12-6-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే”(లేదా...)“చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్”
దారుణ దారిద్ర్యముతోతీరము లేనట్టి నావ తీరుగనెపుఁడున్దారెరుగక తిరిగెడు సంచారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే
పార్వతితో చెలికత్తె రూపంలో వచ్చిన శివయ్య:కందంభూరిగ జటలం, గళమునబోరప్రాకుడు ధరించు ముక్కంటికహోదారవె? మరుభూమిని సంచారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే!శార్దూలవిక్రీడితముగౌరీ! జూటము బూదిపూతలను ముక్కంటిన్ గళంబందునన్బోరప్రాకుడు, నెద్దు వాహనముగన్, ముష్టెంచగన్ బుఱ్ఱెలోనేరీతిన్ సతి కాగ కోరితివొకో! ఈశున్ శ్మశానంపు సంచారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్!
దారాపుత్రుల దైన్యముం గనఁగ సంతాపంబు పెంపారగాదారిందెన్నును గానరాక భృతికిన్ దారిద్ర్యమే తోడుగాతీరంబుం గనరాని నావ పగిదిన్ దేశంబులంబట్టు సంచారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్
దారుణ దారిద్ర్యముతో
రిప్లయితొలగించండితీరము లేనట్టి నావ తీరుగనెపుఁడున్
దారెరుగక తిరిగెడు సం
చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే
పార్వతితో చెలికత్తె రూపంలో వచ్చిన శివయ్య:
రిప్లయితొలగించండికందం
భూరిగ జటలం, గళమున
బోరప్రాకుడు ధరించు ముక్కంటికహో
దారవె? మరుభూమిని సం
చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే!
శార్దూలవిక్రీడితము
గౌరీ! జూటము బూదిపూతలను ముక్కంటిన్ గళంబందునన్
బోరప్రాకుడు, నెద్దు వాహనముగన్, ముష్టెంచగన్ బుఱ్ఱెలో
నేరీతిన్ సతి కాగ కోరితివొకో! ఈశున్ శ్మశానంపు సం
చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్!
దారాపుత్రుల దైన్యముం గనఁగ సంతాపంబు పెంపారగా
రిప్లయితొలగించండిదారిందెన్నును గానరాక భృతికిన్ దారిద్ర్యమే తోడుగా
తీరంబుం గనరాని నావ పగిదిన్ దేశంబులంబట్టు సం
చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్