14-5-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లయకారుఁడు సౌఖ్యమొసఁగు లచ్చిమగండే”
(లేదా...)
“లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్”
కందంప్రియసతి లక్ష్మియె హృదయాలయమున పోషణకిరువుగ రంజిలనుండన్దయగురిసెడు హరి, కాడనలయకారుఁడు, సౌఖ్యమొసఁగు లచ్చిమగండే!చంపకమాలప్రియసతి లక్ష్మినిన్ హృదయవేదిని నిల్పియు సృష్టి పోషణన్దయగల మూర్తియై నిలిచె దైవమనంగ జనార్దనుండహో!శ్రియమున సంచరించు హరి చిన్మయరూపుడు సింధుజా హృదాలయమున కాదిదైవతము! లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్!
వియమముల నుండి శివనిడులయకారుఁడు ; సౌఖ్యమొసఁగు లచ్చిమగండేనియమమగు రీతి నిత్యము భయభక్తులతోడ నతని భజనలు జేయన్
కందం
రిప్లయితొలగించండిప్రియసతి లక్ష్మియె హృదయా
లయమున పోషణకిరువుగ రంజిలనుండన్
దయగురిసెడు హరి, కాడన
లయకారుఁడు, సౌఖ్యమొసఁగు లచ్చిమగండే!
చంపకమాల
ప్రియసతి లక్ష్మినిన్ హృదయవేదిని నిల్పియు సృష్టి పోషణన్
దయగల మూర్తియై నిలిచె దైవమనంగ జనార్దనుండహో!
శ్రియమున సంచరించు హరి చిన్మయరూపుడు సింధుజా హృదా
లయమున కాదిదైవతము! లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్!
వియమముల నుండి శివనిడు
రిప్లయితొలగించండిలయకారుఁడు ; సౌఖ్యమొసఁగు లచ్చిమగండే
నియమమగు రీతి నిత్యము
భయభక్తులతోడ నతని భజనలు జేయన్