27, డిసెంబర్ 2025, శనివారం

సమస్య - 5333

28-12-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మా బట్టల తీరుఁ జెప్ప మాన్యత యగునా”
(లేదా...)
“మే మేబట్టలఁ గట్టఁగా వలయునో మీరెవ్వరో చెప్పఁగన్”

5 కామెంట్‌లు:

  1. బాబేడ్చుట దెలియంగనె
    జేబున ధనమేమిలేక చింతన బడుచున్
    చేబదులుతీసి కొంటిని
    మా బట్టల తీరుఁ జెప్ప మాన్యత యగునా”

    రిప్లయితొలగించండి
  2. ఏమేమీ యిటు మాటలాడఁదగునా యేమంటిరేమంటిరో
    నీమంబుల్ విడనాడి బట్టలు కడున్ నిస్సిగ్గుగా మేనిపై
    భామల్ కట్టుట మేలుకాదనుచు సంభాషింతురే పూరుషుల్
    మే మేబట్టలఁ గట్టఁగా వలయునో మీరెవ్వరో చెప్పఁగన్

    రిప్లయితొలగించండి
  3. ఏమీ విడ్డుర మింత వింత గొనె నే
    మేమో విధానంబులన్
    మీ మా వల్వలు శోభలందనర మే
    ల్మేలంచు సత్సంస్కృతిన్
    ప్రేమన్ జూపి ధరించువారమిట దీ పించంగ నౌత్సుక్యమున్
    మే మేబట్టలఁ గట్టఁగా వలయునో మీరెవ్వరో చెప్పఁగన్?!

    రిప్లయితొలగించండి

  4. ఆ బోగపు చాన తెలిపె
    మా బట్టలు నిండుగున్న మా రాబడి కా
    దే బొక్క, పెద్దలిట్టుల
    మా బట్టల తీరుఁ జెప్ప మాన్యత యగునా?


    మేమీ ఝర్జర వృత్తిలో బ్రతుకుచున్ మీతోషమున్ గోరుచున్
    కామార్థుండ్రిల మెచ్చు దుస్తులవి మా కాయంబునే చూపగా
    క్షేమంబయ్యది కాదటంచు నిటులన్ చీత్కార మేలంటినే
    మే మేబట్టలఁ గట్టఁగా వలయునో మీరెవ్వరో చెప్పఁగన్.

    రిప్లయితొలగించండి
  5. పూబోడులకెన్నడయినఁ
    బ్రాబల్యత దక్కగలదు వలువల వలనన్
    మాబోంట్లను చూచి పొదలి
    మా బట్టల తీరుఁ జెప్ప మాన్యత యగునా

    నీమంబెద్దియు లేని చోట నెలతల్ నిశ్చింతగానుండగా
    కామోద్రేకము పెంచు దుస్తులని వక్కాణించుటే యుక్తమా
    మే మేబట్టలఁ గట్టఁగా వలయునో మీరెవ్వరో చెప్పఁగన్
    రామా!మాకిక రక్షణమ్ము నిడుమా రాద్ధాంతమున్ బాపుమా

    రిప్లయితొలగించండి