8, జులై 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 98 (ప్రహేళిక)

వనే జాతా వనే త్యక్తా
వనే తిష్ఠతి నిత్యశః |
పణ్యస్త్రీ న తు సా వేశ్యా
యో జానాతి స పండితః ||
(శ్రీ శ్రీభాష్యం విజయ సారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
(వనం = అడవి, జలం; పణ్యస్త్రీ = స్త్రీలింగ శబ్దమైన ధనమిచ్చి అనుభవించే వస్తువు)
నా అనువాదం -
కం.
వనమున జనియించును మఱి
వనమున విడువంగఁబడును వనమున నుండున్
ధన మిచ్చి యనుభవించెద
మన వేశ్యయు గాదు; తెలుపు నతఁడే బుధుఁ డౌ.
సమాధానం - నౌక. (నౌక నిర్మాణానికి కావలసిన కఱ్ఱ అడవిలో పుడుతుంది. దానిని నీటిలో విడుస్తారు. ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది. డబ్బిచ్చి దానిపై ప్రయాణం చేస్తాము.)
కవిమిత్రులారా,
‘నౌక, ఓడ, పడవ, నావ’ శబ్దాలను ఉపయోగించి భారతార్థంలో మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. కర్ణుడు సుయోధనుని తో...

    ఓడ గొట్టుదు అర్జును నొక్క వ్రేటు
    నమ్ము మిత్రమ నమ్ముము నావచనము
    కనపడ వలయు నా శక్తి కనగ నీకు
    నౌకరుండను నీక్రింద నాజ్ఞ నిమ్ము.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    శాస్త్రీజీ ! బావుంది !

    ధర్మరాజు " బావా ! దాయాదులతో కలహమనే
    సముద్రాన్ని దాటుటకు యుద్ధమనే పడవలో బయలుదేరాం !
    మా నౌకకు నావికుడవూ, మాకు మార్గదర్శివీ, మమ్ములను
    సరైన మార్గానికి మళ్ళించే సారథివీ నీ వే ! కావున మమ్మల్ని
    క్షేమంగా ఆవలి ఒడ్డుకు జేర్చు" మని శ్రీకృష్ణుని ప్రార్థించెను !
    01)
    ___________________________________

    ఓడ కుండగ యుద్ధంపు - పడవ మీద
    నావలికి జేర్చు మమ్ముల - నల్ల నయ్య !
    "నౌక జలధిని నడిపెడు - నావికుడవు -
    మార్గ దర్శివి - సారథి - మాకు నీవె "!
    ___________________________________

    రిప్లయితొలగించండి
  3. పడవలెనన్నమత్స్యమిక పాండవమధ్యముడాకిరీటి యె
    క్కడగలవాడొ! నిచ్చటికిఁగార్యముఁదీర్పగరాగలండొ! వీ
    రుడు,నిట శోక సంద్రమున, రొయ్యన నౌకగ నావగానికన్
    కడుకరుణాళువై దయనుగావగరాడొకొ! ఓడఁనేనికన్.

    పాండవుల లక్కయింటి ఘటన తర్వాత ద్రుపదుడు ఏ అర్జునుడి భార్యకాగల కన్యను నేను పుత్రికగా కన్నానో ఆ అర్జునుడు వస్తాడో రాడొ యని వగచుట. వరముంది కాబట్టి వస్తాడు అని నమ్మకం. ఓడను అని ఆశ.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అద్భుతంగా మీ పూరణ. అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,

    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ఆ పదాలను అవే అర్థాలలో వాడరాదు అనే నియమం లేదు కాబట్టి మీ పూరణలో అభ్యంతరాలు లేవు.

    మందాకిని గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘రొయ్యన’ ... ?

    రిప్లయితొలగించండి
  5. గురువు గారూ, ధన్యవాదములు. ఒయ్యన - మెల్లగా రాద్దామనుకున్నాను. రు తో యతిమైత్రి రొ తో ఏమి వస్తుందా అని అలోచనల్లో రెండూ కలిపి రొయ్యన అని పెట్టినట్టున్నాను. మన్నించండి. ఇప్పుడు సంద్రమున నొయ్యన రు -నొ ? అని కుదురుతుందా, సంధి ప్రారంభములో సంద్రమునన్+ఒయ్యన - రులో ఉకారము కుదరదా? మీరే చెప్పాలి.
    వీరుడు బదులు మాన్యుడు అని పెడితే న్యు-నొ కు యతిమైత్రి కుదిరించవచ్చా? దయచేసి వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  6. కం: బాపడవయి నావద్దకు
    రూపముతో రాగనోడ రోత మహేంద్రా !
    చూపగనౌ కనువిందుగ
    నే పగిదియొ నంచు గర్ణు డీప్సిత మిచ్చెన్

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    --- బ్లాగు: సుజన సృజన

    రిప్లయితొలగించండి
  7. మందాకిని గారూ,
    అచ్చులే కాదు హల్లుల మైత్రి కూడా ఉండాలి కదా. అక్కడ ‘రోయక’ అంటే సరిపోతుందనుకుంటాను.

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మీ పద్యం లో, నాల్గవ పాదం లో "అన" మీద మ - చమత్కారంగా వచ్చిచేరింందండీ.

    జూదమాడుతున్న ధర్మరాజు స్వగతం:

    పడవా?పాచికలిప్డుమాటవినవా?పంతమ్ములన్బూనెనా?
    కడకీనాడిటనోటమీగతినినాకౌటెట్లు?ఓడంగలేన్
    పిడికిళ్లన్బిగియించినావలబోన్భీతెల్లభావించె-నీ
    తడవన్జూతునుగెల్వనౌ,కలికినర్ధాంగిన్పణంబొడ్డెదన్.

    కాసేపటికి ద్రౌపది:
    పాచికలఁబడవైచియె పయనమౌక
    ధర్మరాజ!ఓడగనేల?తమ్ముల?నిను?
    నీదు పంతమేమననౌ?కనికరమింత
    లేక పణమంచు నిడినావ? లేమ నిచట?

    రిప్లయితొలగించండి
  9. ఊకదంపుడు గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పద్యం మూడవ పాదంలో (నావల_బోన్భీతెల్ల) గణదోషం.
    మీరన్నట్లు అక్కడి ‘మ’కారం వల్ల చమత్కారం వస్తుంది కాని యతి తప్పుతుంది.

    రిప్లయితొలగించండి