19-7-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్”
(లేదా...)
“రూపము లేనివాని శుభరూపమునే మది నిల్పి కొల్చెదన్”
ఆ పరమాత్ముని గాంచగ రూపము మదిలో దలంచి లోహము తోడన్ కోపుగ జేయించి సదా రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్”
పాపుల దునుమాడ దలచి చేపయు కిటి కమఠము నర సింహము తానై యీ పుడమిని కాచిన యా రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్.నాపయి జాలి చూపుమని నశ్వర మైన కళేబరమ్ము పై తీపిని వీడి వాసి ముగితిన్ క్షణియించుచు నీదు నామమే పాప హరమ్మటంచు విసువాసము తోడ నహర్నిశమ్ములున్ రూపము లేనివాని శుభరూపమునే మది నిల్పి కొల్చెదన్.
ఆపువ్విల్తుని సోముడుకోపముతోఁ జూడ రూపు కోల్పడెననుచున్వాపోయిన రతి చాటెన్రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్తాపసియైన భార్గవుడు తామసమే చెలరేగిచూడ నాచూపుకు భస్మమై మిగుల శోకము నాకు మిగిల్చె నయ్యయోరూపము గోలుపోయె నభిరూపుడు నాకిక మార్గమేదయారూపము లేనివాని శుభరూపమునే మది నిల్పి కొల్చెదన్[ శివుడు మన్మథుని భస్మము చేసిన పిదప అతని భార్య రతి పలుకులు ]
ఆ పరమాత్ముని గాంచగ
రిప్లయితొలగించండిరూపము మదిలో దలంచి లోహము తోడన్
కోపుగ జేయించి సదా
రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్”
రిప్లయితొలగించండిపాపుల దునుమాడ దలచి
చేపయు కిటి కమఠము నర సింహము తానై
యీ పుడమిని కాచిన యా
రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్.
నాపయి జాలి చూపుమని నశ్వర మైన కళేబరమ్ము పై
తీపిని వీడి వాసి ముగితిన్ క్షణియించుచు నీదు నామమే
పాప హరమ్మటంచు విసువాసము తోడ నహర్నిశమ్ములున్
రూపము లేనివాని శుభరూపమునే మది నిల్పి కొల్చెదన్.
ఆపువ్విల్తుని సోముడు
రిప్లయితొలగించండికోపముతోఁ జూడ రూపు కోల్పడెననుచున్
వాపోయిన రతి చాటెన్
రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్
తాపసియైన భార్గవుడు తామసమే చెలరేగిచూడ నా
చూపుకు భస్మమై మిగుల శోకము నాకు మిగిల్చె నయ్యయో
రూపము గోలుపోయె నభిరూపుడు నాకిక మార్గమేదయా
రూపము లేనివాని శుభరూపమునే మది నిల్పి కొల్చెదన్
[ శివుడు మన్మథుని భస్మము చేసిన పిదప అతని భార్య రతి పలుకులు ]