7, జులై 2011, గురువారం

సమస్యా పూరణం -385 (హరికి గీతను బోధించె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
హరికి గీతను బోధించె నర్జునుండు.
ఈ సమస్యను సూచించిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

11 కామెంట్‌లు:

  1. హరుడు సఖుడయె నెవరికి ? యవని యందు
    విష్ణుడేగతి నరునకు విద్యఁ గఱపె?
    మత్స్య యంత్రము పడగొట్టు మాన్యుడెవరు?
    హరికి; గీతను బోధించె; నర్జునుండు.

    రిప్లయితొలగించండి
  2. అక్క జేరెను హరి తండ్రి అర్జునుండు
    "బావ పై మరదలుగీత మరులు గొనెను
    మేన రికమును చేయుట మేలు యిమ్ము
    హరికి గీతను" బోధించె నర్జునుండు.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    ____________________________________

    ధర్మజుని తమ్ము డెవరికి - దండమిడెను ?
    భీతి పోగొట్ట కృష్ణుడే - నీతి చెప్పె ?
    నీతి విని పోర నెవ్వడు - నిశ్చయించె ?
    హరికి ! గీతను బోధించె ! నర్జునుండు !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  4. 02)
    ____________________________________

    గీత వినిపించ మని కోరె - గిరిజ , హరియు
    గురువు గారిని ! వారల - కోర్కి దీర్చ
    గృహము నందున వెంటనే - గిరిజ మరియు
    హరికి గీతను బోధించె - నర్జునుండు !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  5. 03)
    ____________________________________

    బంధు మిత్రుల చంపగా - బాధ కలుగు
    ననియె పార్థుడు బెంగగా - నావహమున
    హరికి ! గీతను బోధించె - నర్జునుండు
    వేగ సమరము జేయగా - వెన్ను డంత !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  6. మందాకిని గారూ,
    ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ అన్ని విధాలా ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ‘గీత్’ పెండ్లి ముచ్చటతో పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,
    ప్రశ్నోత్తర రూపంలో మొదటి పూరణ, ‘అర్జును’డనే గురువుగారి రెండవ పూరణ, సమస్య పాదానికి సమర్థవంతమైన విఱుపు నిచ్చిన మూడవ పూరణ దేనికదే వైవిధ్యంతో శోభిస్తూ అలరిస్తున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. తే.గీ: మించి భీష్ముని పైకి లంఘించు కృష్ణు
    నరసి-"గీత దాటకు బావ!యాహవమ్ము
    జేయ నంటివి చక్రమ్ముదీయ"కనుచు
    హరికి గీతను బోధించె నర్జునుండు .

    --- వెంకట రాజారావు .లక్కాకుల

    --- బ్లాగు:సుజన సృజన

    రిప్లయితొలగించండి
  8. బంధు జనమునునిర్జించి బొందుసుఖము
    శాంతినీయదనుచు సవ్యసాచిదెలుప
    హరికి,గీతను బోధించె ; నర్జునుండు
    బొందె విజయమ్ము హరిమెచ్చ పోరునందు !!!

    రిప్లయితొలగించండి
  9. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    తిక్కన గారి ‘కుప్పించి యెగసిన..’ పద్యాన్ని గుర్తుకు తెచ్చారు. భారతంలో నాకు బాగా నచ్చిన సన్నివేశం అది. చక్కని పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ నిచ్చారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి