31-10-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు”
(లేదా...)
“వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్”
గుణవతియైన కన్నియ గుర్తు తెలసిపెండ్లి యాడియు యిర్వురు పేర్మతోడకలిసి మెలిసియుందురు వరకట్నమన్నవలకు జిక్కని వాడెపో వలపుకాడు
అతివల కలవాటగు రీతి , యామెపయిన తగులు జూపించుటందున దనగురించి చామ పక్కింటి వారితో సలుపు సొవసొవలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు
కులుకుల్ సూపి విశేష వేదికలలోఁ గూర్మిన్ బిసాళించి, రాచిలకన్ బోలెడి తీయనైన పలుకుల్ చిందించి, గుప్పించినన్వలపున్; లొంగక యాలిపై నెనరుతో వాంఛల్ నిరోధించి యా*“వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్”* - విట్టుబాబు
తల్లి దండ్రుల విడనాడి ధవుడె తనకు సర్వ మనుచును తలచెడి సాధ్వి నెపుడు గౌర వించుచు నీచులౌ ఖలు వెలచెలు వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు.నెలగన్ బొందగ నెంచి వారవనితల్ నెయ్యంపు పేశస్సు తో కులుకుల్ జూపుచు కోడె కారులను సంకోచింప కన్ బిల్వ గా దిలినిన్ వంచన జేయ బోననుచు చిత్తేశుండు మేల్దాపరుల్ వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్.
గుణవతియైన కన్నియ గుర్తు తెలసి
రిప్లయితొలగించండిపెండ్లి యాడియు యిర్వురు పేర్మతోడ
కలిసి మెలిసియుందురు వరకట్నమన్న
వలకు జిక్కని వాడెపో వలపుకాడు
అతివల కలవాటగు రీతి , యామెపయిన
రిప్లయితొలగించండితగులు జూపించుటందున దనగురించి
చామ పక్కింటి వారితో సలుపు సొవసొ
వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు
కులుకుల్ సూపి విశేష వేదికలలోఁ గూర్మిన్ బిసాళించి, రా
రిప్లయితొలగించండిచిలకన్ బోలెడి తీయనైన పలుకుల్ చిందించి, గుప్పించినన్
వలపున్; లొంగక యాలిపై నెనరుతో వాంఛల్ నిరోధించి యా
*“వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్”*
- విట్టుబాబు
రిప్లయితొలగించండితల్లి దండ్రుల విడనాడి ధవుడె తనకు
సర్వ మనుచును తలచెడి సాధ్వి నెపుడు
గౌర వించుచు నీచులౌ ఖలు వెలచెలు
వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు.
నెలగన్ బొందగ నెంచి వారవనితల్ నెయ్యంపు పేశస్సు తో
కులుకుల్ జూపుచు కోడె కారులను సంకోచింప కన్ బిల్వ గా
దిలినిన్ వంచన జేయ బోననుచు చిత్తేశుండు మేల్దాపరుల్
వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్.