తే.గీ:బాలునకు దండ్రి జేజమ్మ పటము జూపి జేజెకున్ మ్రొక్కు మన వాడు చెప్పె నిటుల "ఏగి దేవుని కడకు, తా నికను రాదె? కరుణ లేని జేజెకు నమస్కారమేల? (మరణించిన జేజెమ్మ ఫొటో చూపించి నమస్కారం చెయ్య మని తండ్రి చెప్పాడు.అమాయక ప్రేమ గల బాలుడు " జేజెమ్మ దేవుడి దగ్గర కెళ్లి ఇంకా రాలేదు.నే నెందుకు దణ్నం పెట్టాలి? అని అలిగాడు. )
మ:"కరుణా మూర్తి యె దేవు"డందురు "ననున్ కాపాడడే?" యన్నచో "గురుపాపమ్ముల జేసియుందు" వని నాకున్ కర్మసిద్ధాంతమున్ బరికించన్ దగ జెప్పుచుందు, రిక పాపమ్మున్ క్షమింపన్ గడున్ గరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో? (భగవంతుడు కరుణామయుడని వాళ్లే చెపుతారు. నన్ను కాపాడడే? అంటే నువ్వు పూర్వం దుష్కర్మలు చేసా వేమో! అంటారు.మరి పాపాన్ని క్షమించే విషయం లో అంత కరుణా దూరు డైతే ఆ దేవునికి నమస్కార మెందుకు? మన కర్మ మనమే అనుభవిస్తాం అని.ఈ సందేహం కష్టాల లో ఉన్న ప్రతి ఆస్తికుని వస్తూ ఉంటుంది.)
వతనుగ సపర్యనిడు వారిపయిన గూడ
రిప్లయితొలగించండికరుణ లేని జేజెకు నమస్కారమేల !
యనుచు శంకించెదరు కొందరజ్ఞులెపుడు ,
వారి వారి యర్హత బట్టి ప్రాప్తికలఃగు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాస్తికు డొకండు వాదించె నాస్తికునితో
రిప్లయితొలగించండిమ్రొక్కచున్నారు పలుమార్లు మోదముగను
కష్టముల నష్ట పరచని కఠినమైన
కరుణలేని జేజేకు నమస్కారమేల?
కరుణఁ జూడఁగ మనసార కరము మోడ్చి
రిప్లయితొలగించండిశరణు జొచ్చిన కాపాడు కరివరదుఁడు
బేలవై యిట్లు పలుకగనేల నీవు
కరుణ లేని జేజెకు నమస్కారమేల
శరణమ్మంచు శిరమ్మువంచి హరినిన్ సద్భక్తితో గొల్చినన్
రిప్లయితొలగించండికరుణం జూచును కాంక్షితమ్ములనిడున్ కాపాడు నెల్లప్పుడున్
కరుణామూర్తిని భక్తవత్సలుని ప్రాఖర్యమ్ముగా బల్కెదో
కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో
తేటగీతి
రిప్లయితొలగించండిట్రంపు యాగడమ్ములతోనిరాను పైన
దాడులెంచఁగ, దేశాల గోడువినక
నార్థికంపు సంక్షోభాల నాదుకొనడె!
కరుణ లేని జేజెకు నమస్కారమేల?
మత్తేభవిక్రీడితము
పరమానందమదేమొ ట్రంపునకు దుర్వ్యాపార చిత్తుండునై
పరదేశంపు టిరానుపై చెలఁగుచున్ బాపాత్ముఁడై నాశమున్
జరుపన్ జింతిల లోకమార్థికముగన్ సంక్షోభమై, కావఁడే?
కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో?
రిప్లయితొలగించండిసంకటముల తీర్చు ననుచు సాగిల బడి
మ్రొక్కు వారలు భువిలోన పెక్కు రున్న
బాధలను బాప రాడయ్యె ప్రత్య గాత్మ
కరుణ లేని జేజెకు నమస్కారమేల.
కరికిన్ శక్తియె క్రుంగినంతనె దుఃఖంబందు చింతించె నే
హరియే దిక్కని యెంత వేడినను తా యంత్రింపగా రాడు గ
ద్దరి నక్రంబిది చంపు తథ్యమె యనుద్యానమ్ము లేనట్టి యా
కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో.
శరణు జొచ్చిన వారికిఁ సత్వరంబు
రిప్లయితొలగించండిమరణమాపక తానుండు మర్మమేమి
కరుణ లేని జేజెకు నమస్కారమేల
చరణములు శరణమని ప్రశంశలేల
'కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో'
సరిగా కూర్చని పద్యపాదమిదియే చక్కొన్పి చూపించుమా!
