24, నవంబర్ 2025, సోమవారం

సమస్య - 5314

25-11-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్”
(లేదా...)
“ఆత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్”

6 కామెంట్‌లు:

  1. ఆత్మజునకు జెప్పితి జీ
    వాత్మకు వలయు దగినంత పరిమాణమునన్
    ఆత్మవిసువాసము , మరియు
    ఆత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్

    రిప్లయితొలగించండి

  2. ఆత్మీయులు చెప్పెదరే
    యాత్మశ్లాఘమ్మఘమని యది వలదని పు
    ణ్యాత్ములు పలికెద రేవిధి
    యాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్?


    ఆత్మీయుల్ ఘనులైన వారెపుడు సత్యార్థంబులే పల్కు పు
    ణ్యాత్ముల్ వారల మాటలన్ వినక సన్మార్గంబునే వీడి హీ
    నాత్ముల్ నెయ్యపు గాండ్ర మాటలు వినే యల్పుండవే ఎట్టులో
    యాత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్?

    రిప్లయితొలగించండి
  3. ఆత్మానందమొసఁగు పర
    మాత్మను మనసార గొలుచు మానవులకు, దే
    హాత్మల భేదముఁగని పర
    మాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్

    రిప్లయితొలగించండి
  4. కందం
    ఆత్మీయముగ పలికి న
    ధ్యాత్మిక జ్ఞానమ్ము వడసి ధన్యులగుచు పా
    పాత్ముల మార్చియు వీడిన
    నాత్మశ్లాఘమ్మె, తెచ్చు నలఘుయశమ్మున్


    శార్దూలవిక్రీడితము
    ఆత్మీయమ్ముగ పల్క నేర్చి భువిలో నందించి సాయమ్ము య
    ధ్యాత్మానందము పొందుమార్గమును సంధానించి లోకాన పా
    పాత్ముల్ సైతము మార్పునొందునటులన్ వర్తించి వీడంగనే
    నాత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్

    రిప్లయితొలగించండి
  5. ఆత్మజ్ఞానమునను పర
    మాత్మనెఱిగి మరుగఁ గల్గు మాన్యతయశముల్
    ఆత్మద్రోహమె దలచగ
    ఆత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్

    రిప్లయితొలగించండి
  6. ఆత్మానందమ్ము కొరకు
    నాత్మజ్ఞానమును బడయు మప్రతిహతమై
    ఆత్మ ధృతిని సల్పిన పర
    మాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్

    ఆత్మజ్ఞానము కోరి పొందుట సుసాధ్యంబౌను యత్నంబుతో
    నాత్మానందమటంచు సల్పు పనులే హాస్యాస్పదంబుల్ గదా!
    ఆత్మజ్ఞానము లేని మోక్షమెటులో హా! సల్పుటన్ వీడు నీ
    యాత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్

    రిప్లయితొలగించండి