచించుచు శత్రువులకు
    మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి

    పాలను పోసి పెంచినను వ్యాలము మేలొనరించదెన్నడున్
    జాలిదలంచినన్ దులువ సల్పుట మానడు కీడు! మిత్రునిన్
    బోలుచు బూటకంబులగు పొంకపు మాటల శత్రుకోటికిన్
    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ

    రిప్లయితొలగించండి
  6. మంచి తనమున నటియించి మాయ జేసి
    హితుని వోలెను మెలగుచు హే య మైన
    పనులు జేసెది వానిని పలుక దగును
    మేలొ న ర్చె డి వాడె సుమీ విరోధి

    రిప్లయితొలగించండి
  7. యదార్థవాది లోక విరోధి:-

    హేలగ మాటలాడి కడు నిష్టము జూపి యబద్ద వాదముల్
    వీలుగ పల్కు వాని నుడి వేద సమానము గాగ మిత్రుడౌ!
    ఆలము జేసి యైనను యదార్థము బల్కుచు జీవితమ్ములో
    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ!!

    రిప్లయితొలగించండి
  8. స్పర్ధచేనిలఁ విద్యలు వర్ధిలునను
    లోకనానుడి సత్యమాలోకనమున
    ప్రతిఘటించి ప్రవర్ధించు ప్రతిభగాన
    మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి

    రిప్లయితొలగించండి