6-12-2025 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కరువు జీవులకున్ మోదకరము సుమ్ము”(లేదా...)“కరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”
తేటగీతిచినుకు ధాన్యము సమకూర్చు జీవులకనఁగడుపునిండినన్ గాదె యాకలి శమించుశ్రావణమున మబ్బు కురిసి సడలినంతకరువు, జీవులకున్ మోదకరము సుమ్ముచంపకమాలకురిసెడు మేఘమే భువిని గుప్పును ధాన్యము జీవకోటికీన్దొరికిన తిండి యాకలిని దూరము సేయుచు శక్తినిచ్చునేయురుమెడు మబ్బులున్ గురియ నొప్పెడు రీతిని వీడినంతటన్కరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్!
పంట లెండుచు నుండగా బాధ పడె డు కర్ష కాళికి హర్షము కలుగు నట్లు మెండు వర్షము కురియగా మేలు గాగ కరువు జీవుల కున్ మోద కరము సుమ్ము
దివ్య దీపావళీ పర్వదినములందు పిల్లలకు క్రొత్తవస్త్రముల్ పేర్మిఁ గొనగ నొనర యజమాని కూరిమినొసగు సంౘ కరువు జీవులకున్ మోదకరము సుమ్ముసంౘకరువు : advance money
వర్ష లేమితో ప్రజలెల్ల బాధ పడిన నేమి పరమాత్మ దయతోడ నిప్పు డచట భూరి వృష్టికురిసి విడి పోయిన నిక కరువు, జీవులకున్ మోదకరము సుమ్ము.వరుణుడె యాగ్రహించి గత వత్సర మంతయు వర్షలేమితో నరటము చెంది రెల్లరు బృహత్తు కటాక్షము తోడ కాంచగా సరియగు వర్షముల్ కురిసి సంకటముల్ విడినంత వీడినన్ గరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్.
దారి దొరకుటయే చాలు తప్పకుండ మోసగించు చుండెడి కాలమున సతతమునేపనైన జేసెడి ముందు యిచ్చు సంచకరువు జీవులకున్ మోదకరము సుమ్ము”
శంకరాభరణం Dt. 06-12-2025 (శుక్రవారం ) సమస్య - 5324“కరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”చంపకమాల************( పల్నాడు ప్రాంతములో నీటి ఎద్దడి చూచి చలించిన శ్రీనాథ కవిసార్వభౌమ ఉవాచ ఇది )సిరిగల వానికిన్ మిగులఁ జెల్లునుగాఁ బదునారువేలుగన్దరణుల బెండ్లి యాడుచును దారలఁజక్కగఁ జూచి యేలగన్తిరిపెము కిద్దరాండ్ర? విను దేవర! పార్వతి చాలు గాదొకో?కరుణను గంగనున్ విడుము కాటకమే నశియించ ; వీడుచోకరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్ ఆకుల శాంతి భూషణ్ వనపర్తి.
తరువుల బెంచి రమ్యముగ ధాత్రిని పచ్చదనంబు నిండ శ్రీ కరముగ పాడిపంటలు ప్ర కామ పథంబున సాగ విశ్వమున్ పరిగొను కాలుషాగ్నుల ప్రభావ విపత్పరిణామమొంద నాకరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంత సౌఖ్యముల్!ఆకరువు=సమాప్తి
తేటగీతి
రిప్లయితొలగించండిచినుకు ధాన్యము సమకూర్చు జీవులకనఁ
గడుపునిండినన్ గాదె యాకలి శమించు
శ్రావణమున మబ్బు కురిసి సడలినంత
కరువు, జీవులకున్ మోదకరము సుమ్ము
చంపకమాల
కురిసెడు మేఘమే భువిని గుప్పును ధాన్యము జీవకోటికీన్
దొరికిన తిండి యాకలిని దూరము సేయుచు శక్తినిచ్చునే
యురుమెడు మబ్బులున్ గురియ నొప్పెడు రీతిని వీడినంతటన్
కరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్!
పంట లెండుచు నుండగా బాధ పడె డు
రిప్లయితొలగించండికర్ష కాళికి హర్షము కలుగు నట్లు
మెండు వర్షము కురియగా మేలు గాగ
కరువు జీవుల కున్ మోద కరము సుమ్ము
దివ్య దీపావళీ పర్వదినములందు
రిప్లయితొలగించండిపిల్లలకు క్రొత్తవస్త్రముల్ పేర్మిఁ గొనగ
నొనర యజమాని కూరిమినొసగు సంౘ
కరువు జీవులకున్ మోదకరము సుమ్ము
సంౘకరువు : advance money
రిప్లయితొలగించండివర్ష లేమితో ప్రజలెల్ల బాధ పడిన
నేమి పరమాత్మ దయతోడ నిప్పు డచట
భూరి వృష్టికురిసి విడి పోయిన నిక
కరువు, జీవులకున్ మోదకరము సుమ్ము.
వరుణుడె యాగ్రహించి గత వత్సర మంతయు వర్షలేమితో
నరటము చెంది రెల్లరు బృహత్తు కటాక్షము తోడ కాంచగా
సరియగు వర్షముల్ కురిసి సంకటముల్ విడినంత వీడినన్
గరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్.
దారి దొరకుటయే చాలు తప్పకుండ
రిప్లయితొలగించండిమోసగించు చుండెడి కాలమున సతతము
నేపనైన జేసెడి ముందు యిచ్చు సంచ
కరువు జీవులకున్ మోదకరము సుమ్ము”
శంకరాభరణం
రిప్లయితొలగించండిDt. 06-12-2025 (శుక్రవారం )
సమస్య - 5324
“కరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”
చంపకమాల
************
( పల్నాడు ప్రాంతములో నీటి ఎద్దడి చూచి చలించిన శ్రీనాథ కవిసార్వభౌమ ఉవాచ ఇది )
సిరిగల వానికిన్ మిగులఁ జెల్లునుగాఁ బదునారువేలుగన్
దరణుల బెండ్లి యాడుచును దారలఁజక్కగఁ జూచి యేలగన్
తిరిపెము కిద్దరాండ్ర? విను దేవర! పార్వతి చాలు గాదొకో?
కరుణను గంగనున్ విడుము కాటకమే నశియించ ; వీడుచో
కరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి.
తరువుల బెంచి రమ్యముగ
రిప్లయితొలగించండిధాత్రిని పచ్చదనంబు నిండ శ్రీ
కరముగ పాడిపంటలు ప్ర
కామ పథంబున సాగ విశ్వమున్
పరిగొను కాలుషాగ్నుల ప్ర
భావ విపత్పరిణామమొంద నా
కరువు, సమస్తజీవులకుఁ
గల్గఁగఁ జేయు ననంత సౌఖ్యముల్!
ఆకరువు=సమాప్తి