31, అక్టోబర్ 2026, శనివారం

సమస్య - 5637

1-11-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాముఁడు లంకానగరికి రాజయ్యెఁ గదా”

(లేదా...)

“రాముఁడు రావణుం దునిమి రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్”

4 కామెంట్‌లు:

  1. కందం
    నీమము దప్ప దశాస్యుడు,
    'సేమమునెంచి విభీషణుండు చేర',సమరమునన్
    భీమ బలమ్మున దునుమన్
    రాముఁడు, 'లంకానగరికి రాజయ్యెఁ గదా!'

    ఉత్పలమాల
    నీమమునొప్ప జానకిని నీరజనేత్రునకందఁ జేసినన్
    సేమమనన్ విభీషణునిఁ జేయగ నిందను,జేరవచ్చినన్
    సౌమనసమ్మునందభయశాలిగఁ గూరిమి నప్పగించగన్
    రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్

    రిప్లయితొలగించండి

  2. భూమిజ విముక్తికి వెడలె
    రాముఁడు లంకానగరికి ; రాజయ్యెఁ గదా
    యా మండోదరి మరదియె ,
    రాముడు నిష్ఠించినటుల లభ్యపు రీతిన్

    రిప్లయితొలగించండి
  3. కందం:
    నామమడచె దశకంఠుని
    రాముఁడు, లంకానగరికి రాజయ్యెఁ గదా
    ధీమతి విభీషణుఁడు శ్రీ
    రాముని యామంత్రణమున రాజ్యమునేలన్

    రిప్లయితొలగించండి
  4. ఉత్పలమాలిక.

    శ్రీమహిజాతనాథుడు వశీకృతచిత్తుడు లోకపాలుడున్
    శ్యామలకోమలాంగుడు దయాగుణ శీలుడు ధర్మరూపుడున్
    సోమహృదాంతరస్థితవిశుద్ధవినిర్మలవేదవేద్యుడున్
    ధీమతిదుష్టభంజనుడు దిగ్విజయంబుగగెల్చెధాత్రినే
    భూమినినేకఛత్రమున పుణ్యచరిత్రుడెనేలెనే పరం
    ధాముడు రాక్షసోత్తముని ధన్యునిజేసెనదెట్టులన్న? శ్రీ
    రాముడురావణుందునిమి రాజుగనయ్యెను స్వర్ణలంకకున్

    రిప్లయితొలగించండి