21, నవంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5311

22-11-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుంతీసుత గణపతి మన కోర్కెల్ దీర్చున్”
(లేదా...)
“కుంతీపుత్ర వినాయకున్ గొలిచినన్ గోర్కెల్  ఫలించున్ గదా”
(డా॥ పిలకా శాంతమ్మ అక్కయ్య గారికి ధన్యవాదాలతో...)

15 కామెంట్‌లు:

  1. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో...

    కందం
    చింతలు విఘ్నములు దొలుఁగ
    వంతలుఁ బాయఁ దొలుత భక్త్యాత్ముఁడవై
    స్వాంతన నొందంగఁ గొలువఁ
    గుంతీసుత! గణపతి మన కోర్కెల్ దీర్చున్

    శార్దూలవిక్రీడితము
    పంతమ్మున్ విడ రాజరాజు వినకే ప్రాప్తించె యుద్ధమ్ము నీ
    వింతల్ చేసిన యత్నముల్ సడలె, నిర్వేదమ్ము పోనాడుచున్
    జింతల్ విఘ్నములెల్లఁ దొల్గఁ దొలుతన్ సేవించి భక్త్యాత్మవై
    కుంతీపుత్ర! వినాయకున్ గొలిచినన్ గోర్కెల్ ఫలించున్ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరింపబడిన కందం:

      కందం
      చింతలు విఘ్నములు దొలుఁగ
      వంతలు వాయంగఁ దొలుత భక్త్యాత్ముఁడవై
      స్వాంతన నొందంగఁ గొలువఁ
      గుంతీసుత! గణపతి మన కోర్కెల్ దీర్చున్

      తొలగించండి
  2. ఎంతటి ప్రతాప మున్నను
    సుంతయు భగవంతునికృప శూరునకు వలెన్
    దంతీముఖుఁ వేడుమి ఓ
    కుంతీ సుత; గణపతి మన కోర్కెల్ దీర్చున్

    రిప్లయితొలగించండి

  3. పంతము బూనుచు కౌరవు
    లెంతయొ హింసించి రంచు నెందుల కిట్టుల్
    చింతించెదవోయి వినుమ
    కుంతీసుత! గణపతి మన కోర్కెల్ దీర్చున్


    కాంతన్ జేగొని కానలన్ దిరుగెడిన్ కాలంబునే దల్చుచున్
    చింతింపంగ నదేలనోయి వినుమా శ్రీకృష్ణుడే యాప్తుడై
    సంతోషమ్మును గూర్చు, నైన నికపై సంకోచమున్ వీడుచున్
    గుంతీపుత్ర! వినాయకున్ గొలిచినన్ గోర్కెల్ ఫలించున్ గదా.

    రిప్లయితొలగించండి
  4. పంతులు శిష్యుని పేర్కొని ,
    పొంతన లేని పదమొకటి పొంకించు మనన్
    అంతేవాసి యనె నిటుల
    కుంతీ సుత గణపతి మన కోర్కెల్ దీర్చున్

    రిప్లయితొలగించండి

  5. శంకరాభరణం... 22 / 11 /2025

    సమస్య

    " కుంతీపుత్ర వినాయకున్ గొలిచినన్ గోర్కెల్ ఫలించున్ గదా”

    ( కురుక్షేత్రములో బంధువులను చూచి బాధపడుతున్న కిరీటితో శ్రీ కృష్ణని ఉవాచ )

    శార్ధూలము

    సుంతన్ జూపకు జాలి బంధువుల టంచున్ వాజిలో...నర్హులే

    యంతంబొనర్చ నిల్చినారు గద నన్యాయంపు బక్షంబునే

    పంతంబేల? గణేశుఁ దల్చుచు మదిన్ బాణమ్ము సంధించు మో
    కుంతీపుత్ర! వినాయకున్ గొలిచినన్ గోర్కెల్ ఫలించున్ గదా”

    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  6. (సూత మహాముని ధర్మరాజుతో)
    పంతంబూని దురోదరంబనుచు దుర్వ్యాజంబునన్ జ్ఞాతులే
    కాంతారంబుల పాలు జేసిరకటా కష్టంబులన్ బాపు మీ
    వంతౌ రాజ్యము శాంతి సౌఖ్యములు సంభావ్యంబుగా దక్కునో
    కుంతీపుత్ర; వినాయకున్ గొలిచినన్ గోర్కెల్ ఫలించున్ గదా

    రిప్లయితొలగించండి
  7. పంతము నెరవేరును గద
    చింతింపవలదు విజయము శీఘ్రమె నీకున్
    సొంతము కాగలదు నిజము
    కుంతీసుత! గణపతి మన కోర్కెల్ దీర్చున్

