19, జూన్ 2026, శుక్రవారం

సమస్య - 5503

20-6-2026 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నిందఁ జేసెద విని నీవు మెచ్చ”

(లేదా...)

“నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్”

25 కామెంట్‌లు:

  1. ఇరుగు పొరుగున గల యిందీవరాక్షుల
    నయము గాంచి నంత నా కొమరుడు
    తప్పు జేసె ననుచు దబ్బితివిప్పుడు
    నిందఁ జేసెద విని నీవు మెచ్చ

    రిప్లయితొలగించండి
  2. (విరహవేదన ననుభవిస్తున్న నాయికతో చెలికత్తె మాటలు...)

    సుందరీ! ప్రియుఁ డేగె నిన్విడి, సోలితే విరహమ్మునన్
    గుందఁ జేసెడి పుష్పశరములఁ గొట్టు మన్మథు దౌష్ట్యమున్
    మందమారుతమున్ శశాంకుని మీరె బాధ్యు లటంచిదే
    నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదంలో యతి దోషాన్ని సవరించి....

      సుందరీ! ప్రియుఁ డేగె నిన్విడి, సోలితే విరహమ్మునన్
      గుందఁ జేసెడి పుష్పశరములఁ గొట్టు మన్మథు దౌష్ట్యమున్
      మందమారుతమున్ శశాంకుని మల్లెలన్ శిశిరర్తువున్
      నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.

      తొలగించండి
  3. కురుక్షేత్ర సంగ్రామములో అర్జునుఁడు శ్రీకృష్ణ పరమాత్మ తో...

    ఆటవెలది
    మోహమందు జిక్కి సాహసము విడచి
    విల్లువీడెదనన విశ్వరూప!
    జ్ఞానమొలుక ప్రతిన సలిపి ననిన్, వీడ
    నిందఁ, జేసెద విని నీవు మెచ్చ

    మత్తకోకిల
    కుందిపోవుచు మోహమందునఁ గూడనంచన వింటినే
    చిందిగీతను విశ్వరూపము సృష్టినింపుచు చూపితే
    నంది జ్ఞావము యుద్ధమెంచుచు నంబు బట్టియు, వీడగన్
    నిందఁ, జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్

    రిప్లయితొలగించండి
  4. ఎంద రెందరొ నిన్ను తిట్టను యింటికొచ్చిరి రాతిరిన్
    కొంద రందున నిన్ను గట్టిగ కొట్ట బోవగ రాళ్ళతో
    డెంద మందున బాధ కల్గగ యింటి కొచ్చిన వారినిన్
    నింద జేయగ బూనుకుంటిని నీకు మోదము గల్గగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తిట్టగ నింటికే చనుదెంచిరే... కల్గగ నింట జేరిన వారినిన్" అనండి.

      తొలగించండి

  5. *(దుస్ససేనుడు సుయోధనునితో పలికిన మాటలు గా)*

    మాన్యుడ వగు నీకు మయసభ లో గాంచ
    నొచ్చె మదియె గలుగ నోర్వ లేను
    పగతురైన యట్టి పాండు సుతుల నిట
    నిందఁ జేసెద విని నీవు మెచ్చ.


    పొంద గోరుచు మత్తి కాడట పూజ్యురాలగు జానకిన్
    బంది సేసె నటంచు శీఘ్రమె వార్ధి దాటుచు లంకలో
    దండశూకుల మచ్చ మాపుచు దానవేంద్రుడు రావణున్
    నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.

    రిప్లయితొలగించండి
  6. మందగా గెలిచిరి మననోడజేయుచున్
    వందరోజులయ్యె పదవిదక్కి
    సందుచూచివారిఁ జక్కగాఁ దునుమాడి
    నిందఁ జేసెద విని నీవు మెచ్చ

    మందగా గెలుపొందిరే వెసఁ మారిపోయె ప్రభుత్వమే
    వంద రోజులు దాటిపోయెను వారి పాలన కిప్పుడే
    సందు చిక్కిన చాలు వారిని చక్కగాఁ దును మాడుచున్
    నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్

    [ పాలక పక్షాన్ని తిడితే ఆనందించే ప్రతిపక్ష నేతతో ఆ పార్టీ కార్యకర్త పలికిన మాటలు ]

