7, డిసెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5327

8-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యమునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్”
(లేదా...)
“యమునికిఁ బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడిఁ బారద్రోలెనే”

10 కామెంట్‌లు:

  1. సమయంబాసన్న మయెన్
    యమలోకముకేగవలయు నని శనినుడువన్
    శమనరిపుడు మార్కండే
    య మునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమయము మించిపోయె యమ సద్మము చేరగ రమ్మటంచు నా
      యమనుడనంగ బీతుకొని హంసుడు దిక్కను నిబ్బరంబుతో
      క్షమకుడు నీలకంఠుని మృకండు తనూజుడు వేడగా తదీ
      య మునికిఁ బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడిఁ బారద్రోలెనే

      తొలగించండి
  2. చ.
    శమదమ సంపదన్ విరిసి చంద్రశిరోమణి నిండుగా మహ
    త్వమతిశయింప నమ్ముకొని తా జని కాచుమనంగ నప్డు పా
    శములను వీడ జేసి గిరిజాధవుడే దిగి వచ్చె భక్తి పూ
    య, మునికి బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడి బారద్రోలెనే !

    రిప్లయితొలగించండి
  3. కం॥
    సమకొన సమగతికంత్యము
    సమవర్తియెపాశమూని సందిట నిలువన్
    శమనరిపుడు మార్కండే
    యమునిన్ బ్రతికింపఁజేసి యమునిం దరిమెన్

    రిప్లయితొలగించండి
  4. కం. సమయంబాయెను నీపతి
    శమనపురికి నేగగయన సావిత్రియును
    త్తమసతి చతురతఁ సత్యని
    యమునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్

    సావిత్రి సత్యవంతుని బ్రతికించుకొన్న వృత్తాంతము

    రిప్లయితొలగించండి
  5. కందం
    నమముల మృకండు సుతుఁడు ని
    యమాల నల్పాయువౌచు నార్తిన్ జుట్టన్
    క్షమియించి లింగడున్ సం
    యమునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్

    చంపకమాల
    నమముల నిత్యమున్ శివుని నమ్మి మృకండుని పుత్ర రత్నమే
    సుమమల నర్చనన్ సలిపి స్తోత్రములన్ జపియించి, భక్తి నం
    తిమ సమయాన పాశమున తీరఁగ లింగనిఁ జుట్ట నార్తి సం
    యమునికిఁ బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడిఁ బార ద్రోలెనే!

    రిప్లయితొలగించండి

  6. అమతపు భయమున్ ద్రోయుచు
    ప్రమదము గూర్చు మని వేడ పశుపతి సౌజ
    న్యమున మృకండు సుతుని సం
    యమునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్.



    అమతము తప్పదయ్యెనిక యర్భక యాశ్రిత పోషకుండిలన్
    ప్రమదము గూర్చు భక్తులకు ఫాలుడొ కండెయటంచు తెల్పగా
    విమలమృకండుజీవనుడు పింగళు వేడగ బ్రీతి తోడ సం
    యమునికిఁ బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడిఁ బారద్రోలెనే.

    రిప్లయితొలగించండి
  7. ||
    (మార్కండేయుని కథ )

    అమతము దప్పదని దెలియ
    నా మహదేవుని గొలువగ నపరాజితుడున్
    సముచితమని ప్రాణం బీ
    య , మునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్”

    రిప్లయితొలగించండి
  8. నామ స్మరణము నందున
    బ్రేమన్ దరిగొన్న శివుడు విమలాత్ముండై
    క్షేమంబుగ మార్కండే
    య మునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్!

    రిప్లయితొలగించండి