    చింతాక్రాంతుడవై భరింపదగునా ఛీత్కారముల్ సల్పినన్
    వింతేమున్నది దుర్మదాంధుడతడే విస్పష్టతన్ గాంచుమా
    పంతంబేల సయోధ్యకై రణమునన్ బాపాత్ములన్ గెల్వుమా
    కుంతీపుత్ర! వినాయకున్ గొలిచినన్ గోర్కెల్ ఫలించున్ గదా

    రిప్లయితొలగించండి
  8. వంతలు బాపగ వేడుచు
    కాంతను గూ డియు గొలువగ గౌరీ సూ ను o
    డంత ము సేయు నిడుము లను
    గుంతీ సుత! గణపతి మన కోర్కె ల్ దీర్చు న్

    రిప్లయితొలగించండి
  9. చింతలు తొలగును మనకిక
    స్వాంతము నందున నెలకొను సాంత్వన మదిన
    శ్రాంతము గణపతిఁ నిలుపుము
    కుంతీసుత! గణపతి మన కోర్కెల్ దీర్చున్

    రిప్లయితొలగించండి
  10. చింతన్బూనగనేల చిత్తమున సంక్షేమంబు చేకూరులే
    ధ్వాంతమ్ముల్ విడిపోయి నిశ్చితము నుద్భాసమ్ము వ్యాపించగా
    స్వాంతంబందున భక్తి నెక్కొనఁగ నశ్రాంతంబు సంసక్తితో
    కుంతీపుత్ర! వినాయకున్ గొలిచినన్ గోర్కెల్ ఫలించున్ గదా

    రిప్లయితొలగించండి
  11. కం: చింతించకు గురువును నీ
    "వంతము జేయుట తగ" దని యా పని "తనదౌ
    వం"తను సేనాపతియే
    కుంతీసుత ! గణపతి మన కోర్కెల్ దీర్చున్”
    (పాండవుల సేనాపతి దృష్టద్యుమ్నుడు.అర్జునా! గురువుని చంపటం పాప మని నువ్వు చింతించకు.ఆ పాపం తనవంతుగా సేనాపతి ఐన దృష్టద్యుమ్ను డున్నాడు అని.ఇక్కడ గణపతిని సేనాపతి అనే అర్ధం లో వాడాను.)

    రిప్లయితొలగించండి
  12. కృష్ణుడు అర్జునునికి తెలుపుట

    కం॥ సాంతము రక్షఁ గనననిని
    సంతుష్టునిఁ జేయఁ దగును సామజపు ముఖున్
    సుంతయు సందేహించకు
    కుంతీ సుత! గణపతి మన కోర్కెల్ దీర్చున్

    కృష్ణుడు రాజసూయానికి ముందు ధర్మరాజుకు హిత బోధ

    శా॥ శాంతాకారుఁడు నేకదంతుఁడు సదా సాఫల్య మేపారఁగన్
    సంతోషంబుగ భక్త పాలకుఁడుగన్ సద్భాగ్య సంధాతయై
    ఎంతోరక్ష నొసంగి ప్రోచు దయతో నెల్లప్పుడున్ గాంచుమా
    కుంతీపుత్ర! వినాయకున్ గొలిచినన్ గోర్కెల్ ఫలించు గదా!

    సామజము ఏనుగు

    రిప్లయితొలగించండి
  13. శా:చింతించెన్ శపథమ్ము కుంతి కిడుటన్ జే జిక్క భీముండు,తా
    నెంతో మేల మొనర్చి కర్ణు డనె "నీ కిష్టమ్ము పాకమ్ములే,
    వంతల్ వీడుము యుద్దమంచు, రుచి గా పాకమ్ము లర్పించి యో
    కుంతీపుత్ర! వినాయకున్ గొలిచినన్ గోర్కెల్ ఫలించున్ గదా”

    (కర్ణుడు అర్జునుదు తప్ప పాండవులలో ఎవరు చిక్కినా చంప నని మాట ఇచ్చాడు.భీముడు తన చేతికి చిక్కగా "నీకు వంటలు చాలా ఇష్తం కదా! యుద్ధం దేనికి? రుచి ఐన పిండివంటలు చేసి వినాయకుడికి దణ్నం పెట్టుకో అన్నట్లు.)

    రిప్లయితొలగించండి
  14. అశ్వత్థామ హతః...... అన్నందుకు వ్యాకులమందిన ధర్మరాజుతో కృష్ణుడు...)

    కం॥
    చింతించకు బొంకితినని
    వంతే మిగులను వటరుల పంచన యున్నన్
    సుంతగు నోపికఁగనుమా
    కుంతీసుతగణ పతి మన కోర్కెల దీర్చున్

    (కుంతీసుతగణ పతి: పాండవ సైన్యాధ్యక్షుడు- ధృష్టద్యుమ్నుడు)

    రిప్లయితొలగించండి