13-11-2025 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నాది కానిదేది నీది కాదు”(లేదా...)“నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా”
మత్తకోకిలల.వేద తత్త్వము ద్రవ్వి చూడుము పెంచు యత్నము సత్యమౌ నీదు రూపము జెప్పు లోతుగ నేడు తర్కము సేయుమా యేది శాశ్వతమో వివేకము హెచ్చి తెల్పును జ్ఞానమున్ నాది కానిది యేది నీదని, నమ్మబోకము జీవుడా !
కురుక్షేత్రం లో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో...ఆటవెలదిచంపువాడవీవె? చచ్చు వారలు వారె?జరుగు నా వలననె సర్వమిలనుమానవుడు నిమిత్తమాత్రుడనఁగఁ బార్థ!నాది కానిదేది నీది కాదు!మత్తకోకిలకాదు చంపెడు వాడవీవయ! కాదు వారలు చచ్చుటేనాదధీనమునందు సర్వము నర్మగర్భముగా మనున్యోధ! ప్రాణి నిమిత్తమాత్రుడు నుర్వియందునఁ జూడగా!నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా!
ఏది శాశ్వతమ్మదేదియశాశ్వతం మిధ్యయే సకల మవిద్య చేతనాదినాదనియెడు వాదులాటేలరా నాది కానిదేది నీది కాదు
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ప్రియుడును ప్రియురాలు ప్రేమగ మాట్లాడుకొనెడు వేళను ప్రియు డనియె నిటులనాది నీది యనుచు భేదమేల మనలోనాది కానిదేది నీది కాదు.
నాది నాది యనుచు నా యాస్తి నీదని చెప్పు కొనుచు మురియు చిన్న దాన యెన్ని చూప నేమి యన్నుల మిన్నరోనాది కానిదేది నీది కాదు.ఏది నీదని చెప్పుచుంటివి యిట్టి సృష్టిని గాంచగా నీది నీదని చెప్పు జన్మమదెప్పుడీ భువి వీడునోయాదరించిన వాడె నిన్నిక యప్యయమ్మును జేయడేనాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా.
తనయుడు దన తండ్రి దరికేగి యిట్లనె "అమ్మ పేరున గల యాస్తి నిడుము "సుద్దులను దెలుపుచు సుతునితో పితయనె “నాది కానిదేది నీది కాదు”
నీదు వెంట వచ్చు నీసొంతమేదిరానాది నాదటంచు వాద మేలనాది యన్న తలపు నాశన హేతువేనాది కానిదేది నీది కాదుఏది నీదని వెంట బెట్టుకు నేగుచుందువు స్వర్గమేనాది నాదను తత్పరత్వము నాటకమ్ముర భూమిపైనాది నీదను భేదభావము నాశనమ్ముకు హేతువౌనాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా
మత్తకోకిలల.
రిప్లయితొలగించండివేద తత్త్వము ద్రవ్వి చూడుము పెంచు యత్నము సత్యమౌ
నీదు రూపము జెప్పు లోతుగ నేడు తర్కము సేయుమా
యేది శాశ్వతమో వివేకము హెచ్చి తెల్పును జ్ఞానమున్
నాది కానిది యేది నీదని, నమ్మబోకము జీవుడా !
కురుక్షేత్రం లో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో...
రిప్లయితొలగించండిఆటవెలది
చంపువాడవీవె? చచ్చు వారలు వారె?
జరుగు నా వలననె సర్వమిలను
మానవుడు నిమిత్తమాత్రుడనఁగఁ బార్థ!
నాది కానిదేది నీది కాదు!
మత్తకోకిల
కాదు చంపెడు వాడవీవయ! కాదు వారలు చచ్చుటే
నాదధీనమునందు సర్వము నర్మగర్భముగా మనున్
యోధ! ప్రాణి నిమిత్తమాత్రుడు నుర్వియందునఁ జూడగా!
నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా!
ఏది శాశ్వతమ్మదేదియశాశ్వతం
రిప్లయితొలగించండిమిధ్యయే సకల మవిద్య చేత
నాదినాదనియెడు వాదులాటేలరా
నాది కానిదేది నీది కాదు
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రియుడును ప్రియురాలు ప్రేమగ మాట్లాడు
కొనెడు వేళను ప్రియు డనియె నిటుల
నాది నీది యనుచు భేదమేల మనలో
నాది కానిదేది నీది కాదు.
రిప్లయితొలగించండినాది నాది యనుచు నా యాస్తి నీదని
చెప్పు కొనుచు మురియు చిన్న దాన
యెన్ని చూప నేమి యన్నుల మిన్నరో
నాది కానిదేది నీది కాదు.
ఏది నీదని చెప్పుచుంటివి యిట్టి సృష్టిని గాంచగా
నీది నీదని చెప్పు జన్మమదెప్పుడీ భువి వీడునో
యాదరించిన వాడె నిన్నిక యప్యయమ్మును జేయడే
నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా.
తనయుడు దన తండ్రి దరికేగి యిట్లనె
రిప్లయితొలగించండి"అమ్మ పేరున గల యాస్తి నిడుము "
సుద్దులను దెలుపుచు సుతునితో పితయనె
“నాది కానిదేది నీది కాదు”
నీదు వెంట వచ్చు నీసొంతమేదిరా
రిప్లయితొలగించండినాది నాదటంచు వాద మేల
నాది యన్న తలపు నాశన హేతువే
నాది కానిదేది నీది కాదు
ఏది నీదని వెంట బెట్టుకు నేగుచుందువు స్వర్గమే
నాది నాదను తత్పరత్వము నాటకమ్ముర భూమిపై
నాది నీదను భేదభావము నాశనమ్ముకు హేతువౌ
నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా