2, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5322

3-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్”
(లేదా...)
“మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్”

4 కామెంట్‌లు:

  1. సతతము పన్నుల సొమ్మును
    కృతకంబౌ కరుణచూపి కేరింతలతో
    వితరణ సల్పెద నేనను
    మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్

    రిప్లయితొలగించండి
  2. మ.
    శ్రుతి సంభావిత ధర్మ యుక్త సుకృతాస్తోకాళి రాజ్యంబునన్
    రతుడై పెంచుచు తండ్రి భంగి జనులన్ రక్షించి యా జానకీ
    పతి నాదర్మము సేసి రాజవరుడై భాసించి తోడుండ నే
    మతి చాంచల్యము గల్గు ? వాడె ప్రభువై మమ్మెల్ల బాలించుతన్ !

    రిప్లయితొలగించండి
  3. సతతము చదువరులేలఁగ
    గతిమారక జనులు బ్రతుకఁ గగనంబయ్యెన్
    అతిరోతన దలచిరకట
    మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్

    రిప్లయితొలగించండి
  4. సతతము మసనము నందున
    నతులముగా వాసముండు నతఁడు తనువునన్
    వితతము దాలుచు బూడిద
    మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్

    రిప్లయితొలగించండి