19-12-2025 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వేము తీయన యనె నెట్లు వేమన కవి”(లేదా...)“వేము తీయన యన్న వేమన విజ్ఞుఁ డెట్లగుఁ దెల్పుమా”
వేమన శతకమును నేర్పు వేళ గురువు నడిగె నారేళ్ళ వయసున్న యంత వాసి చేదనుచు జనులెల్లరు చెప్పు నట్టి వేము తీయన యనె నెట్లు వేమన కవి.వేమనార్యుని గూర్చిచెప్పెడి వేళ నడ్గెను బాలుడేవేము చేదని చింత పుల్పని విశ్వమెల్ల యెఱుంగు గా దే మరేల మహాత్ముడా కవి యిట్లు తా వచియించెనోవేము తీయన యన్న వేమన విజ్ఞుఁ డెట్లగుఁ దెల్పుమా!
వేము తీయన యనె నెట్లు వేమన కవి”యందువా! యేప నినయిన నభ్యసించి ,,యాచరించ గక్కస ముండదని గురుతుగ , నలవడగ వేమ యిన దీపి యగుట దెలిపె
శంకరాభరణం సమస్య .....19/12/2025వేము తీయన యనె నెట్లు వేమన కవి?తే. గీ.అంతవాసి తతి " కనగ ననగ రాగమతిశయిల్లుచునుండు " పద్యమును,దానిభావము తెలిపి... యర్థము వారికైనదేమొ తెలియ గురువు ప్రశ్న నిటుల వేసె,!“వేము తీయన యనె నెట్లు వేమన కవి" ? ( అనగ ననగ.. పద్యం శిష్యులకు చెప్పిభావం అర్థం అయినదో లేదో తెలియగోరి ప్రశ్న ఇటుల వేసినాడువేము తీయన యనె నెట్లు వేమన కవి?దానికి జవాబుగా తినగ తినగ వేము తీయన అని చెప్పాలి....) ఆకుల శాంతి భూషణ్ వనపర్తి
రిప్లయితొలగించండివేమన శతకమును నేర్పు వేళ గురువు
నడిగె నారేళ్ళ వయసున్న యంత వాసి
చేదనుచు జనులెల్లరు చెప్పు నట్టి
వేము తీయన యనె నెట్లు వేమన కవి.
వేమనార్యుని గూర్చిచెప్పెడి వేళ నడ్గెను బాలుడే
వేము చేదని చింత పుల్పని విశ్వమెల్ల యెఱుంగు గా
దే మరేల మహాత్ముడా కవి యిట్లు తా వచియించెనో
వేము తీయన యన్న వేమన విజ్ఞుఁ డెట్లగుఁ దెల్పుమా!
వేము తీయన యనె నెట్లు వేమన కవి”
రిప్లయితొలగించండియందువా! యేప నినయిన నభ్యసించి ,,
యాచరించ గక్కస ముండదని గురుతుగ ,
నలవడగ వేమ యిన దీపి యగుట దెలిపె
శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్య .....19/12/2025
వేము తీయన యనె నెట్లు వేమన కవి?
తే. గీ.
అంతవాసి తతి " కనగ ననగ రాగ
మతిశయిల్లుచునుండు " పద్యమును,దాని
భావము తెలిపి... యర్థము వారికైన
దేమొ తెలియ గురువు ప్రశ్న నిటుల వేసె,!
“వేము తీయన యనె నెట్లు వేమన కవి" ?
( అనగ ననగ.. పద్యం శిష్యులకు చెప్పి
భావం అర్థం అయినదో లేదో తెలియగోరి
ప్రశ్న ఇటుల వేసినాడు
వేము తీయన యనె నెట్లు వేమన కవి?
దానికి జవాబుగా తినగ తినగ వేము తీయన అని చెప్పాలి....)
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి