23, జనవరి 2026, శుక్రవారం

సమస్య - 5360

24-1-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దూరువాఁడె యఘవిదూరుఁ డగును”
(లేదా...)
“దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్”
(భరతశర్మ గారి శతావధానంలో పంతుల విట్టుబాబు గారి సమస్య)

6 కామెంట్‌లు:

  1. ఇంత వయసు వ చ్చినగూడ , నెన్నటికిని
    పెద్దవారి నసలు గౌరవించకుండి
    పరుష వచనము పలికెడు పాలసుడిని
    దూరువాఁడె యఘవిదూరుఁ డగును

    రిప్లయితొలగించండి

  2. చిరుత ప్రాయ మందు చిలిపి దనముతోడ
    స్వకుల తోడ తాను సరజము నట
    కొల్ల గొట్ట నెంచి గొల్లకొంపల యందు
    దూరువాఁడె యఘవిదూరుఁ డగును.


    భీరువు జంపె స్తన్యమిడు వేళను, పాటల గంధు లెల్ల కా
    సారము లోన నుండు తరి స్రజ్వల దోచె పరేతుండ్ర తో
    జేరుచు హౌమ్యమున్ గిలుబు జేయగ గొల్లల కొంపలందు నన్
    దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్.

    రిప్లయితొలగించండి
  3. తీరనట్టికోర్కెఁ దీర్పగ వలయును
    రాజకీయమనుచు మోజుపడుచు
    చట్టసభను దూరు సంకల్పమేర్పడ
    దూరువాఁడె యఘవిదూరుఁ డగును

    తీరని కాంక్షలే కడకుఁ దీర్చెడు మార్గము రాజకీయమే
    వేరుగ లేదులేదనుచు వేగమె యెన్నిక లందు నిల్చి తాఁ
    జోరుగ నెన్నికై పిదప సొంపుగ చట్టసదస్సు నందునన్
    దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్

    రిప్లయితొలగించండి
  4. ఆ. సాధు వర్తనమ్ము సత్యశీలతగల్గి
    మానితమగు తెరగు మసలు వాడు
    అహము దర్పమాది యవగుణముల నెల్ల
    దూరువాఁడె యఘవిదూరుఁ డగును

    రిప్లయితొలగించండి