28, డిసెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5334

29-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్థిరములయ్యెఁ దటిల్లతల్ చిన్కులెల్ల”
(లేదా...)
“స్థిరములుగాఁ దటిల్లతలుఁ జిన్కులు మారెను కుంభవృష్టిలో”

6 కామెంట్‌లు:

  1. ఘర్మ మెక్కువ కాసెడి కాలమందు
    స్థిరములయ్యెఁ దటిల్లతల్ చిన్కులెల్ల
    జిమ్మ వానగ మారెను చిటికలోన
    వింత గొలుపు చుం డెను దాన్ని వీక్ష జేయ

    రిప్లయితొలగించండి

  2. వాన చినుకులు కురిసెడి పాళ మందు
    బృంద నాట్యమాడెడి సన్ని వేశ మందు
    తడిసిన తనువులుగల యాతరుణులగన
    స్థిరములయ్యెఁ దటిల్లతల్ చిన్కులెల్ల.


    వరుణుడు కుంభవృష్టిగను వాసుర జేరెడి పాళ మందునన్
    మురభిదు డేగుదెంచునని మోహము తోడ నదీ తటమ్మునన్
    పిరిమిని దేవకీ సుతుని ప్రేమను పొందగ నట్టి వేళ లో
    స్థిరములుగాఁ దటిల్లతలుఁ జిన్కులు మారెను కుంభవృష్టిలో.

    రిప్లయితొలగించండి
  3. వెలుగు వాకలు నిలువక మలిగిపోవు
    వానచిన్కులు కొనసాగి పర్వుకొనవు
    కాని వానియందలి రాఠ కనుల నిండి
    స్థిరములయ్యె దటిల్లతల్ చిన్కులల్లె!

    రిప్లయితొలగించండి
  4. వేగవంతమౌ గాలులు వీచు వేళ
    మెరుపులురుములు గనవచ్చె మిక్కుటముగ
    వాన జోరు తగ్గిన సమయాన చూడ
    స్థిరములయ్యెఁ దటిల్లతల్ చిన్కులెల్ల

    సరయువు వేగవంతమయి సత్పధమందున నీటితాల్పులన్
    దరమగ నుద్భవించెను శతహ్రతలున్ గదముల్ మహోగ్రతన్
    మెరుపులు గర్జనమ్ములును మెల్లగ తగ్గిన వేళ చూడగా
    స్థిరములుగాఁ దటిల్లతలుఁ జిన్కులు మారెను కుంభవృష్టిలో

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    ఉరుముల మెరుపులన్ వాన కురియుచుండఁ
    దీయ చిత్రమ్ము చరవాణి తెరను భళిర!
    చిక్కి నిక్షిప్తమైనట్టి చిత్రమందు
    స్థిరములయ్యెఁ దటిల్లతల్ చిన్కులెల్ల!

    చంపకమాల
    ఉరుములు మెర్పులన్ జెలఁగి హోరున వర్షము సంభవించఁగన్
    బరుగువఁ దీసినంత చరవాణి తెరన్ గొని యద్భుతమ్ముగన్
    దురమున త్యక్తమై భళిర! తోరణమట్టుల చిత్రమందునన్
    స్థిరములుగాఁ దటిల్లతలుఁ జిన్కులు మారెను కుంభవృష్టిలో!

    రిప్లయితొలగించండి
  6. తే. గర్జదంబుదసంభృత గగనసీమ
    వరతటిత్ప్రభాశోభలన్ వరలుచుండ
    చిత్రకారుని కుంచెలో జీవమొంది
    స్థిరములయ్యెఁ దటిల్లతల్ చిన్కులెల్ల

    రిప్లయితొలగించండి