మందగా గెలిచిరి మననోడజేయుచున్ వందరోజులయ్యె పదవిదక్కి సందుచూచివారిఁ జక్కగాఁ దునుమాడి నిందఁ జేసెద విని నీవు మెచ్చ
మందగా గెలుపొందిరే వెసఁ మారిపోయె ప్రభుత్వమే వంద రోజులు దాటిపోయెను వారి పాలన కిప్పుడే సందు చిక్కిన చాలు వారిని చక్కగాఁ దును మాడుచున్ నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
[ పాలక పక్షాన్ని తిడితే ఆనందించే ప్రతిపక్ష నేతతో ఆ పార్టీ కార్యకర్త పలికిన మాటలు ]
ఆ.వె:హిందు మతము పట్ల నీసు తో నొక డనె నేత తోడ నిట్లు నీతి లేక హిందు దేవతలను,హిందు తత్త్వమ్మును నిందఁ జేసెద విని నీవు మెచ్చ” (ఇలా తిట్టే వాళ్లకి ట్రైనింగ్ ఇచ్చే నేత లుంటారు. ఆ శిక్షణ పొందిన వాడు నేత తో అన్నట్లు. )
ఇరుగు పొరుగున గల యిందీవరాక్షుల
రిప్లయితొలగించండినయము గాంచి నంత నా కొమరుడు
తప్పు జేసె ననుచు దబ్బితివిప్పుడు
నిందఁ జేసెద విని నీవు మెచ్చ
(విరహవేదన ననుభవిస్తున్న నాయికతో చెలికత్తె మాటలు...)
రిప్లయితొలగించండిసుందరీ! ప్రియుఁ డేగె నిన్విడి, సోలితే విరహమ్మునన్
గుందఁ జేసెడి పుష్పశరములఁ గొట్టు మన్మథు దౌష్ట్యమున్
మందమారుతమున్ శశాంకుని మీరె బాధ్యు లటంచిదే
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.
🙏
తొలగించండికురుక్షేత్ర సంగ్రామములో అర్జునుఁడు శ్రీకృష్ణ పరమాత్మ తో...
రిప్లయితొలగించండిఆటవెలది
మోహమందు జిక్కి సాహసము విడచి
విల్లువీడెదనన విశ్వరూప!
జ్ఞానమొలుక ప్రతిన సలిపి ననిన్, వీడ
నిందఁ, జేసెద విని నీవు మెచ్చ
మత్తకోకిల
కుందిపోవుచు మోహమందునఁ గూడనంచన వింటినే
చిందిగీతను విశ్వరూపము సృష్టినింపుచు చూపితే
నంది జ్ఞావము యుద్ధమెంచుచు నంబు బట్టియు, వీడగన్
నిందఁ, జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
ఎంద రెందరొ నిన్ను తిట్టను యింటికొచ్చిరి రాతిరిన్
రిప్లయితొలగించండికొంద రందున నిన్ను గట్టిగ కొట్ట బోవగ రాళ్ళతో
డెంద మందున బాధ కల్గగ యింటి కొచ్చిన వారినిన్
నింద జేయగ బూనుకుంటిని నీకు మోదము గల్గగన్
రిప్లయితొలగించండి*(దుస్ససేనుడు సుయోధనునితో పలికిన మాటలు గా)*
మాన్యుడ వగు నీకు మయసభ లో గాంచ
నొచ్చె మదియె గలుగ నోర్వ లేను
పగతురైన యట్టి పాండు సుతుల నిట
నిందఁ జేసెద విని నీవు మెచ్చ.
పొంద గోరుచు మత్తి కాడట పూజ్యురాలగు జానకిన్
బంది సేసె నటంచు శీఘ్రమె వార్ధి దాటుచు లంకలో
దండశూకుల మచ్చ మాపుచు దానవేంద్రుడు రావణున్
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.
మందగా గెలిచిరి మననోడజేయుచున్
రిప్లయితొలగించండివందరోజులయ్యె పదవిదక్కి
సందుచూచివారిఁ జక్కగాఁ దునుమాడి
నిందఁ జేసెద విని నీవు మెచ్చ
మందగా గెలుపొందిరే వెసఁ మారిపోయె ప్రభుత్వమే
వంద రోజులు దాటిపోయెను వారి పాలన కిప్పుడే
సందు చిక్కిన చాలు వారిని చక్కగాఁ దును మాడుచున్
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
[ పాలక పక్షాన్ని తిడితే ఆనందించే ప్రతిపక్ష నేతతో ఆ పార్టీ కార్యకర్త పలికిన మాటలు ]
సమస్య : "నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్"
రిప్లయితొలగించండిసుందరీ నినుజూసినంతనె స్రొక్కిపోతిని ప్రేమలో
మందభాగ్యుడ నిన్నుబొందెడి మాన్యతెక్కడిదంటినీ
అందలమ్మున నుంచువానిని నందుకొమ్మనిగోరి నే
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
మత్త॥ ఎందరో నినుఁ గొల్చి వేడఁగ నెంత ప్రేమను మాధవా
రిప్లయితొలగించండిపొందుగాఁ గని సంతసమ్ముగఁ బ్రోచినాడవు ధాత్రిలో
నందవేలను భక్తిఁ గాంచుచు నార్తుఁడై నిను మ్రొక్కినన్
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
(ఇది సర్వ సామాన్యమైనదండి. శ్రీ కంచెర్ల గోపన్న గారు కూడ ఇదే చేసారు గదండి)
ఆ.వె:హిందు మతము పట్ల నీసు తో నొక డనె
రిప్లయితొలగించండినేత తోడ నిట్లు నీతి లేక
హిందు దేవతలను,హిందు తత్త్వమ్మును
నిందఁ జేసెద విని నీవు మెచ్చ”
(ఇలా తిట్టే వాళ్లకి ట్రైనింగ్ ఇచ్చే నేత లుంటారు. ఆ శిక్షణ పొందిన వాడు నేత తో అన్నట్లు. )
చీడ పురుగు వోలె చీకాకు పరచుచు
రిప్లయితొలగించండిసంఘ మునకు కీడు సల్పు వాని
నింద జేసె ద విని నీవు మె చ్చ గ నన్ను
సాయ పడుచు నుండ శక్తి కొలది
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి2)ఉ:ఛంద మందున దేవతాళి బ్రశంస జేతురు మీరు, నే
రిప్లయితొలగించండినందమౌ పరిహాస మాడుచు నాది రీతుల వీడుచున్
సుందరమ్మగు శైలి తోడుత స్తోత్రగర్భిత మౌ విధిన్
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.
(మీ లాగా దేవతలను ప్రశంసించే పూర్వరీతులతో కాక నిందాస్తుతి తో వ్రాయ సాగాను.స్తోత్రగర్భితమౌ విధిన్ నింద = నిందాస్తుతి తో.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరేలను నిన్ను గొట్టగ యాగడమ్ములు సేతురే !
తొలగించండినిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
తొందరేలను వెన్నముద్దల తిందువే యని దాచగా
సందడేలర వారలింటను సైపరే నిను బాలుడన్
డెందమందున భక్తినిండగ డెప్పరమ్ములు దొల్గగన్
రిప్లయితొలగించండికందళించగ నందమే మది కాలకాల మహేశ్వరా
విందు చేయుచు వీనులన్ వినిపించ నీదగు కీర్తినిన్
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్