22, నవంబర్ 2025, శనివారం

సమస్య - 5312

23-11-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వక్త్రముల్ పది గల్గినవాఁడు శివుఁడు”
(లేదా...)
“వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో”

5 కామెంట్‌లు:


  1. దనుజు డైనను గాంచగా ధరణి యందు
    భక్తు లందున మేటి రావణుడతండు
    వక్త్రముల్ పది గల్గినవాఁడు, శివుఁడు
    వాని కిష్టదైవమటంచు వాసి గాదె.


    వక్త్రంబొక్కటి కల్గినట్టి నరునిన్ బద్యంబు నేరీతిగా
    నీ క్త్రా ప్రాసనుజేసి వ్రాయగలనో యే తల్లి దీవించునో
    వక్త్రంబొక్కటె యున్న వాని కిలలో భక్తుండ కే కాంచగా
    వక్త్రంబుల్ పది గల్గు, సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో.

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    శివమునొసఁగు దైవమనుచు చేసితపము
    కరుణగనలేక రజితాద్రి శిరమునెత్త,
    గర్వమడచ నణగఁ ద్రొక్కె! ఘనులెవరన?
    వక్త్రముల్ పది గల్గినవాఁడు! శివుఁడు!

    శార్దూలవిక్రీడితము
    ఈక్త్రా ప్రాసగ నిచ్చిపూరణలకై యెంచంగ భావ్యమ్మొకో!
    వక్త్రంబెంతయొ తల్లడిల్లె గురువా! ప్రజ్ఞన్ ప్రసాదించెడున్
    యక్త్రమ్మీయగ దిక్కులెన్మిదియు భూమ్యాకాశముల్ గూడుచున్
    వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో

    రిప్లయితొలగించండి
  3. లంక పురమున కధిపతి రావణుండు
    సకల శాస్త్రము లెరిగిన చంచురుండు
    వక్త్రముల్ పది గల్గినవాఁడు, శివుఁడు
    వాని దైవము, రాముని పగతుఁడతఁడు

    రిప్లయితొలగించండి
  4. ఖరువుగ కుజ నపహరించు కతన దుష్టు
    డయ్యె , రావణుడనెడి వాడతని మయిన
    వక్త్రముల్ పది గల్గినవాఁడు , శివుఁడు
    మెచ్చె నాతని భక్తీ నమితపు రీతి

    రిప్లయితొలగించండి