18-5-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకిఁ గేకి నొనర్చి చిల్క యని పిల్చె”
(లేదా...)
“కాకినిఁ గేకిఁ జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే”
తేటగీతిరంగుతక్కువ పిల్లకు రాడటంచువరుడు, సౌందర్య సేవల తరుణివచ్చికలికి వన్నెను మార్చి కంగారు తోడకాకిఁ గేకి నొనర్చి చిల్క యని పిల్చెఉత్పలమాలసాకిన తల్లిదండ్రులకు సంకటమయ్యెను కూతు వర్ణమేమేకపు భామనే పిలిచి మిన్నఁగ దీర్చఁగఁ బిల్చినంతటన్లోకము మెచ్చెడున్ వధువు రూపము కంగరునందు దీర్చుచున్గాకినిఁ గేకిఁ జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే!
బొమ్మల కొలువు గొరకయి బుద్ధి హీను నొకడిని బిలచి జక్కగ నుండెడి బొమనొకటి సిద్ధము గావించి యుంచుమనగ కాకిఁ గేకి నొనర్చి చిల్క యని పిల్చె
రాక్షసాంగనన్ సుందర రమణి జేసి స్తన్య మిచ్చు కూరిమి గల తల్లి గాను కంసు డంపిన పూతనన్ గాథ వినిన కాకిఁ గేకి నొనర్చి చిల్క యని పిల్చె.ఆకృతి జూచి నంత దనుజాంగనపూతన కంసు నాజ్ఞపై పాకుడు పాప జంపనొక వన్నెల నొల్కెడి భామ వోలె తా హ్రీకువు చెంత జేరి జనయిత్రినటంచను పల్కుటన్ గనన్ కాకినిఁ గేకిఁ జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే.
రాజ కీయమనెడు రణ రంగమందుదూకి సంచరించెడు వాడు ధూర్తుడైనవాని చెంతను జేరిన వాడొకండుకాకిఁ గేకి నొనర్చి చిల్క యని పిల్చెదూకొని రాజకీయమున ధూర్తుడు నిల్చెను తాను స్పర్థలోపోకిరి వాని ప్రాపకము పొందగ నెంచిన కొంచె కారుడేడాకొని వానిగూర్చి పలు డంబములన్ వచియించెనక్కటాకాకినిఁ గేకిఁ జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే
నీకును సోయి దప్పినది నిత్యము సీసల కొద్ది మద్యమున్పీకల దాక త్రాగి మరి వెర్రిగ వాగుచు నుంట వెప్పుడున్నాకును జెప్పుమిప్పుడును నాన్చక నింకను యెవ్వరిట్లు యేకాకిని గేకి జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే
నీకును సోయి దప్పినది నిత్యము సీసల కొద్ది మద్యమున్పీకల దాక త్రాగి మరి వెర్రిగ వాగుచు నుంట వెప్పుడున్నాకును జెప్పుమయ్య మరి నాన్చక నింకను యెవ్వరిట్లు యేకాకిని గేకి జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయేమాకును యిష్టమౌ పులుగు మాటల వెన్నియొ దానికొచ్చుగా
ఉ॥ కాకిది కృష్ణ వర్ణమని కాంచుట కష్టమనంగ నొప్పితోనీకలు రంగు రంగులవి యెన్నుచుఁ గ్రుచుకొనంగఁ గ్రొత్తగానాకృతిఁ బొంద నందముగ నబ్బుర మొందెడు రీతి నయ్యహో కాకినిఁ గేకిఁ జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే(చాలా చిన్నతనములో చదివిన కథ ఆధారంగా నండి. కాకిని మిగతా పక్షులు ఈసడించు కుంటే రంగురంగుల ఈకలు గ్రచ్చు కుంటుంది. పక్షులు ఆశ్చర్య పోయినా గొంతు విప్పగా గుర్తుపట్టేస్తాయి)
మాయ మంత్రాల గారడిన్ మభ్య బెట్టి కాకి కేకి నొనర్చి చిల్క యని బిల్చె ప్రేక్షకులు చాల ముదమంది ప్రీతి తోడ కాను కలు సమ ర్పించియు కనిక రించె
తేటగీతి
రిప్లయితొలగించండిరంగుతక్కువ పిల్లకు రాడటంచు
వరుడు, సౌందర్య సేవల తరుణివచ్చి
కలికి వన్నెను మార్చి కంగారు తోడ
కాకిఁ గేకి నొనర్చి చిల్క యని పిల్చె
ఉత్పలమాల
సాకిన తల్లిదండ్రులకు సంకటమయ్యెను కూతు వర్ణమే
మేకపు భామనే పిలిచి మిన్నఁగ దీర్చఁగఁ బిల్చినంతటన్
లోకము మెచ్చెడున్ వధువు రూపము కంగరునందు దీర్చుచున్
గాకినిఁ గేకిఁ జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే!
