16-6-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా”
(లేదా...)
“ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్”
వరమై దీనులతాపనాశకములై భావార్థగమ్యమ్ములైకరుణాసంద్రములైసదానరులకున్ కష్టాపహారంబులైచిరకాలంబుగ చింతితార్థఫలముల్ శ్రేయంబులాచంద్రశేఖరపాదంబులెమోక్షదాయకములౌ గాదందురాపండితుల్కరుణనుగురిపించునెపుడుమరణమునమృతత్త్వమొసగు మహిమాన్వితముల్మరువకు నిరతము విధుశేఖరపదములె మోక్షదాయకమ్ములగుగదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నిరతము జీవితమందున నెరవేర్చెడి పాపములను నిరసించుటకై ,యరయగ దెలిసెను శశీశేఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా
నరుడా! మానవ జన్మమందు గడుపుణ్యంబార్జనంజేయుమా!దురహంకారము మాని సజ్జనుడవైదుష్కార్యముల్ వీడియున్పరమారాద్యుని సేవయే జనులకున్భాగ్యమ్ము , శ్రీ చంద్ర శేఖరపాదంబులె మోక్షదాయకములౌగాదందురా పండితుల్
స్మరి యించు చు శివ నామము కరములు జోడించి మ్రొ క్క కరుణించు దయా పరుడుగు శంకరు శశి శే ఖర పదము లె మో క్ష దాయ కమ్ములగు గదా!
సిరి సంపదలవి ధరలో స్థిరములు కావని యెఱుగుచు దివ్య పదము కై నిరతమ్ము చంద్రమశ్శే ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా.పరుగుల్ తీయకు మెండమావులవియే స్వాస్థ్యమ్ము లీ ధాత్రిలో స్థిరముల్ కావను మాట వాస్తవమదే క్షేత్రములో కాంచగా పరమానందుడె శాశ్వతమ్మనెడి విశ్వాసమ్ము తో చంద్రశే ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్.
వరదుండని సేవింతురుకరిచర్మాంబరధరునిటఁ గైవల్యముకైపరమేశ్వరుడగు శశిశేఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదావరదుండాశివుడంచుఁ గొల్తురుకదా భస్మాంగునిన్ భక్తితోకరిచర్మాంబరధారి నిబ్బరికమే కైవల్యమిచ్చున్ గదాకరుణాంభోనిధి యన్న నీలగళుడే కాలాత్ముడా చంద్రశేఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్
వరమై దీనులతాపనాశకములై భావార్థగమ్యమ్ములై
రిప్లయితొలగించండికరుణాసంద్రములైసదానరులకున్ కష్టాపహారంబులై
చిరకాలంబుగ చింతితార్థఫలముల్ శ్రేయంబులాచంద్రశే
ఖరపాదంబులెమోక్షదాయకములౌ గాదందురాపండితుల్
కరుణనుగురిపించునెపుడు
మరణమునమృతత్త్వమొసగు మహిమాన్వితముల్
మరువకు నిరతము విధుశే
ఖరపదములె మోక్షదాయకమ్ములగుగదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిరతము జీవితమందున
రిప్లయితొలగించండినెరవేర్చెడి పాపములను నిరసించుటకై ,
యరయగ దెలిసెను శశీశే
ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా
నరుడా! మానవ జన్మమందు గడు
రిప్లయితొలగించండిపుణ్యంబార్జనంజేయుమా!
దురహంకారము మాని సజ్జనుడవై
దుష్కార్యముల్ వీడియున్
పరమారాద్యుని సేవయే జనులకున్
భాగ్యమ్ము , శ్రీ చంద్ర శే
ఖరపాదంబులె మోక్షదాయకములౌ
గాదందురా పండితుల్
స్మరి యించు చు శివ నామము
రిప్లయితొలగించండికరములు జోడించి మ్రొ క్క కరుణించు దయా
పరుడుగు శంకరు శశి శే
ఖర పదము లె మో క్ష దాయ కమ్ములగు గదా!
రిప్లయితొలగించండిసిరి సంపదలవి ధరలో
స్థిరములు కావని యెఱుగుచు దివ్య పదము కై
నిరతమ్ము చంద్రమశ్శే
ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా.
పరుగుల్ తీయకు మెండమావులవియే స్వాస్థ్యమ్ము లీ ధాత్రిలో
స్థిరముల్ కావను మాట వాస్తవమదే క్షేత్రములో కాంచగా
పరమానందుడె శాశ్వతమ్మనెడి విశ్వాసమ్ము తో చంద్రశే
ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్.
వరదుండని సేవింతురు
రిప్లయితొలగించండికరిచర్మాంబరధరునిటఁ గైవల్యముకై
పరమేశ్వరుడగు శశిశే
ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా
వరదుండాశివుడంచుఁ గొల్తురుకదా భస్మాంగునిన్ భక్తితో
కరిచర్మాంబరధారి నిబ్బరికమే కైవల్యమిచ్చున్ గదా
కరుణాంభోనిధి యన్న నీలగళుడే కాలాత్ముడా చంద్రశే
ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్