23-5-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్”
(లేదా...)
“అల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్”
కల్ల యనుకొనకు, భీష్ముడు ఎల్లప్పుడు నీవు పడెడి యిడుముల లోనన్మెల్లగనె దాను గాంచినవల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్
కల్లలు పలుకక పరులకు నుల్లము రంజిల్లు రీతి నోరిమి పరుడై చెల్లెడి సాయ మొన ర్ప గ నల్లా కాపాడు ననుచు హరి వా క్రు చ్చె న్
కందంతల్లడము దీర్చు రూపమునల్లానా దైవమనెడు నక్బరు తోడన్మెల్లగ చెవిలో 'సఖునిగ' ,నల్లా కాపాడు ననుచు 'హరి' వాక్రుచ్చెన్శార్దూలవిక్రీడితముఉల్లంబందున వేల్పుగానెవరినే యూహన్ భజింపంగ నీకల్లోలంబులు తీరునో యటులనే కన్పించు దైవమ్మటంచుల్లేఖించి 'సఖుండుగన్' దెలుపుచున్ నూర్భాషతో నిష్టుడైయల్లా ప్రోచెడివాఁడటంచు 'హరి' వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్!
చిల్లర వేషాలు వదిలి చెల్లెల పాటింపు నేను చెప్పినటుల మీ రెల్లరు నావగు పలుకుల నల్లా కాపాడు ననుచు హరి, వాక్రుచ్చెన్.తల్లీ బాధలు చుట్టు ముట్టెనని నే తాళంగ లేనంచు నీ వల్లల్లాడగ నేలనో వినుము నా యారాధ్య దైవం బదే కల్లోలం బుల తీర్చు శంకరుని నిష్కామంబునన్ గోల్వ మీ రల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్.
కల్లోలంబొనరించుచు నల్లద్రావరులు సెలగ నరభోజనులన్మల్లారి పాల్గుడుచు పెయ్యల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్నల్లద్రావరులే చెలంగి దివమున్ నానాడు పీడింపగా నల్లల్లాడుచు నున్న ఖేచరులు తామాదిత్యునే జేరగా చెల్లంబో! నిటలాక్షుడే దనుజులన్ క్షీరంబునుంగ్రోలు పెయ్యల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్
-ఉల్లము పొంగెడు భక్తినికల్లోలపు యెదయు సేద గాన పరవశంబెల్లెడల గాంచెడు జనులనల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్https://youtube.com/shorts/DWM3Rp_c18g?si=pTRO2TLLLXGXepND
కల్లోలమాయె బ్రతుకనియల్లా భక్తుఁడు రహీము యార్తిగ వగచెన్తల్లడపడవలదు సఖాఅల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్
అల్లా భక్తుఁడు షేరుఖాను హరియున్నస్తోకమౌ స్నేహితుల్కల్లోలంబున ఖాను జీవితమునన్ కాకోలమే యేర్పడన్ఉల్లంబందున చింతవీడుము సఖా యోర్మిన్ వహించంగనాయల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్
కల్ల యనుకొనకు, భీష్ముడు
రిప్లయితొలగించండిఎల్లప్పుడు నీవు పడెడి యిడుముల లోనన్
మెల్లగనె దాను గాంచిన
వల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్
కల్లలు పలుకక పరులకు
రిప్లయితొలగించండినుల్లము రంజిల్లు రీతి నోరిమి పరుడై
చెల్లెడి సాయ మొన ర్ప గ
నల్లా కాపాడు ననుచు హరి వా క్రు చ్చె న్
కందం
రిప్లయితొలగించండితల్లడము దీర్చు రూపము
నల్లానా దైవమనెడు నక్బరు తోడన్
మెల్లగ చెవిలో 'సఖునిగ' ,
నల్లా కాపాడు ననుచు 'హరి' వాక్రుచ్చెన్
శార్దూలవిక్రీడితము
ఉల్లంబందున వేల్పుగానెవరినే యూహన్ భజింపంగ నీ
కల్లోలంబులు తీరునో యటులనే కన్పించు దైవమ్మటం
చుల్లేఖించి 'సఖుండుగన్' దెలుపుచున్ నూర్భాషతో నిష్టుడై
యల్లా ప్రోచెడివాఁడటంచు 'హరి' వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్!
రిప్లయితొలగించండిచిల్లర వేషాలు వదిలి
చెల్లెల పాటింపు నేను చెప్పినటుల మీ
రెల్లరు నావగు పలుకుల
నల్లా కాపాడు ననుచు హరి, వాక్రుచ్చెన్.
తల్లీ బాధలు చుట్టు ముట్టెనని నే తాళంగ లేనంచు నీ
వల్లల్లాడగ నేలనో వినుము నా యారాధ్య దైవం బదే
కల్లోలం బుల తీర్చు శంకరుని నిష్కామంబునన్ గోల్వ మీ
రల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్.
కల్లోలంబొనరించుచు
రిప్లయితొలగించండినల్లద్రావరులు సెలగ నరభోజనులన్
మల్లారి పాల్గుడుచు పె
య్యల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్
నల్లద్రావరులే చెలంగి దివమున్ నానాడు పీడింపగా
నల్లల్లాడుచు నున్న ఖేచరులు తామాదిత్యునే జేరగా
చెల్లంబో! నిటలాక్షుడే దనుజులన్ క్షీరంబునుంగ్రోలు పె
య్యల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్
-
రిప్లయితొలగించండిఉల్లము పొంగెడు భక్తిని
కల్లోలపు యెదయు సేద గాన పరవశం
బెల్లెడల గాంచెడు జనుల
నల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్
https://youtube.com/shorts/DWM3Rp_c18g?si=pTRO2TLLLXGXepND
కల్లోలమాయె బ్రతుకని
రిప్లయితొలగించండియల్లా భక్తుఁడు రహీము యార్తిగ వగచెన్
తల్లడపడవలదు సఖా
అల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్
అల్లా భక్తుఁడు షేరుఖాను హరియున్నస్తోకమౌ స్నేహితుల్
రిప్లయితొలగించండికల్లోలంబున ఖాను జీవితమునన్ కాకోలమే యేర్పడన్
ఉల్లంబందున చింతవీడుము సఖా యోర్మిన్ వహించంగనా
యల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్