అస్థి నాస్తి శిరో నాస్తి
బాహురస్తి నిరంగుళిః |
నాస్తి పాదద్వయం గాఢ
మంగమాలింగతి స్వయమ్ ||
(శ్రీ శ్రీభాష్యం విజయ సారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం -ఆ. వె.
లేవు బొమిక లెవ్వి లేదు తలయు గూడ
చేతు లుండు లేవు చేతివ్రేళ్ళు
కాళ్ళు లేవు గాని కౌఁగిలించు నొడలు
తెలిసి చెప్పఁగలవె ధీవిశాల!
సమాధానం - అంగీ (చొక్కా).
కవిమిత్రులారా,క్రింది సమస్యను పూరించండి."అంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్."