26, జనవరి 2026, సోమవారం

సమస్య - 5363

27-1-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకిపిల్ల ముద్దు కోకిలకును”
(లేదా...)
“కాకిపిల్లను కోకిలమ్మయె కాంచి ముద్దిడె ప్రేమతో”
(భరతశర్మ గారి శతావధానంలో ఆముదాల మురళి గారి సమస్య)

18 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    ప్రకృతిధర్మమనఁగఁ బాటింపఁగావలె
    సృష్టిలోని సకల జీవరాశి
    తనదు గ్రుడ్డు పొదిగి తనివారనందింప
    కాకి, పిల్ల ముద్దు కోకిలకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తకోకిల
      లోకధర్మము జీవులన్నిట రూఢిగాకొనసాగుటన్
      వీకఁజెందెను జీవరాశియె వేడ్కఁజేయుచు నిత్యమున్
      కోకిలమ్మయె గూడుఁ జేర్చగ గ్రుడ్డునే పొదుగంగ నా
      కాకి, పిల్లను కోకిలమ్మయె కాంచి ముద్దిడె ప్రేమతో!

      తొలగించండి
  2. కాకి గూడు నందు కాపుర ముండగ ,
    కాకిపిల్ల ముద్దు కోకిలకును ,
    అచట తన యునికిని నరయని విధముగ
    అరవ కుండ నుండెననుచు దలచి

    రిప్లయితొలగించండి

  3. గూడు చెంత జేరి కోకిలమ్మయె తాను
    సుధలు గురియు నటుల మధురము గను
    పాట పాడు చుండ పరవశించుచు బెట్టె
    కాకిపిల్ల ముద్దు, కోకిలకును.


    ఆకలంచును కుందు బాలుని యాదరమ్మున చేటునిన్
    నాకునిన్ కరమందు గైకొని నాయకుండట ముద్దిడన్
    దాకలిన్ గల వారలెల్లరు దల్చిరే కని యివ్విదిన్
    కాకిపిల్లను కోకిలమ్మయె కాంచి ముద్దిడె ప్రేమతో.

    రిప్లయితొలగించండి
  4. కాకిగూటిలోని కోకిల గ్రుడ్డును
    తానుపొదిగె కాకి తనివిదీర
    కాకులెల్లవీడి కలకంఠ మిగుల నే
    కాకి పిల్ల ముద్దు కోకిలకును

    కాకిగూటిని గ్రుడ్లు పెట్టుట కామజానము నేర్వగా
    కాకి తాను బొదుంగినంతట కానవచ్చెను పిల్లలే
    కాకి పిల్లలు గూడు వీడగ కాకిపెంపుడు నిల్వ నే
    కాకి పిల్లను కోకిలమ్మయె కాంచి ముద్దిడె ప్రేమతో

    రిప్లయితొలగించండి
  5. కాకి గ్రుడ్డుపెట్టె కోకిల గూటిలో
    కోకిలమ్మ పొదిగె కాకి గుడ్డు
    తెలివి గలిగి నిజము దెలియఁగ తానౌనె
    కాకిపిల్ల ముద్దు కోకిలకును?

    రిప్లయితొలగించండి
  6. కోకిలమ్మ కుటీరమందున గ్రుడ్డుఁ బెట్టెను కాకమే
    కాకిపిల్లగ రూపునొందెను కాకిగుడ్డు బిరాలునన్
    కాకిపిల్లయె కోకిలమ్మగ కానరాగ పికమ్ముకున్
    కాకిపిల్లను కోకిలమ్మయె కాంచి ముద్దిడె ప్రేమతో

    రిప్లయితొలగించండి
  7. -

    తాకె నయొ త్సునామి తమ నెలవులు బోయె
    పక్షు లకు మిగిలెను వార నొక్క
    కాకి పిల్ల; ముద్దు కోకిలకును దాని
    నిగన; పెంచె తనును నెమ్మితోడు

    కంది వారూ ఈ మధ్య పర్మెనెంట్ గా గాయబ్‌ బ్లాగ్లో :) వారి తరపున ఏ ఐ బాట్ ఏమైనా సమస్యలను పోస్టు చేస్తోందాండి ?


