కం: భవ్యమగు సూచన లిడెను ద్రవ్యమ్మే లేని పేద తా నార్థికమున్ సవ్యముగ దెలిపి ప్రభుతకు ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్ (ఒక అర్థశాస్త్రవేత్త పేదవాడు కావచ్చు.కానీ అతను ప్రభుత్వానికి ఇచ్చిన సూచనల వలన దారిద్ర్యం తొలగింది. )
శా:ద్రవ్యం బింతయు లేని శ్రామికుల నిందన్ జేతువే!వారికిన్ సవ్యమ్మౌ నొక వేతన మ్మిడవు,లేశ మ్మైన చింతింపు మీ భవ్యమ్మౌ స్థితి లేని కాలమును! నీ భాగ్యప్రదుల్ వారలే ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా” (శ్రామికుడు లేకుండా భాగ్యం రాదు కదా! వీడికి గొప్ప భాగ్యం రాని కాలం లో ఆ శ్రామికుడే ఈ పెట్టుబడి దారుకి భాగ్య దాత. )
కందం
రిప్లయితొలగించండినవ్యాకృతి దాల్చి శివుడె
భవ్యమ్మౌ బాటఁ జూపు బాబా యనఁగన్
దివ్యము షిర్డియె, భిక్షువు
ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్!
శార్దూలవిక్రీడితము
నవ్యంబై యలరారు రూపమునఁ జంద్రాపీడుడే యోగియై
భవ్యమ్మౌ సుపథాన భక్తతతికిన్ భాగ్యమ్ములందింపఁగన్
దివ్యమ్మై వెలుగొందె షిర్డి పురమే దేదీప్యమై! భిక్షువై
ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా!
ఆవ్యోమకేశు నడుగుట
రిప్లయితొలగించండిభవ్యమనుచు తిరిపమెత్తు వానినె యెంచన్
భావ్యముగ వేడు కొనగనె
ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్
నవ్యంబౌ తన కృతిలో
రిప్లయితొలగించండిద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్
దివ్యంబీ రచన యనుచు
నవ్యాజమ్ముగ వచించి రాతని మిత్రుల్
కావ్యాలెన్నియొ వ్రాసినట్టి కవి తాఁ గల్పించె కొంగ్రొత్తగా
దివ్యంబీతని సృష్టి మారె జగమే దేవేంద్ర లోకంబుగా
ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా
భవ్యంబైనది వస్తువేననుచు సంభావించిరే పాఠకుల్
రిప్లయితొలగించండికావ్యం బందు చదివి తిని
యవ్యక్తుని వాలయమ్ము యక్షుడు కొలువన్
భవ్య మగు భక్తి గని యా
ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్.
కావ్యం బందు పఠింపగా తెలిసెనే కాత్యాయనీ నాథుడౌ
యవ్యక్తుండను నిత్యమున్ గొలువగా యక్షుండు సద్భక్తి తో
భవ్యంబైన కుబేరు భక్తి గని యా భద్రేశుడా ద్రాపుడా
ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా.
రిప్లయితొలగించండికం॥
ద్రవ్యము నింటను గాకన్
సవ్యముగా బ్యాంకునుంచె సంపద పెరుగన్
ద్రవ్యము దొంగల కీయక
ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్!!
(ద్రవ్యము నోట్ల రూపం లో గాక వడ్డీ వచ్చే డిపాజిట్లుగా పెట్టుకొన్నవాడని పూరణ)
శా॥ దివ్యంబంచు దరిద్రుఁడైనను సదుద్దేశమ్ముతో సాగుచున్
రిప్లయితొలగించండిసవ్యంబంచుఁ బ్రధానమంత్రి గనుచున్ సాధ్యమ్ము లెక్కించుచున్
నవ్యంబైన విధమ్ము నార్థికత విన్నాణమ్ముతో దిద్దఁగా
ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా
(State head should have vision n direction అండి. ధనికుడే కానవసరము లేదండి)
కం: భవ్యమగు సూచన లిడెను
రిప్లయితొలగించండిద్రవ్యమ్మే లేని పేద తా నార్థికమున్
సవ్యముగ దెలిపి ప్రభుతకు
ద్రవ్యరహితుఁడె తొలగించె దారిద్ర్యమ్మున్
(ఒక అర్థశాస్త్రవేత్త పేదవాడు కావచ్చు.కానీ అతను ప్రభుత్వానికి ఇచ్చిన సూచనల వలన దారిద్ర్యం తొలగింది. )
శా:ద్రవ్యం బింతయు లేని శ్రామికుల నిందన్ జేతువే!వారికిన్
రిప్లయితొలగించండిసవ్యమ్మౌ నొక వేతన మ్మిడవు,లేశ మ్మైన చింతింపు మీ
భవ్యమ్మౌ స్థితి లేని కాలమును! నీ భాగ్యప్రదుల్ వారలే
ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా”
(శ్రామికుడు లేకుండా భాగ్యం రాదు కదా! వీడికి గొప్ప భాగ్యం రాని కాలం లో ఆ శ్రామికుడే ఈ పెట్టుబడి దారుకి భాగ్య దాత. )
అవ్యాజప్రేమ సెలగ
రిప్లయితొలగించండిద్రవ్యార్జన పద్ధతుల నరప్రవరుఁ డహో
నవ్యము లగు బోధనముల
ద్రవ్య రహితుఁడె తొలఁగించె దారిద్ర్యమ్మున్
నవ్యాపూర్వ విశేష మయ్య వినుమా నా పల్కు వాక్యమ్ములన్
భవ్యాంతఃకరణుండు దానరతుఁడుం బద్మాక్ష భక్తుండు దా
నవ్యాజప్రతిభా లసత్పురుషుఁ డన్యాయార్జితం బైనదౌ
ద్రవ్యం బింతయు లేని వాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా
నవ్యము గా నొన రించి న
రిప్లయితొలగించండిసవ్యపు వ్యాపార మందు చాల లభించె న్
ద్రవ్యము : ధనవంతు డగు చు
ద్రవ్య రహి తుడు తొలగించె దా రి దృమ్ము న్
భవ్యమ్మౌ వ్యవసాయమున్ సతము సంభావించి, కూలీలతో
రిప్లయితొలగించండినవ్యమ్మైన విధానమున్ బనుల విన్నాణమ్ముఁ జేయించుచున్
గవ్యమ్ముల్ బొనరించుచున్ బశులతో, కాంక్షించి యభ్యున్నతిన్
ద్రవ్యంబింతయు లేనివాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నవ్యపు టాలోచనలన్
సవ్యపు సలహాలను వ్యవసాయము నందున్
భవ్యముగా హితుని కిడుచు
ద్రవ్యరహితుడె తొలగించె దారిద్ర్యమ్మున్.