8, నవంబర్ 2025, శనివారం

సమస్య - 5299

9-11-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్”
(లేదా...)
“దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా”

6 కామెంట్‌లు:

  1. కందం
    నైపుణ్యము పెంపొందఁగఁ
    జూపెను కృత్రిమపు మేధ చోద్యమనంగన్
    చేప ముఖాగ్రము నేనుగు!
    దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్!

    ఉత్పలమాల
    నైపుణి మీరె లోకమున నమ్మగ లేనివి నమ్ము నట్లుగన్
    జూపెను గృత్రిమంబనెడు చోద్యముఁ గొల్పెడు మేధ వింతలన్
    చేప ముఖాగ్ర భాగమున చిత్రమనంగను నిల్చె నేనుగే!
    దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా!

    రిప్లయితొలగించండి

  2. దీపము వెలిగెడి తరి కా
    సేపటి పిదపను గన కొడి చిక్కగ గట్టన్
    దీపిక కొడి గన నగుపడె
    దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్.


    పాపహరంబు పూజలని భక్తుడొకండట చిత్తశుద్ధి తో
    నా పరమాత్ము గోల్వదివియన్ వెలిగించగ దీపకమ్ము కా
    సేపది వెల్గి వత్తి కొడి చిక్కగ కట్టిన వేళ కాంచగా
    దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా.

    రిప్లయితొలగించండి
  3. బాపడు తావినిడు పువుల
    దీపను పోషించ వెట్ట దివసము నందున్
    మాపటి సమయము లో , నా
    దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్

    రిప్లయితొలగించండి
  4. ఆపురముల దేవళములు
    చూపుచునుండుగద శిల్పశోభ విభవమున్
    గోపురమును గమనింపగ
    దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్

    ఆపురమందునాలయము లన్నిట శోభిలు శిల్ప సంపదే
    దాపుననున్న కోవెల నిదర్శనమౌగద వైభవంబుకున్
    గోపురమేమనోహరము గొప్పకళానిపుణత్వమొప్పగా
    దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  5. మాపటి ప్రొద్దున కాంతులు
    ఏపుగ పెరిగిన వనమున నింపుగ చెలగన్
    చూపరులాహాయనఁ వన
    దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్

    వనదీపము : సంపెంగ

    రిప్లయితొలగించండి