30, అక్టోబర్ 2026, శుక్రవారం

సమస్య - 5636

31-10-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు”

(లేదా...)

“వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్”

3 కామెంట్‌లు:

  1. గుణవతియైన కన్నియ గుర్తు తెలసి
    పెండ్లి యాడియు యిర్వురు పేర్మతోడ
    కలిసి మెలిసియుందురు వరకట్నమన్న
    వలకు జిక్కని వాడెపో వలపుకాడు

    రిప్లయితొలగించండి
  2. అతివల కలవాటగు రీతి , యామెపయిన
    తగులు జూపించుటందున దనగురించి
    చామ పక్కింటి వారితో సలుపు సొవసొ
    వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు

    రిప్లయితొలగించండి
  3. కులుకుల్ సూపి విశేష వేదికలలోఁ గూర్మిన్ బిసాళించి, రా
    చిలకన్ బోలెడి తీయనైన పలుకుల్ చిందించి, గుప్పించినన్
    వలపున్; లొంగక యాలిపై నెనరుతో వాంఛల్ నిరోధించి యా
    *“వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్”*

    - విట్టుబాబు

    రిప్లయితొలగించండి