12-12-2025 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఒక దేహమె కాని చావులో పెక్కు లగున్”(లేదా...)“ఒక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా”(రామా చంద్రమౌళి కవి గారికి ధన్యవాదాలతో...)
మ.అకటా జీవితమందు యౌవనపు తేజానీకముల్ వోవ చూ పిక కందోయిని వీడు, చేతులకు పట్టే చచ్చు, నీ చిట్టినో టికి మేలౌ రుచితోడి బంధము తెగున్, డిగ్గుం బలంబప్పుడీ యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపగా మానవా !
కందంఅకలంకమ్మగు విప్లవమొకరిదగునె? నేత వెన్క నుండ బలగమున్సకలమని గూల్చ నాతనిదొక దేహమె? కాని చావులో? పెక్కులగున్!మత్తేభవిక్రీడితముఅకలంకమ్మగు విప్లవమ్మునకు నిస్వార్థమ్ముగన్ నేతయైయొకడే ముందుకు సాగగన్ వెనుక ధీరోదాత్తు లెందెందరోప్రకరమ్మై నడుపంగ నేత దొరుకన్ ప్రాణంబు దీయంగనేయొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా!
మ.
రిప్లయితొలగించండిఅకటా జీవితమందు యౌవనపు తేజానీకముల్ వోవ చూ
పిక కందోయిని వీడు, చేతులకు పట్టే చచ్చు, నీ చిట్టినో
టికి మేలౌ రుచితోడి బంధము తెగున్, డిగ్గుం బలంబప్పుడీ
యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపగా మానవా !
కందం
రిప్లయితొలగించండిఅకలంకమ్మగు విప్లవ
మొకరిదగునె? నేత వెన్క నుండ బలగమున్
సకలమని గూల్చ నాతని
దొక దేహమె? కాని చావులో? పెక్కులగున్!
మత్తేభవిక్రీడితము
అకలంకమ్మగు విప్లవమ్మునకు నిస్వార్థమ్ముగన్ నేతయై
యొకడే ముందుకు సాగగన్ వెనుక ధీరోదాత్తు లెందెందరో
ప్రకరమ్మై నడుపంగ నేత దొరుకన్ ప్రాణంబు దీయంగనే
యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా!