26, జనవరి 2026, సోమవారం

సమస్య - 5363

27-1-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకిపిల్ల ముద్దు కోకిలకును”
(లేదా...)
“కాకిపిల్లను కోకిలమ్మయె కాంచి ముద్దిడె ప్రేమతో”
(భరతశర్మ గారి శతావధానంలో ఆముదాల మురళి గారి సమస్య)

3 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    ప్రకృతిధర్మమనఁగఁ బాటింపఁగావలె
    సృష్టిలోని సకల జీవరాశి
    తనదు గ్రుడ్డు పొదిగి తనివారనందింప
    కాకి, పిల్ల ముద్దు కోకిలకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తకోకిల
      లోకధర్మము జీవులన్నిట రూఢిగాకొనసాగుటన్
      వీకఁజెందెను జీవరాశియె వేడ్కఁజేయుచు నిత్యమున్
      కోకిలమ్మయె గూడుఁ జేర్చగ గ్రుడ్డునే పొదుగంగ నా
      కాకి, పిల్లను కోకిలమ్మయె కాంచి ముద్దిడె ప్రేమతో!

      తొలగించండి
  2. కాకి గూడు నందు కాపుర ముండగ ,
    కాకిపిల్ల ముద్దు కోకిలకును ,
    అచట తన యునికిని నరయని విధముగ
    అరవ కుండ నుండెననుచు దలచి

    రిప్లయితొలగించండి