17-6-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేలకొలఁది సమస్యలు విసుగు రాదు”
(లేదా...)
“వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే”
పూరణ సలుపుట కొరకు పుడుకు నట్టివేలకొలఁది సమస్యలు ! ; విసుగు రాదుకవుల కేలన ! కాలము గడుపుటకయియదియె యుత్తమమగు మార్గమనుచుదలచ
తేటగీతిశంకరాభరణ సమూహమంకురించిమార్గనిర్దేశమొసఁగెడు మాన్యగురులుకందివంశ చంద్రులు నిత్యమందిరాగవేలకొలఁది సమస్యలు విసుగు రాదు!ఉత్పలమాలతేలిక చేసి మర్మముల తీరును దెల్పుచు శిష్యకోటికిన్లీలగ పద్యముల్ మెరయు రీతిని నేరుపు కందిశంకరుల్మేలుగ 'శంకరాభరణ' మేటి సమూహము నడ్పుచుండగన్వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే!
శంకరాభరణసమూహ సత్కవులనుకందిశంకరయ్యగురువుగారునెపుడుప్రోత్సహింతురు చక్కని బోధజేసివేలకొలది సమస్యలు విసుగు రాదుచాలవుచాలవాకవికి సర్వవిభిన్నములైన ప్రశ్నలున్మేలగుమంచిముత్యమునుమించినశిల్పములైవెలుంగులేనేలకునింగికైనఘన నిచ్చెనవేయుసమర్థుడాతడేవేలసమస్యలిచ్చినను వేసరిలంగవిమిత్రులొప్పరే
పూరణ సలుపుట కొరకు పుడుకు నట్టి
రిప్లయితొలగించండివేలకొలఁది సమస్యలు ! ; విసుగు రాదు
కవుల కేలన ! కాలము గడుపుటకయి
యదియె యుత్తమమగు మార్గమనుచుదలచ
తేటగీతి
రిప్లయితొలగించండిశంకరాభరణ సమూహమంకురించి
మార్గనిర్దేశమొసఁగెడు మాన్యగురులు
కందివంశ చంద్రులు నిత్యమందిరాగ
వేలకొలఁది సమస్యలు విసుగు రాదు!
ఉత్పలమాల
తేలిక చేసి మర్మముల తీరును దెల్పుచు శిష్యకోటికిన్
లీలగ పద్యముల్ మెరయు రీతిని నేరుపు కందిశంకరుల్
మేలుగ 'శంకరాభరణ' మేటి సమూహము నడ్పుచుండగన్
వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే!
శంకరాభరణసమూహ సత్కవులను
రిప్లయితొలగించండికందిశంకరయ్యగురువుగారునెపుడు
ప్రోత్సహింతురు చక్కని బోధజేసి
వేలకొలది సమస్యలు విసుగు రాదు
చాలవుచాలవాకవికి సర్వవిభిన్నములైన ప్రశ్నలున్
మేలగుమంచిముత్యమునుమించినశిల్పములైవెలుంగులే
నేలకునింగికైనఘన నిచ్చెనవేయుసమర్థుడాతడే
వేలసమస్యలిచ్చినను వేసరిలంగవిమిత్రులొప్పరే