    రిప్లయితొలగించండి
  7. సమస్య : "నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్"

    సుందరీ నినుజూసినంతనె స్రొక్కిపోతిని ప్రేమలో
    మందభాగ్యుడ నిన్నుబొందెడి మాన్యతెక్కడిదంటినీ
    అందలమ్మున నుంచువానిని నందుకొమ్మనిగోరి నే
    నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్

    రిప్లయితొలగించండి
  8. మత్త॥ ఎందరో నినుఁ గొల్చి వేడఁగ నెంత ప్రేమను మాధవా
    పొందుగాఁ గని సంతసమ్ముగఁ బ్రోచినాడవు ధాత్రిలో
    నందవేలను భక్తిఁ గాంచుచు నార్తుఁడై నిను మ్రొక్కినన్
    నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్

    (ఇది సర్వ సామాన్యమైనదండి. శ్రీ కంచెర్ల గోపన్న గారు కూడ ఇదే చేసారు గదండి)

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె:హిందు మతము పట్ల నీసు తో నొక డనె
    నేత తోడ నిట్లు నీతి లేక
    హిందు దేవతలను,హిందు తత్త్వమ్మును
    నిందఁ జేసెద విని నీవు మెచ్చ”
    (ఇలా తిట్టే వాళ్లకి ట్రైనింగ్ ఇచ్చే నేత లుంటారు. ఆ శిక్షణ పొందిన వాడు నేత తో అన్నట్లు. )

    రిప్లయితొలగించండి
  10. చీడ పురుగు వోలె చీకాకు పరచుచు
    సంఘ మునకు కీడు సల్పు వాని
    నింద జేసె ద విని నీవు మె చ్చ గ నన్ను
    సాయ పడుచు నుండ శక్తి కొలది

    రిప్లయితొలగించండి
  11. 2)ఉ:ఛంద మందున దేవతాళి బ్రశంస జేతురు మీరు, నే
    నందమౌ పరిహాస మాడుచు నాది రీతుల వీడుచున్
    సుందరమ్మగు శైలి తోడుత స్తోత్రగర్భిత మౌ విధిన్
    నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.
    (మీ లాగా దేవతలను ప్రశంసించే పూర్వరీతులతో కాక నిందాస్తుతి తో వ్రాయ సాగాను.స్తోత్రగర్భితమౌ విధిన్ నింద = నిందాస్తుతి తో.)

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరేలను నిన్ను గొట్టగ యాగడమ్ములు సేతురే !
      నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
      తొందరేలను వెన్నముద్దల తిందువే యని దాచగా
      సందడేలర వారలింటను సైపరే నిను బాలుడన్

      తొలగించండి
  13. డెందమందున భక్తినిండగ డెప్పరమ్ములు దొల్గగన్
    కందళించగ నందమే మది కాలకాల మహేశ్వరా
    విందు చేయుచు వీనులన్ వినిపించ నీదగు కీర్తినిన్
    నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్

    రిప్లయితొలగించండి
  14. నందగోపబాలనవనీతచోరుడా!
    చిలిపిపనులుతగునె చిన్నికృష్ణ!
    కోక లన్ని దోచి గోలచేసితివని
    *“నిందఁ జేసెద విని నీవు మెచ్చ”

    సుందరమ్మగునీదురూపముచూడవాంఛయు హెచ్చెరా
    సందుగొందులనిన్నుగానక స్వాంతమందున చింతతో
    మందబుద్దినిమాటిమాటికిమాధవానినుదిట్టుచున్
    *“నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్”*


    రిప్లయితొలగించండి
  15. నీదు బాధఁ గాంచ నాదు డెంద మెరియు
    వేచి చూడు మయ్య వేఁగకుండఁ
    దొంద రేల శత్రు బృందమ్ము నెల్లను
    నిందఁ జేసెద విని నీవు మెచ్చ


    ఎంద ఱెందఱు పూజ సేయరె యెన్ని భంగుల భక్తిమై
    యిందిరాధవ సంతతమ్ము మహీతలమ్మున నిన్ను నే
    సుంద రార్థ సమేత మచ్యుత స్తోత్ర గర్భిత మింపుగా
    నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్

    రిప్లయితొలగించండి