31-5-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రసికత లేనట్టివాఁడె రసరాజు గదా”
(లేదా...)
“రసికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ ఏకదిన శతావధానం సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంపసఁజూపెఁ జేమకూరయె!విసిగించిన నూర్వశిఁగొన విజయుడు పారెన్వసుధన్ నరుండనైతికరసికత లేనట్టివాఁడె రసరాజు గదా!చంపకమాలరసిక విలాసమున్ జనులు రంజిల వ్రాసెను జేమకూరయే!విసుగును జూపె నూర్వశికి వీరుఁడు శూరుఁడు సవ్యసాచియేవసుధ గణింపఁ బెక్కురిని వావిని వీడి యనైతికమ్ముగన్రసికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్!
ఇసుమంతయు శంక పడకు మెసగుచు నిన్నను జరిగిన యెన్నికలందున్ వసువును పంచి జయించగరసికత లేనట్టివాఁడె రసరాజు గదా
అసహాయ శూరు డనుచు మ నసు దోచె ననుచును జేర నరుడట యా యూ ర్వశి గాదనె యామె యనిన రసికత లేనట్టివాఁడె, రసరాజు గదా.అసురుల ద్రుంచి వృష్ణికి సహాయము చేసిన వీరుడంచు తా విసురుచు కామ దృక్కులను పేరిమి తో దరి జెరినట్టి యూ ర్వశి నట దూటిపుచ్చిన పురందర నందను డా పడంతి పై రసికత లేనివాఁడె, రసరాజ్యము నేలె మనోహరంబుగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిపసఁజూపెఁ జేమకూరయె!
విసిగించిన నూర్వశిఁగొన విజయుడు పారెన్
వసుధన్ నరుండనైతిక
రసికత లేనట్టివాఁడె రసరాజు గదా!
చంపకమాల
రసిక విలాసమున్ జనులు రంజిల వ్రాసెను జేమకూరయే!
విసుగును జూపె నూర్వశికి వీరుఁడు శూరుఁడు సవ్యసాచియే
వసుధ గణింపఁ బెక్కురిని వావిని వీడి యనైతికమ్ముగన్
రసికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్!
ఇసుమంతయు శంక పడకు
రిప్లయితొలగించండిమెసగుచు నిన్నను జరిగిన యెన్నికలందున్
వసువును పంచి జయించగ
రసికత లేనట్టివాఁడె రసరాజు గదా
రిప్లయితొలగించండిఅసహాయ శూరు డనుచు మ
నసు దోచె ననుచును జేర నరుడట యా యూ
ర్వశి గాదనె యామె యనిన
రసికత లేనట్టివాఁడె, రసరాజు గదా.
అసురుల ద్రుంచి వృష్ణికి సహాయము చేసిన వీరుడంచు తా
విసురుచు కామ దృక్కులను పేరిమి తో దరి జెరినట్టి యూ
ర్వశి నట దూటిపుచ్చిన పురందర నందను డా పడంతి పై
రసికత లేనివాఁడె, రసరాజ్యము నేలె మనోహరంబుగన్.