కరుణామూర్తిని దేవుఁడందురు నమస్కారమ్ము లర్పించెదన్
పరమానందము గూర్చువాడు గద సంపాదింతునే మోక్షమున్
-
రిప్లయితొలగించండినేటి లోకము :)
రేపే అపార కరుణ పారును
అరరె! తమిళ జనాళి నన్నాద రించి
రని తలచినాను నిలుపసర్కారు తక్కు
వాయె పదిసీట్లు నన్నేల ప్రభువు విడిచె
కరుణ లేని జేజెకు నమస్కారమేల.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య : "కరుణ లేని జేజెకు నమస్కారమేల"
రిప్లయితొలగించండిఅలసి పోయిన వేళలోనాకులమున
కరుణ లేని జేజెకు నమస్కారమేల
యనగ స్వాభావికము విన్నదనమునొందఁ
గనఁగ సాధ్యమే పరమాత్మ కనికరమ్ము
తే.గీ:బాలునకు దండ్రి జేజమ్మ పటము జూపి
రిప్లయితొలగించండిజేజెకున్ మ్రొక్కు మన వాడు చెప్పె నిటుల
"ఏగి దేవుని కడకు, తా నికను రాదె?
కరుణ లేని జేజెకు నమస్కారమేల?
(మరణించిన జేజెమ్మ ఫొటో చూపించి నమస్కారం చెయ్య మని తండ్రి చెప్పాడు.అమాయక ప్రేమ గల బాలుడు " జేజెమ్మ దేవుడి దగ్గర కెళ్లి ఇంకా రాలేదు.నే నెందుకు దణ్నం పెట్టాలి? అని అలిగాడు. )
మ:"కరుణా మూర్తి యె దేవు"డందురు "ననున్ కాపాడడే?" యన్నచో
రిప్లయితొలగించండి"గురుపాపమ్ముల జేసియుందు" వని నాకున్ కర్మసిద్ధాంతమున్
బరికించన్ దగ జెప్పుచుందు, రిక పాపమ్మున్ క్షమింపన్ గడున్
గరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో?
(భగవంతుడు కరుణామయుడని వాళ్లే చెపుతారు. నన్ను కాపాడడే? అంటే నువ్వు పూర్వం దుష్కర్మలు చేసా వేమో! అంటారు.మరి పాపాన్ని క్షమించే విషయం లో అంత కరుణా దూరు డైతే ఆ దేవునికి నమస్కార మెందుకు? మన కర్మ మనమే అనుభవిస్తాం అని.ఈ సందేహం కష్టాల లో ఉన్న ప్రతి ఆస్తికుని వస్తూ ఉంటుంది.)
మ॥ ధరలోఁ బూర్వము రాక్షసాధములు ప్రాధాన్యమ్ము దైత్యాళికిన్
రిప్లయితొలగించండిగరపంగన్ సభఁ దాల్చి తెల్పిరఁట వక్కాణించుచున్ గట్టిగా
నరయంగన్ హరి శత్రువై మనకు సౌహార్దమ్మునున్ గాంచఁడే
కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో
(రాక్షస సమాజానికి సంబంధించిన వరకు వారి ఆలోచనలండి)
ఎన్ని పూజలు చేసిన నేమి ఫలము
రిప్లయితొలగించండికోర్కె తీరక మిక్కిలి కుమిలి పోతి
ననుచు మది విరక్తి తో నాగ్ర హించి
కరుణ లేని జే జె కు నమ స్కా ర మేల?
చూడ రాకున్న నెప్పుడు చుట్ట మేల
రిప్లయితొలగించండినీరు లేని పట్టణమున నిలయ మేల
వైద్యుఁ డుండని యూరను వాస మేల
కరుణ లేని జేజెకు నమస్కార మేల
పరమోదారుఁడు దేవుఁ డార్తులకు సంభావ్యుండు మర్త్యాలికిన్
హరి నిత్యమ్ము దయా సముద్రుఁ డయ సత్యం బెన్న భక్తాలికిన్
గిర లిబ్భంగి ననంగ రాదు పుడమిం గృత్యమ్ము దుష్టాలికిం
గరుణా దూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో
రిప్లయితొలగించండిఆకాశవాణి - విశాఖపట్టణం
కవన విజయం -
సమస్యా పూరణం - 9th May 2026
డా. శ్రీ రాంభట్ల పార్వతీశ శర్మ
సమస్య -
మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడ గన్!
జిలేబీయపు పూరణ Part-1 లో _5:25 min
ప్రాంతంలో వినవచ్చు :)
https://varudhini.blogspot.com/2026/05/air-vizag-09may2026.html
ఈనాటి ఈ పూరణలలో చాలామంది
శంకరాభరణవేదిక కవివరులు.
వచ్చే పక్షానికి సమస్య
రిప్లయితొలగించండిగ్రీష్మ తాపం వర్ణన ఏదేని వృత్తములో
పంపవలసిన మెయిల్ ఐడి.
airpcvsp at gmail dot com