    :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. కాగితాన యున్న కవితా సుధారసము
    గళము జేరి మిగుల గరిమ నొందె
    సృష్టి కాకి దైన - పుష్టి కోకిలదయ్యె
    కాకి పిల్ల ముద్దు కోకిలకును!

    కాకి వ్రాయ కవిత కాగితమందున
    నల్ల నక్షరములు నాట్యమాడె
    గారవమున పాడ కలకంఠి జూడరే
    కాకి పిల్ల ముద్దు కోకిలకును!

    రిప్లయితొలగించండి
  9. శోకమొందుచు తల్లికై వడి చూచు
    టంతట బాధతో
    లోకమంతయు తిర్గుచుండె విలోక
    నంబొనరించుచున్
    కాకజాతపు పిల్ల నప్పుడు గార
    వంబున బిల్చి యే
    కాకి పిల్లను కోకి కిలమ్మయె కాంచి
    ముద్దిడె ప్రేమతో.

    రిప్లయితొలగించండి
  10. ఆ॥ కాకి గూటి యందు కోకిల గ్రడ్లను
    బెట్టఁ గాకి పెంచె పిల్లలన్ని
    భేద మెంచక నను ప్రియ భావము విరియఁ
    గాకి పిల్ల ముద్దు కోకిలకును

    మత్త॥ కాకి గూడునఁ గోకిలమ్మయు గ్రుడ్లు పెట్టఁగఁ బిల్లలన్
    గాకి సాకుచు నుండె వీడఁగఁ గాకి తిండికి గూటినిన్
    బ్రాకులాడుచుఁ జొచ్చి పిమ్మట వ్యత్యయమ్మును బట్టకన్
    గాకి పిల్లను కోకిలమ్మయె కాంచి ముద్దిడె ప్రేమతో

    (కాకి గూటిలోనే కోకిల గ్రుడ్లు పెడుతుంది అనే జనవాక్యమాధారంగా

    రిప్లయితొలగించండి
  11. ఆ.వె:కోకిలమ్మ గ్రుడ్ల కాకి కాపాదు, నే
    కాకిపిల్ల ముద్దు కోకిలకును?
    స్థాయి హెచ్చు వాని తక్కువ వా డెంత
    గౌరవించ సమత గాంచ గలడె?

    రిప్లయితొలగించండి
  12. మ.కో:లోకతృప్తిగ గబ్బిలమ్మున రోసి తా నసమానతన్
    కోకిలాఖ్యను బొందె సత్కవి కోటి మెచ్చగ జాషువా
    కాకి యన్ బిరుదమ్ము నిచ్చిన గాల దన్నడె? యెన్నడేన్
    కాకిపిల్లను కోకిలమ్మయె కాంచి ముద్దిడె ప్రేమతో?
    (గబ్బిలం కావ్యం లో జాషువా గారు గబ్బిలం మీద సానుభూతి చూపి అసమానతని ప్రశ్నించారు.కానీ ఆయనని కవికోకిల అనకుండా కాకి అనే బిరుదు ఇస్తే తీసుకునే వారా? ఆ కవి కోకిల ఎప్పు డైనా ఒక కాకిపిల్లని ముద్దు పెట్టుకున్నదా?)

    రిప్లయితొలగించండి
  13. కోకిలమ్మ గుడ్ల కాకి పొ దుగు ట చే
    కాకి పిల్ల ముద్దు కోకిల కిను
    నిజ ము కదర యదియ నిక్కమ్ము గా ధర
    తెలియ వలను జనులు తెలివి గాను

    రిప్లయితొలగించండి
  14. గూటి లోన నున్న గ్రడ్లఁ గాకి బొదుగఁ
    గల్ల కాదు సుమ్ము పిల్ల లైనఁ
    గూఁత రాక యున్న నాతత రీతినిఁ
    గాకిపిల్ల ముద్దు కోకిలకును


    పోక నిల్చిన కూనపై నెద మూరఁ గూరిమి యంతటన్
    వీఁకఁ దప్పు నెఱింగి యంత విభేద మేర్పడఁ గూఁతలన్,
    రాకతోను వసంత కాలము వ్రాలి కైకొనఁ గాకమే
    కాకిపిల్లను, గోకిలమ్మయె కాంచి ముద్దిడెఁ బ్రేమతో

    రిప్లయితొలగించండి