10, నవంబర్ 2025, సోమవారం

సమస్య - 5301

11-11-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోడిగ్రుడ్డునుండి జనించెఁ గుంజరమ్ము”
(లేదా...)
“కుక్కుటాండమునుండి పుట్టెను గుంజరమ్ము విచిత్రమే”

15 కామెంట్‌లు:

  1. తేటగీతి
    చూడ కృత్రిమ మేధయె చోద్యమొలుకు
    నమ్మలేనిది నమ్మించు నైపుణి గొన
    చీమగర్భమ్మునుండియె చిరుతపులియు
    కోడిగ్రుడ్డునుండి జనించెఁ గుంజరమ్ము!

    మత్తకోకిల
    అక్కజమ్మగు కృత్రిమమ్ముగ నన్ని జూపెడు మేధతో
    నిక్కమంచును నమ్మకమ్ముగ నేడు వింతలనొల్కెడున్
    బక్క చిమ్మటమందు పుట్టెను వారువమ్మది దూకుచున్!
    కుక్కుటాండమునుండి పుట్టెను గుంజరమ్ము! విచిత్రమే!

    రిప్లయితొలగించండి
  2. ఎంతయో చిత్రముగనుండె నీదీనమున ,
    కుక్కుటపు గ్రుడ్డు బొమ్మను క్షోణి పయిన
    నదుమ పగిలె , నందగుపడె నసురపుబొమ ,
    "కోడిగ్రుడ్డునుండి జనించెఁ గుంజరమ్ము”

    రిప్లయితొలగించండి

  3. బాలల సినిమా యనుచును వాసి గాను
    వింత లెన్నియొ కూర్చి వివేకు డొక్క
    డద్భుత మగు చిత్రము తీయ నందు జూడ
    కోడిగ్రుడ్డునుండి జనించెఁ గుంజరమ్ము.


    బక్కచిక్కిన దర్శకుండట వాసిగా నొక చిత్రమున్
    పెక్కు బాలురు మెత్తు రంచును వింత లెన్నియొ కూర్చి తా
    నొక్క చిత్రము తీయ నందున నొంటె దాచిన పెద్ద దౌ
    కుక్కుటాండమునుండి పుట్టెను గుంజరమ్ము విచిత్రమే.

    రిప్లయితొలగించండి
  4. వీర బ్రహ్మము చెప్పిన వింతలన్ని
    కాను పించ గ దొడగెను కల్ల కాదు
    చిరుత పుట్టెను చిన్నారి చీమ క ట్లె
    కోడి గ్రుడ్డు నుండి జనించె కుంజ రమ్ము

    రిప్లయితొలగించండి
  5. కుక్కు టాండము లనుదెచ్చి మెక్కనెంచి
    ప్రక్కనున్న యినుపరేకు పయిన గొట్టి
    గ్రుడ్డు సొనను వ్రేచెఁ గరటి రూపమందు
    కోడి గ్రుడ్డునుండి జనించెఁ గుంజరమ్ము

    మిక్కుటంబగు నెయ్యమంచును మెక్కనేర్చెను గ్రుడ్లనే
    కొక్కిరాయిని బోలువాడట గ్రుడ్లనే పగిలించి తాఁ
    బిక్కటంబుగఁ బాత్ర పైనను వ్రేచె పుష్కరి రూపునన్
    గుక్కుటాండమునుండి పుట్టెను గుంజరమ్ము విచిత్రమే

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి:
    వాడకట్టున గారడీవాఁడు చేయు
    వింతలను జూచి జనులెల్ల విస్తుపడిరి
    యువతిగా మారిపోయెను యువకుడొకఁడు
    కోడి గ్రుడ్డునుండి జనించెఁ గుంజరమ్ము

    మత్తకోకిల:
    అక్కజంబుగ వాడకట్టున నందరున్ గనుచుండగా
    కుక్కుటమ్మును మార్చెనొక్కఁడు కుక్కగా క్షణమందునన్
    మిక్కుటమ్ముగ చూచువారల మేనులే పులకించగా
    కుక్కుటాండమునుండి పుట్టెను గుంజరమ్ము విచిత్రమే

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:బ్రహ్మ దేవుని యీ సృష్టి రచన లోని
    పిచ్చి యేమొ బరువు లేని పిల్ల యేమొ
    కోడిగ్రుడ్డునుండి జనించెఁ, గుంజరమ్ము
    బరువు గల్గియు దల్లి గర్భమున బుట్టె.

    రిప్లయితొలగించండి
  8. తే॥ బాల బాలికలకు హాస్య భరిత చలన
    చిత్రమెంచి తీయనటు విచిత్ర మొప్ప
    మంత్రదండముఁ ద్రిప్పఁగన్ మాయ విరిసి
    కోడి గ్రుడ్డునుండి జనించెఁ గుంజరమ్ము

    మత్త॥ చక్కనైనది పిల్ల వాండ్రకు సర్వ వేళలఁ జూడఁగన్
    మక్కువైనది హస్య మంచును మాయలెన్నియొ చేర్చుచున్
    బెక్కు వింతలఁ గూర్చి నింపఁగఁ బేర్మి మీరఁగ నందులోఁ
    గుక్కుటాండము నుండి పుట్టెను గుంజరమ్ము విచిత్రమే

    రిప్లయితొలగించండి
  9. మ.కో:ఒక్కటేనియు తర్కబద్ధత యుండ దీ యజు సృష్టి లో
    చక్కగా శ్రమ లేక పిల్లయె జన్మమున్ ధరియించె నీ
    కుక్కుటాండమునుండి ,పుట్టెను గుంజరమ్ము విచిత్రమే
    బక్క ప్రాణియె కాక తల్లికి భార మై శ్రమ వెట్టుచున్.

    రిప్లయితొలగించండి
  10. తే॥గీ
    పాడుగద్దియనెక్కంగ పాట్లుబడుచు
    జనుల కుక్కివంపులకచ్చు లొనర జేసి
    నాకమెదుటనిలుపనేత నటనజేయ
    కోడిగ్రుడ్డు నుండి జనించె గుంజరమ్ము

    రిప్లయితొలగించండి
  11. చాలా మంది సమస్య అనగానే అది నాలుగవ పాదం లోనే రావా లని ప్రయత్నిస్తారు.కొన్ని సమస్యలన్ని మూడవ పాదం లో పెట్టి వాక్యవిభజన చేస్తేనే మంచి పూరణలు వస్తాయి.

    రిప్లయితొలగించండి
  12. సమస్య:
    గుక్కుటాండమునుండి పుట్టెను గుంజరమ్ము విచిత్రమే!

    మ. కో :

    పెక్కుమాయల యింద్రజాలము పేరు మోసిన గారడిన్
    మిక్కుటంబుగ చేసిరే కడు మిథ్య చిత్రపు విద్యలన్
    మక్కువం గన వారి చేష్టల మాయలే మది దోచగా
    కుక్కుటాండమునుండి పుట్టెను గుంజరమ్ము విచిత్రమే!

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    చూడ గారడీ నొక్కటి చోద్యమయ్యె
    సంభవములుగ జేసె నసంభవముల
    త్రాడు నుండి రప్పించె సర్పమ్ము నొకటి
    కోడిగ్రుడ్డు నుండి జనించెఁ గుంజరమ్ము.

    రిప్లయితొలగించండి