13-6-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె”(లేదా...)“నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ”
తేటగీతిరామపట్టాభిషేకము రమ్యమనుచుకైక రంజిల్ల మంధరకాలుమోపిభరతుని వరింప పట్టమ్ము వాదుసలుపనారి నారి నడుమ రాముఁ డౌర నలిగె!ఉత్పలమాలభూరిగ సంబరాల్ గనుచు ముచ్చటఁజెందెడు కైకఁ గాంచుచున్దారుణమెంచి మంధరయె దావము పాలొనరించి రామునిన్దీరుచ రాజుగన్ భరతు దిక్కును జూపెడు వాదమందునన్నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ!
తేటగీతి
రిప్లయితొలగించండిరామపట్టాభిషేకము రమ్యమనుచు
కైక రంజిల్ల మంధరకాలుమోపి
భరతుని వరింప పట్టమ్ము వాదుసలుప
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె!
ఉత్పలమాల
భూరిగ సంబరాల్ గనుచు ముచ్చటఁజెందెడు కైకఁ గాంచుచున్
దారుణమెంచి మంధరయె దావము పాలొనరించి రామునిన్
దీరుచ రాజుగన్ భరతు దిక్కును జూపెడు వాదమందునన్
నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ!