5, మే 2026, మంగళవారం

సమస్య - 5460

6-5-2026 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ”

(లేదా...)

“మౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా”

8 కామెంట్‌లు:

  1. తేటగీతి
    తల్లి మాట కాదనడను తనయుఁడొకడు
    నాలిమాటకు జిక్కుచు నాదమఱుచ
    చిందులేయఁగ తల్లియే, కందు జంట
    మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ!

    ఉత్పలమాల
    ప్రాణ సమానమౌ జనని పల్కిన మాటను తప్పకెప్పుడున్
    దానొక వేళలో సుతుఁడు దారకు జిక్కుచు మీరినంతటన్
    బూనెను దయ్యమో యనగ పోరగ నిందల 'తల్లి' ,భీతినిన్
    మౌనముఁ బూని రిద్దరును, 'మాటలు మాత్రము వెల్లువెత్తెరా! '

    రిప్లయితొలగించండి
  2. కలుగును శమమనుచు జెప్ప , కపటమైన
    మౌనమున ; వెల్లువెత్తెను మాటలెన్నొ
    మదిని తిరుగాడు చుండి , సమయము నంత
    సైగల నిడుచు గడుపగ శాంతి తొలగె

    రిప్లయితొలగించండి

  3. అయ్యశోక వనము నందు నసుర రాజు
    రావణుండెంత ప్రేలిన రమణి సీత
    పెలుచ చూపులు చూచిన వేళ యందు
    మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ.


    మానిని ద్రోవదిన్ గని ప్రమత్తుడు పొందును గోరగా సమా
    ధానము గాను భామినియె తానట మాటల నాడ కుండనే
    వానిని కీచకుండనట భామపు చూపులు చూచు పాళమున్
    మౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా.

    రిప్లయితొలగించండి
  4. విల్లు నెక్కిడ రాముడు విరిగె ధనుసు
    తాను గాంచెను జానకి తన్మయమున
    మగువ సుమమాలనిడె రాముని గళసీమ
    మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ

    జానకిదా స్వయంవరము జన్నపు గాపరి విల్లుఁ ద్రుంచగా
    తానట గాంచి రాముడిని తన్మయమొందిన మానసంబుతో
    జానకి వైచె మాలికను సత్వరమాతని కంఠసీమలో
    మౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా

    రిప్లయితొలగించండి
  5. -
    మూగ బోయిన మదిలోన మొద్దు భర్త
    పైన ప్రణయపు వేదన పరిఢవిల్ల
    మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ
    కసబుస కసబుస యనెడు ఘాటు తోడు


    రిప్లయితొలగించండి
  6. (ఇద్దరు ప్రేమికుల నడుమ అవగాహన ఉంటే మనసులే మాట్లాడగలవని అండి)

    ఉ॥ పూనిన ప్రేమ మాధురిని పూర్ణ సమాదర భావనాస్త వి
    న్నాణము వర్ధిలంగ నిజ నాకపు సౌఖ్యముఁ బొందు వేళలో
    మానస వీణ మ్రోగనటు మానకఁ గన్నులు పల్కుచుండఁగన్
    మౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా

    రిప్లయితొలగించండి
  7. కలికి మగనిపై యేల కో కనలి తాను
    మసలు చుండగ మూ గ దై మనసు నందు
    మౌ నము న వెల్లు వె త్తెను మాట లె న్నొ
    పలు వి ధాలు గ వె న్వె o ట తలపు నందు

    రిప్లయితొలగించండి
  8. పెండ్లి కట్నము తెమ్మని పెక్కుమార్లు
    భర్త దూషించుచుండెను, భార్య లోన
    మౌనమున వెల్లవెత్తెను మాటలెన్నొ
    భయముచేనవి రాలేదు బయటకెపుడు.

    రిప్లయితొలగించండి