13-5-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్"
(లేదా...)
“కల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్”
కందంచెల్లును సత్యమహింసలునెల్లరు నాయుధములనఁగ నెత్తినయంతన్దెల్లలుఁ బారక నిలుచుటకల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్ఉత్పలమాలచల్లని మానసమ్ములను సత్యమహింసలు నాయుధాలుగన్మెల్లగఁ బూనినన్ నియతి మీరకయెప్పుడు బాపు బోధలన్దెల్లలు భీతితో మనల దేశమువీడక నిల్చుటన్నదేకల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్
తల్లడిలకుండు మికపై ఎల్లప్పుడు మన విలాతి నేలుటకొరకై తెల్లదొరలు వీడరనుట కల్లనఁ , గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
ఎల్లరు సంకల్పముతోతెల్లదొరలతోడ మిగుల తెగువతొ బోరన్చల్లబడిరి ,యిట నుండుటకల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
ఎల్లెడ దొరుకు స్వదేశపు కల్లది యారోగ్య మిచ్చు కావున జనులీ చల్ల దనమిచ్చు మందగు కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్.తల్లి విదేశ మద్యమును త్రాగుట మాను మటంచు చెప్పగా పిల్లలు చెప్పి రీవిధిని స్వేచ్ఛను గోరుచు చేసెడుద్య మ మ్మెల్లెడ సాగుచుండ జను లెల్లరు మద్దతు తెల్పి రందుకే కల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్.
అల్లరి మూకలగుచు జనులెల్లరు శాంతిని విడిచిన హింసా పథమేచెల్లదు స్వరాజ్య సాధనకల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్చెల్లదు శాంతిమార్గమని జెప్పుచు కొందరు హింసనెంచగానెల్లరు శాంతినే విడిచి హింసకు పాల్పడ లక్ష్య సాధనేకల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్మెల్లఁగ సంభవించె గద మెచ్చిన మార్గమునన్ స్వరాజ్యమే
కందం
రిప్లయితొలగించండిచెల్లును సత్యమహింసలు
నెల్లరు నాయుధములనఁగ నెత్తినయంతన్
దెల్లలుఁ బారక నిలుచుట
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
ఉత్పలమాల
చల్లని మానసమ్ములను సత్యమహింసలు నాయుధాలుగన్
మెల్లగఁ బూనినన్ నియతి మీరకయెప్పుడు బాపు బోధలన్
దెల్లలు భీతితో మనల దేశమువీడక నిల్చుటన్నదే
కల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్
తల్లడిలకుండు మికపై
రిప్లయితొలగించండిఎల్లప్పుడు మన విలాతి నేలుటకొరకై
తెల్లదొరలు వీడరనుట
కల్లనఁ , గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
ఎల్లరు సంకల్పముతో
రిప్లయితొలగించండితెల్లదొరలతోడ మిగుల తెగువతొ బోరన్
చల్లబడిరి ,యిట నుండుట
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
రిప్లయితొలగించండిఎల్లెడ దొరుకు స్వదేశపు
కల్లది యారోగ్య మిచ్చు కావున జనులీ
చల్ల దనమిచ్చు మందగు
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్.
తల్లి విదేశ మద్యమును త్రాగుట మాను మటంచు చెప్పగా
పిల్లలు చెప్పి రీవిధిని స్వేచ్ఛను గోరుచు చేసెడుద్య మ
మ్మెల్లెడ సాగుచుండ జను లెల్లరు మద్దతు తెల్పి రందుకే
కల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్.
అల్లరి మూకలగుచు జను
రిప్లయితొలగించండిలెల్లరు శాంతిని విడిచిన హింసా పథమే
చెల్లదు స్వరాజ్య సాధన
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
చెల్లదు శాంతిమార్గమని జెప్పుచు కొందరు హింసనెంచగా
నెల్లరు శాంతినే విడిచి హింసకు పాల్పడ లక్ష్య సాధనే
కల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్
మెల్లఁగ సంభవించె గద మెచ్చిన మార్గమునన్ స్వరాజ్యమే