8, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5328

9-12-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరుణ లభియించెఁ దీరవు కాంక్షలయ్యొ”
(లేదా...)
“కరుణకు నోఁచుకొంటి మఱి కాంక్షలు దీర వదేమి చిత్రమో”

6 కామెంట్‌లు:

  1. పూర్వజన్మ సంచితపాపమో మరేమొ
    భక్తి మదిలోన నిండార పాదుగొలిపి
    దేవదేవుని పూజింప దివ్యమైన
    కరుణ లభియించెఁ, దీరవు కాంక్షలయ్యొ

    రిప్లయితొలగించండి
  2. కురుక్షేత్ర సంగ్రామ ముగింపు దశలో రారాజు అంతరంగము:

    తేటగీతి
    క్రీడి సాదిగ మాత్రమే కృష్ణుఁడున్న
    గెల్పు నాకేల దక్కదో? కిటుకదేమొ?
    సర్వసైన్యమ్మొసఁగ నాకు చక్రిదైన
    కరుణ లభియించెఁ! దీరవు కాంక్షలయ్యొ!

    చంపకమాల
    నరునకు తేరునన్ మిగిలె నందకిశోరుడు! నైన గెల్పు మా
    పరిధిని కానరాదొకొ! విపత్కరమయ్యె రణమ్మదేలనో!
    మురహరి సర్వసైన్యమును పోరున సాయమునొంది వారిదౌ
    కరుణకు నోఁచుకొంటి మఱి కాంక్షలు దీర వదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  3. తే.గీ.

    భక్తియందునఘనుడైన వాడునైన
    క్రోధ,కామాది గుణములన్ కూడినపుడు
    విభుడు,విష్ణువులిరువురి విహితమైన *కరుణలభియించెఁదీరవుకాంక్షలయ్యొ*

    ✍️*ఇంద్రకంటి భార్గవ నృసింహ శర్మ*

    రిప్లయితొలగించండి
  4. కరములు మోడ్చి నెమ్మనము కైటభమర్దను పైన నిల్పి నే
    శరణము గోరి శ్రీపతిని సక్తముగా భజియింప భక్తితో
    కరుణకు నోఁచుకొంటి, మఱి కాంక్షలు దీర వదేమి చిత్రమో
    సరవిని పూర్వజన్మకృత సంచితపాప ఫలమ్ము కానగున్

    రిప్లయితొలగించండి

  5. పద్మ నాభుడే వడువైన ఫలమదేమి?
    సుతుని ముద్దు ముచ్చటలను చూచు భాగ్య
    మదియె లేదంచు దేవకి యనియె నిట్లు
    కరుణ లభియించెఁ, దీరవు కాంక్షలయ్యొ.


    మెరమెర లందు మ్రగ్గితిని మిక్కిలి ప్రేమ నటించు భ్రా తయే
    పొరగొనె నందివర్ధనుల, పుత్రునిగా నిల నాదు గర్భమున్
    విరజుడు పుట్టనేమి యిట పెంచెడి భాగ్యము దక్క దయ్యెనే
    కరుణకు నోఁచుకొంటి మఱి కాంక్షలు దీర వదేమి చిత్రమో.

    రిప్లయితొలగించండి
  6. వేడుక పయనములకేగ పితరునడుగ
    కరుణ లభియించెఁ ; దీరవు కాంక్షలయ్యొ !
    నేడు వ్యోమయానము లన్ని నిలిపి వేయ
    బడుట నా తలరాతగ పరిగణీంతు

    రిప్లయితొలగించండి