మనసు గెలిచిన పడతి తో మనువటంచు ప్రేమ తో వచ్చి మనలను పిలిచె కనుక వెళ్ళ వలయునటంచును వేడు కొనగ తన సతి, వివాహమున్ జూడఁ దాను నేఁగె.
ధనమది లేనివాడు తన తమ్ముడు పట్టణ మందు వేడ్కగా మనసుకు నచ్చినట్టి యొక మానిని తో మనువంచు పిల్చెనే మనలను, కాదు కూడదన మంచిది కాదని యంచు పోరగా తన సతి, పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో.
ఆరుపదుల ప్రాయంపువాడైననాడు
రిప్లయితొలగించండిబంధుమిత్రులు పరివార బలగమెల్ల
ఇష్టపూర్తిన సల్పంగ షష్టిపూర్తి
తన సతి వివాహమున్ జూడఁ దాను నేఁగె
చ.
రిప్లయితొలగించండిపనిగొని కష్టముల్ పడి విపత్తుల నిల్చుచు పొందితేను నా
ధనమును దొంగిలించి యిలు దాటిన వాని కనుంగొనంగ నీ
దినమున బూని పట్టెదము తెల్లము వాడొక మాయి పాడు గీ
ర్తన సతి ! పెండ్లి జూచుటకు దాను జనెన్ హితబంధుకోటితో !
రిప్లయితొలగించండిమనసు గెలిచిన పడతి తో మనువటంచు
ప్రేమ తో వచ్చి మనలను పిలిచె కనుక
వెళ్ళ వలయునటంచును వేడు కొనగ
తన సతి, వివాహమున్ జూడఁ దాను నేఁగె.
ధనమది లేనివాడు తన తమ్ముడు పట్టణ మందు వేడ్కగా
మనసుకు నచ్చినట్టి యొక మానిని తో మనువంచు పిల్చెనే
మనలను, కాదు కూడదన మంచిది కాదని యంచు పోరగా
తన సతి, పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో.
శర్వరుని బాణ మహిమన శైలసుతకు
రిప్లయితొలగించండిశంకరుని దోడ బెండిలి జరుగుచుండ
పరువతపు రాజు కూతుగ పైకొనిన క
తన , సతి వివాహమున్ జూడఁ దాను నేఁగె
తేటగీతి
రిప్లయితొలగించండిపుట్టనుండెడి దేవునిఁ బురము చేర్చి
కోవెలన్ గట్టి గోపన్న కూర్చి నగల
మురిసి శ్రీరామనవమికి ముందు నడువ
తన సతి, వివాహమున్ జూడఁ దాను నేఁగె
చంపకమాల
వనమున పుట్టలో గనుచు భక్తుడు గోపన రామమూర్తినిన్
వినయము మీర కోవెలను విత్తము గూరిచి కట్టి భూషలన్
ఘనముగ పేర్చ, భద్రగిరిఁ గన్నుల పండువఁ జేయ దీర్చఁగన్
దన సతి, పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో
( ఒక యదార్థ సంఘటన ఆధారంగా...)
రిప్లయితొలగించండిచం. మా.
మనువుకు ముందు వేరొకరు మానసమందు వసించ, నట్టి దా
ని నెఱిగి కోపగించకను,నిల్చుచు భార్యకు నండదండగా...
విని వశ మాట ప్రేమికుల పెండిలి జేయగ నిశ్చయించుచున్
దన సతి పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
పెండ్లి చూడగ రమ్మను పిలుపు తోడ
రిప్లయితొలగించండివినయ సంపన్ను డొక్కడు వేడుకొనగ
విలువగు పలుకాన్కలతోడ, వెంటనుండ
తనసతి, వివాహమున్ జూడఁ దాను నేఁగె
వినయము చూపు సేవకుడు పెండ్లికి రమ్మని పిల్చి వేడగా
ఘనమగు యోగ్యమైన పలు కానుక లిచ్చుట భావ్యమంచు తాఁ
గనకపు భూషణమ్ములను కాన్కలఁ జేగొని, వెంటనుండగా
తనసతి, పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో