21, డిసెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5327

22-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పైట లాగెను పెఱవాఁడు పతియె మెచ్చె”
(లేదా...)
“పైట చెఱంగుఁ బట్టెఁ బెఱవాఁడు గనుంగొని మెచ్చె భర్తయే”

7 కామెంట్‌లు:

  1. తేటగీతి
    నాటకంబున కృష్ణకు నంద సుతుఁడు
    వలువలొసఁగెడు వేళను ప్రాకుచుండ
    చీరకొంగున నల్లని చిన్న తేలు
    పైట లాగెను పెఱవాఁడు పతియె మెచ్చె!

    ఉత్పలమాల
    నాటకమందు ద్రౌపదికి నందకుమారుఁడు వల్వలిచ్చెడున్
    నీటగు సన్నివేశమున నీరజ నేత్రయె యందుచుండగన్
    బాటున నొక్క కీటకము ప్రాకుచునుండగ కొంగు మీదనే
    పైట చెఱంగుఁ బట్టెఁ బెఱవాఁడు గనుంగొని మెచ్చె భర్తయే!

    రిప్లయితొలగించండి
  2. ద్రౌపతిగ తాను తనభర్త దర్శకునిగ
    తెరకు నెక్కించనమ్మహా భారతమును
    తరుణి వస్త్రాపహరణము జరుగు వేళ
    పైట లాగెను పెఱవాఁడు పతియె మెచ్చె

    రిప్లయితొలగించండి

  3. పతియె కార్యాలయముకేగు పాళ మంద
    తని సపరిచర్య లనుజేయు తరుణి జేరి
    యెత్తు కొనమంచు నేడ్చుచు నత్త దైన
    పైట లాగెను పెఱవాఁడు, పతియె మెచ్చె.



    కూటికి లేని పేదయని కూరిమి జూపుచు నంచ యాన యే
    బేటము తోడ నన్నసుతు బెంచగ తల్లియె లేని బాలకుం
    డాటల నాడి డస్సి తన కాకలి యంచును చెంత జెరుచున్
    పైట చెఱంగుఁ బట్టెఁ బెఱవాఁడు, గనుంగొని మెచ్చె భర్తయే.

    రిప్లయితొలగించండి
  4. తే॥గీ
    వంట పోటీలగెలువగా జంటలడరి
    పదపడి గడబిడలబడి పనులఁ బడగ,
    పొయ్యి లోన జారిన తన పొలతి సిలుకు
    పైట లాగెను పెఱవాఁడు, పతియె మెచ్చె!

    రిప్లయితొలగించండి
  5. వనము నందు భో జనముకై వంట జేయు
    చున్న సమయము నందున సుదతి చీర
    కొంగు నకు సుంత నిప్పంటు కొనుట గాంచి
    పైట లాగెను పెఱవాఁడు పతియె మెచ్చె”

    రిప్లయితొలగించండి
  6. తోటను బూలు గోయ జన
    దోయజనేత్రి మనంబు నంతటన్
    మేటిగనొప్పు వర్ణముల
    మేలిమి కాంతులొసంగు విస్మితిన్
    దాటెడి మార్గమున్ వశము
    దప్పుచు ౙారెడివేళ గావ నా
    పైట చెఱంగుఁ బట్టెఁ బెఱవాఁడు గనుంగొని మెచ్చె భర్తయే!

    రిప్లయితొలగించండి
  7. తే॥ నేఁటి చిత్రసీమఁ గనుమ నీతి వదలి
    ఘాటగు క్షితము జతకు శృంగారమున్నఁ
    దలఁచి ధనముఁ బడయునంచు మలఁచి రిటులఁ
    బైట లాగెను పెఱవాఁడు పతియె మెచ్చె

    ఉ॥ నేఁటికి చిత్రసీమ స్థితి! నీతుల నన్నియు విస్మరించుచున్
    ఘాటుగ హింస ప్రేచఁగను గల్మషమున్న యసభ్యదృశ్వముల్
    నీటుగ సంపదల్ వడయు నిశ్చయ మంచునుఁ జూపిరిట్టులన్
    బైట చెఱంగుఁ బట్టె పెఱవాఁడు గనుంగొని మెచ్చె భర్తయే

    క్షితము హింస

    రిప్లయితొలగించండి