4-12-2025 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పతిని నమ్మి భామ భంగపడెను”(లేదా...)“పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్”
కలహభోజనుండు కలికి సత్యాంబతో.....ఆటవెలదిమీరజాలడంచుఁ గూరిమిఁ జూపితే!రుక్మిణమ్మయింటి రుచులఁ దేలిపారిజమ్ము నొసఁగె వరముగ! సత్యాంబ!పతిని నమ్మి భామ భంగపడెను!మత్తేభవిక్రీడితముసతిగా నన్నెపుడైన మీరడనుచున్ జక్రిన్ సమర్థించితే!జతగాడౌచును రుక్మిణీ సతికి పుష్పమ్మున్ ప్రసాదించెనే!కతలన్ జెప్పెదనంచుఁ జూడకుమ! నిక్కంబెంచ సత్యాంబ! యీపతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్!
*(శకుంతల దుష్యంతులు)*పరిణయమ్ము నాడి భార్యగా చేకొందు ననుచు నమ్మ పలికి నట్టి వాడు ప్రభువటంచు నెరగి ప్రశ్రయ మందు భూ పతిని నమ్మి భామ భంగపడెను.యతినందంతి శకుంతలన్ గనుచు నా యందమ్ముకే ముగ్దుడై సతిగా చేకొని రాణి సేతునని దుశ్యంతుండె యా యాశ్రమున్ ప్రతినన్ బూనితి నంచు చెప్పగనె నా వాల్గంటి యావేళ భూ పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్.
అందమైన వాని నార్యునిగ నొసగ ప్రార్థ న నిడె విధికీ బగితి తోడకూరె మగని గ నొక కుడిపి ,య టుల ప్రజాపతిని నమ్మి భామ భంగపడెను
భార్య బిడ్డలన్న పట్టకుండిన వాడుబానిసత్వమునను వ్యసనములకుబాగుపడితి నేను బంగారమిమ్మన పతిని నమ్మి భామ భంగపడెను
కలహభోజనుండు కలికి సత్యాంబతో.....
రిప్లయితొలగించండిఆటవెలది
మీరజాలడంచుఁ గూరిమిఁ జూపితే!
రుక్మిణమ్మయింటి రుచులఁ దేలి
పారిజమ్ము నొసఁగె వరముగ! సత్యాంబ!
పతిని నమ్మి భామ భంగపడెను!
మత్తేభవిక్రీడితము
సతిగా నన్నెపుడైన మీరడనుచున్ జక్రిన్ సమర్థించితే!
జతగాడౌచును రుక్మిణీ సతికి పుష్పమ్మున్ ప్రసాదించెనే!
కతలన్ జెప్పెదనంచుఁ జూడకుమ! నిక్కంబెంచ సత్యాంబ! యీ
పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్!
రిప్లయితొలగించండి*(శకుంతల దుష్యంతులు)*
పరిణయమ్ము నాడి భార్యగా చేకొందు
ననుచు నమ్మ పలికి నట్టి వాడు
ప్రభువటంచు నెరగి ప్రశ్రయ మందు భూ
పతిని నమ్మి భామ భంగపడెను.
యతినందంతి శకుంతలన్ గనుచు నా యందమ్ముకే ముగ్దుడై
సతిగా చేకొని రాణి సేతునని దుశ్యంతుండె యా యాశ్రమున్
ప్రతినన్ బూనితి నంచు చెప్పగనె నా వాల్గంటి యావేళ భూ
పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్.
అందమైన వాని నార్యునిగ నొసగ
రిప్లయితొలగించండిప్రార్థ న నిడె విధికీ బగితి తోడ
కూరె మగని గ నొక కుడిపి ,య టుల ప్రజా
పతిని నమ్మి భామ భంగపడెను
భార్య బిడ్డలన్న పట్టకుండిన వాడు
రిప్లయితొలగించండిబానిసత్వమునను వ్యసనములకు
బాగుపడితి నేను బంగారమిమ్మన
పతిని నమ్మి భామ భంగపడెను