17-7-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్”
(లేదా...)
“ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా”
కందంనవ్యాకృతి దాల్చి శివుడెభవ్యమ్మౌ బాటఁ జూపు బాబా యనఁగన్దివ్యము షిర్డియె, భిక్షువుద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్!శార్దూలవిక్రీడితమునవ్యంబై యలరారు రూపమునఁ జంద్రాపీడుడే యోగియైభవ్యమ్మౌ సుపథాన భక్తతతికిన్ భాగ్యమ్ములందింపఁగన్దివ్యమ్మై వెలుగొందె షిర్డి పురమే దేదీప్యమై! భిక్షువైద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా!
ఆవ్యోమకేశు నడుగుటభవ్యమనుచు తిరిపమెత్తు వానినె యెంచన్ భావ్యముగ వేడు కొనగనెద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్
నవ్యంబౌ తన కృతిలోద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్దివ్యంబీ రచన యనుచునవ్యాజమ్ముగ వచించి రాతని మిత్రుల్కావ్యాలెన్నియొ వ్రాసినట్టి కవి తాఁ గల్పించె కొంగ్రొత్తగాదివ్యంబీతని సృష్టి మారె జగమే దేవేంద్ర లోకంబుగాద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగాభవ్యంబైనది వస్తువేననుచు సంభావించిరే పాఠకుల్
కావ్యం బందు చదివి తిని యవ్యక్తుని వాలయమ్ము యక్షుడు కొలువన్ భవ్య మగు భక్తి గని యా ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్. కావ్యం బందు పఠింపగా తెలిసెనే కాత్యాయనీ నాథుడౌ యవ్యక్తుండను నిత్యమున్ గొలువగా యక్షుండు సద్భక్తి తో భవ్యంబైన కుబేరు భక్తి గని యా భద్రేశుడా ద్రాపుడా ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా.
కందం
రిప్లయితొలగించండినవ్యాకృతి దాల్చి శివుడె
భవ్యమ్మౌ బాటఁ జూపు బాబా యనఁగన్
దివ్యము షిర్డియె, భిక్షువు
ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్!
శార్దూలవిక్రీడితము
నవ్యంబై యలరారు రూపమునఁ జంద్రాపీడుడే యోగియై
భవ్యమ్మౌ సుపథాన భక్తతతికిన్ భాగ్యమ్ములందింపఁగన్
దివ్యమ్మై వెలుగొందె షిర్డి పురమే దేదీప్యమై! భిక్షువై
ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా!
ఆవ్యోమకేశు నడుగుట
రిప్లయితొలగించండిభవ్యమనుచు తిరిపమెత్తు వానినె యెంచన్
భావ్యముగ వేడు కొనగనె
ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్
నవ్యంబౌ తన కృతిలో
రిప్లయితొలగించండిద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్
దివ్యంబీ రచన యనుచు
నవ్యాజమ్ముగ వచించి రాతని మిత్రుల్
కావ్యాలెన్నియొ వ్రాసినట్టి కవి తాఁ గల్పించె కొంగ్రొత్తగా
దివ్యంబీతని సృష్టి మారె జగమే దేవేంద్ర లోకంబుగా
ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా
భవ్యంబైనది వస్తువేననుచు సంభావించిరే పాఠకుల్
రిప్లయితొలగించండికావ్యం బందు చదివి తిని
యవ్యక్తుని వాలయమ్ము యక్షుడు కొలువన్
భవ్య మగు భక్తి గని యా
ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్.
కావ్యం బందు పఠింపగా తెలిసెనే కాత్యాయనీ నాథుడౌ
యవ్యక్తుండను నిత్యమున్ గొలువగా యక్షుండు సద్భక్తి తో
భవ్యంబైన కుబేరు భక్తి గని యా భద్రేశుడా ద్రాపుడా
ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా.