9, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5329

10-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్”
(లేదా...)
“కాయలు పెక్కు గాచినవి గాని ఫలంబులు గా వవెన్నడున్”

6 కామెంట్‌లు:

  1. ఉ.
    పాయక తాతతో వెడలి పల్లియ తోటకు జేరి మన్మడో
    గాయకు భంగి పాటలను గానము సేయుచు చూచె నారికే
    ళాయత వృక్షమున్, హృదయమందున భావము తోచెనిట్టులీ
    కాయలు పెక్కు గాచినవి కాని ఫలంబులు గావవెన్నడున్ !

    రిప్లయితొలగించండి
  2. చాయమగని తాపమునకు
    పేయము త్రాగని కతమున పెక్కువ రీతిన్
    కాయము నపూర్తిగ చెమట
    “కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్”

    రిప్లయితొలగించండి
  3. కందం
    శ్రేయమన స్వేచ్ఛ నొందియు
    ధ్యేయపు దారిద్ర్య రహిత దేశముగనఁగా
    నాయమ భారతి కన్నుల
    కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్!

    ఉత్పలమాల
    శ్రేయమనంగ స్వేచ్ఛఁగొనె చిందగ రక్తము దేశభక్తులున్
    ధ్యేయమనంగ పేదరికమెక్కడ లేదను దేశమెంచగా
    నాయమ భారతాంబ కల కాకృతు లేర్పడ చూచి కన్నులన్
    కాయలు పెక్కు గాచినవి గాని ఫలంబులు గా వవెన్నడున్

    రిప్లయితొలగించండి
  4. నాయకులెన్నిక లందున
    చేయును వాగ్దానములను జిక్కగ పదవుల్
    శ్రేయమునకువేచి కనులు
    కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్

    రిప్లయితొలగించండి
  5. తోయలి తో పతి చెప్పెను
    మాయయొ మంత్రమ్మొ కాదు మహిధర్మమిదే
    జాయరొ వినుమా కొబ్బరి
    కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్.


    సాయము జేసినట్లుగను జ్యాంసుల భావన కోసమై కదా
    దాయల కట్టి వ్యర్థమగు దారణి ఖాండవ మివ్వనేమి యా
    ప్యాయత తోడ కాదనుచు వప్రుడు నా ధృత రాష్ట్రుడిట్ల నెన్
    కాయలు పెక్కు గాచినవి గాని ఫలంబులు గా వవెన్నడున్.

    రిప్లయితొలగించండి
  6. నాయిక రాధిక వేచెన్
    బ్రాయపు వాడరుగుదెంచు వైళంబనుచున్
    మాయావిరాక కన్నులు
    కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్

    నాయకు డామనోహరుడు నల్లని వాని తలంపులందునన్
    నాయిక రాధ వేచెనట నందకిశోరుని రాక కోసమై
    పాయక వేచిచూచి మరి వాచిన కన్నుల యుగ్మమందునన్
    గాయలు పెక్కు గాచినవి గాని ఫలంబులు గా వవెన్నడున్

    రిప్లయితొలగించండి