బొమ్మల కొలువు గొరకయి బుద్ధి హీను
రిప్లయితొలగించండినొకడిని బిలచి జక్కగ నుండెడి బొమ
నొకటి సిద్ధము గావించి యుంచుమనగ
కాకిఁ గేకి నొనర్చి చిల్క యని పిల్చె
రిప్లయితొలగించండిరాక్షసాంగనన్ సుందర రమణి జేసి
స్తన్య మిచ్చు కూరిమి గల తల్లి గాను
కంసు డంపిన పూతనన్ గాథ వినిన
కాకిఁ గేకి నొనర్చి చిల్క యని పిల్చె.
ఆకృతి జూచి నంత దనుజాంగనపూతన కంసు నాజ్ఞపై
పాకుడు పాప జంపనొక వన్నెల నొల్కెడి భామ వోలె తా
హ్రీకువు చెంత జేరి జనయిత్రినటంచను పల్కుటన్ గనన్
కాకినిఁ గేకిఁ జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే.
రాజ కీయమనెడు రణ రంగమందు
రిప్లయితొలగించండిదూకి సంచరించెడు వాడు ధూర్తుడైన
వాని చెంతను జేరిన వాడొకండు
కాకిఁ గేకి నొనర్చి చిల్క యని పిల్చె
దూకొని రాజకీయమున ధూర్తుడు నిల్చెను తాను స్పర్థలో
పోకిరి వాని ప్రాపకము పొందగ నెంచిన కొంచె కారుడే
డాకొని వానిగూర్చి పలు డంబములన్ వచియించెనక్కటా
కాకినిఁ గేకిఁ జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే
నీకును సోయి దప్పినది నిత్యము సీసల కొద్ది మద్యమున్
రిప్లయితొలగించండిపీకల దాక త్రాగి మరి వెర్రిగ వాగుచు నుంట వెప్పుడున్
నాకును జెప్పుమిప్పుడును నాన్చక నింకను యెవ్వరిట్లు యే
కాకిని గేకి జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే
నీకును సోయి దప్పినది నిత్యము సీసల కొద్ది మద్యమున్
రిప్లయితొలగించండిపీకల దాక త్రాగి మరి వెర్రిగ వాగుచు నుంట వెప్పుడున్
నాకును జెప్పుమయ్య మరి నాన్చక నింకను యెవ్వరిట్లు యే
కాకిని గేకి జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే
మాకును యిష్టమౌ పులుగు మాటల వెన్నియొ దానికొచ్చుగా
ఉ॥ కాకిది కృష్ణ వర్ణమని కాంచుట కష్టమనంగ నొప్పితో
రిప్లయితొలగించండినీకలు రంగు రంగులవి యెన్నుచుఁ గ్రుచుకొనంగఁ గ్రొత్తగా
నాకృతిఁ బొంద నందముగ నబ్బుర మొందెడు రీతి నయ్యహో
కాకినిఁ గేకిఁ జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే
(చాలా చిన్నతనములో చదివిన కథ ఆధారంగా నండి. కాకిని మిగతా పక్షులు ఈసడించు కుంటే రంగురంగుల ఈకలు గ్రచ్చు కుంటుంది. పక్షులు ఆశ్చర్య పోయినా గొంతు విప్పగా గుర్తుపట్టేస్తాయి)
మాయ మంత్రాల గారడిన్ మభ్య బెట్టి
రిప్లయితొలగించండికాకి కేకి నొనర్చి చిల్క యని బిల్చె
ప్రేక్షకులు చాల ముదమంది ప్రీతి తోడ
కాను కలు సమ ర్పించియు కనిక రించె