27, నవంబర్ 2025, గురువారం

సమస్య - 5317

28-11-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వగృహము లేనట్టివాఁడె భద్రతఁ గాంచున్”
(లేదా...)
“స్వగృహము లేనివాఁడె కడు భద్రతఁ గాంచును జీవితమ్మునన్”

7 కామెంట్‌లు:

  1. చ.
    మొగమున నవ్వులం జిలికి ముచ్చటలాడెడు మంచి వాడు పె
    న్నగముగ నిల్చి కష్టముల నల్లుల మాడ్కిని చూచి యోర్పుతో
    న్మగనిగ చాన యిష్టములు నందము నిచ్చెడు మేటి, వాడె యా
    స్వగృహము లేని వాడె కడు భద్రత గాంచును జీవితమ్మునన్ !

    రిప్లయితొలగించండి
  2. కందం
    స్వగతమ్మశాంతినిండఁగఁ
    దగవులు న్యాయసభ సతమతమొనరఁ జేయన్
    రగిలించు వ్యాజ్యభరితఁపు
    స్వగృహము లేనట్టివాఁడె భద్రతఁ గాంచున్


    చంపకమాల
    స్వగతమునందునన్ సతమశాంతికి కారణమౌ వివాదముల్
    దిగులొనగూర్చ న్యాయసభ తేల్చక నిత్యము సాగదీయగన్
    రగులగఁ జేయుచున్ స్థిరతరంబగు భావవ మృగ్యమైనదన్
    స్వగృహము లేనివాఁడె కడు భద్రతఁ గాంచును జీవితమ్మునన్

    రిప్లయితొలగించండి

  3. భగభగ మండుధరలతో
    జగతిని స్థలమును కొనక వసతి కై బా
    డుగ యింట నుండ మేలగు
    స్వగృహము లేనట్టివాఁడె భద్రతఁ గాంచున్.


    సుగమము కాదు నేడిలను సొంతముగా గృహమన్న కోట్లలో
    న గయము ఖర్చు చేసి భవనమ్మును గట్టుట పేద వారికిన్
    గగనము బాడుగిల్లె శరకమ్మని తల్చెడి వాడు చెప్పెనే
    స్వగృహము లేనివాఁడె కడు భద్రతఁ గాంచును జీవితమ్మునన్.

    రిప్లయితొలగించండి
  4. ఎగువగు తుఫాను తాకిడి
    కి గృహపు పటలములు పయికెగిరిపోవంగా
    నెగులుండదు తిరిగి నిలుప ,
    స్వగృహము లేనట్టివాఁడె భద్రతఁ గాంచున్

    రిప్లయితొలగించండి



  5. శంకరాభరణం

    సమస్య 28/11/2025


    “స్వగృహము లేనివాఁడె కడు భద్రతఁ గాంచును జీవితమ్మునన్

    చంపకమాల

    వగచుట యేల సంసృతినిఁ బాలనఁ జేయుట దుర్లభమ్మనిన్

    జగముల నేలు త్ర్యంబకుడు శర్వుడు క్ష్వేళగళుండె యుండగా

    నగణిత భక్తి భావమునఁ నర్చనఁ జేయుచుఁ నార్థి వేడుచో

    స్వగృహము లేనివాఁడె,కడు భద్రతఁ గాంచును జీవితమ్మునన్

    ( శివుడు పర్వతాలలో, శ్మశానాలలో నివసిస్తాడు కదా...)

    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి



    రిప్లయితొలగించండి
  6. వెగటని వీడి కుటుంబము
    జగమున తిరుగాడువారు సన్యాసికుడే
    జగదధిపతి రక్షయని
    స్వగృహము లేనట్టివాఁడె భద్రతఁ గాంచున్

    వెగటుగఁ దోచ జీవితము వీడుచు సంసృతి తాను భిక్షువై
    జగమున సంచరించుగద సాధువు చూడగ దైవ శోధనన్
    జగతిని గాచువాడె తన సంశ్రయ మంచు తలంచు చుండనా
    స్వగృహము లేనివాఁడె కడు భద్రతఁ గాంచును జీవితమ్మునన్

    రిప్లయితొలగించండి
  7. నగరపు బ్రతుకున జీతము
    మిగలక, ప్రత్యహము జనులు మిడుకుచు బ్రతకన్
    తగునే దుర్గతిగని యన
    స్వగృహము లేనట్టివాఁడె భద్రతఁ గాంచున్

    రిప్లయితొలగించండి