మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 40
ఒకసారి వెంకన్న కవి వినుకొండకు వెళ్ళి దానిని పాలించే శ్రీ రాజా మలరాజు వేంకట నరసింహారాయ ప్రభువును దర్శించాడు. ఆ రాజు అతనిని చులకనగా చూచి "ఇతఁడేనా వెంకన్న?" అన్నాడట! అప్పుడు కవి "అయ్యా! వెంకన్న ఇతడే, కానీ ..." అని క్రింది పద్యాన్ని చెప్పాడట..!మ.
ఇతఁడేనా? వినుకొండనామక మనోభీష్టార్థకృత్పట్టణ
స్థితసామ్రాజ్య రమాదయామృతఝరీ చంచత్కటాక్షేక్షణ
ప్లుతసర్వాంగ సమస్తశోభనకళా పుంఖీభవత్ స్తుత్యసం
గత మల్రాజవరాన్వయప్రభవ వేంకట్నర్సధాత్రీశ్వరుం
డితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
పై పద్యంలోని చివరి పాదాన్ని సమస్యగా స్వీకరించి పూరణ చేయవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.
ఇతడేనా ? కవిలోక సంచయ మనోభీష్ట ప్రకృష్ట ప్రపూ
రిప్లయితొలగించండిరిత శోభామయ దివ్య పద్యకవితా శ్రీ తోరణాలంబితా
ద్భుత విద్వన్మయ వేదికా కలిత సద్యోగ ప్రభావ ప్రకా
శిత కంద్యన్వయ శంకరార్య విబుధ శ్రేష్ఠాగ్రగణ్యుండితం
డితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?
ఆహా ! ఈ పద్యాన్ని వ్రాసింది మీరేనా !? డా. విష్ణు నందన్ గారూ ! మీరు గాక యింకెవరు !? మీరున్ మీరే !
రిప్లయితొలగించండిడా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యోऽస్మి! అక్షర లక్షలు చేసే మీ పద్యానికి సవినయంగా నమస్కరిస్తున్నాను. మీ పద్యం నాలో కించిద్గర్వాన్ని పెంచింది. బాధ్యతనూ గుర్తు చేసింది. ధన్యవాదాలు.
డా. విష్ణునందన్ గారూ గురువు గారిపై చక్కని పద్యము చెప్పి మమ్ములను ఆనంద డోలికలలో నుఱ్ఱూతలూగించారు. ధన్యవాదములు.
రిప్లయితొలగించండివిష్ణునందనా ! సుందరా ! అద్భుతం ! అనన్యం !
రిప్లయితొలగించండివిష్ణు నందన్ గారూ ! అద్భత సుందర పద భూ ' యిష్ట' శ్రీ తోరణాలంకృత పద్య రాజమును కంద్యన్వయ శంకరార్యుల కన్వయించి మాకందించి నందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిడా.విష్ణునందన్ గారూ, అత్యంత రమణీయంబత్యంత కమనీయంబు. సమాసాన్తర్గత సమాసంబులు, విశేషణా౦తర్గతవిశేస్యములు. విశ్వకర్మ నిర్మిత మయసభా వర్ణననుమించినదీ విష్ణునందన నిర్మిత ఏకసమాస పద్యంబు. అహో, మాకు మిమ్ములన్ దర్శించు భాగ్యంబెన్నటికి కల్గునో! వెర్రిగాని, పెద్దవారి దర్శనంబు పేద వారికెట్లు గల్గు! విష్ణు కృప గల్గినగాని వారి నందనుని దర్శనంబగునట్లులేదు. వేచి చూచెద, తప్పక కల్గుననియే నా విశ్వాసము.
రిప్లయితొలగించండిగురువు గారు శ్రీ కంది శంకరయ్య గారిపై డా.విష్ణు నందన్ గారి పద్యం అత్యంత మనోహరంగా, అత్యద్భుతంగా ఉంది ఇరువురికి అభినందనలు
రిప్లయితొలగించండిపెద్దవాడైన శ్రీ కృష్ణుని జూచి గోపికలు ఆశ్చర్యంతో ...
రిప్లయితొలగించండిమతిపోయెన్నిత గాని నేడు గనగా, మాయింట పాల్వెన్నలన్
జత గాళ్ళందర గూడి దొంగిలి, కనన్ జారేను గా పిల్లిలా !
పతి లోకంబులకంచు వేడు కొనుగా, బాలుండు మా కన్నయే!
యితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?
గతకాలంబున నామహా ఋషియు నాకార్యా ర్థమై రామునిన్
రిప్లయితొలగించండిజతగా పంపమనంగ నేనపుడు చాంచల్యంబునన్ వేడితిన్
యితడా, బాలుడ? యంటి.రక్కసులనున్ యిక్కట్ల పాల్జేసెనా!
యితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే!
తారకా సంహారమును గావించిన రాముని కళ్యాణసంరంభమందు దశరథుడు భార్యలతో కలిసి సంతోషముతో తన ముద్దుల తనయుడను గాంచు సన్నివేశము.
ఇతడేనా?మన విష్ణునందనుడు?రాశీభూత పాండిత్య మం
రిప్లయితొలగించండిడిత సాహిత్యసుధా సుధాకరుడితండేనా? ఘనున్ శంకరున్
స్తుతిసంభావితు జేసి క్రొత్త పధముల్ సూత్రించు విద్యావిదుం
డితడేనా?యితడా?యితండ?యితడా?యీతండ?యీతండటే?
--- వెంకట రాజారావు . లక్కాకుల
--- బ్లాగు:సుజన సృజన
విష్ణు నందనుల అద్భుత కవితా విన్యాసమునకు పులకించి పోయాము.
రిప్లయితొలగించండిగురువుగారు ధన్యులైరి, శంకరా భరణమూ ధన్యమైనది.
రాజా రావు గారి పద్యం అద్భుతంగా ఉంది.
హనుమచ్చాస్త్రి, మందాకినీ గార్ల పద్యాలు మనోజ్ఞంగా ఉన్నాయి.
మిస్సన్న గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిరాజారావు గారూ ! మీ పూరణ చాలా బాగుంది.
మందాకిని గారూ ! మంచి పూరణ... తాటక బదులు 'తారకా' టైపాటనుకుంటా
శంకరయ్య గారూ, మీ నిస్వార్థ నిరాడంబర భాషాసేవా తత్పరతకు ఎన్ని అక్షర లక్షలిచ్చినా సరిపోదు . సదా నమోవాకాలు .
రిప్లయితొలగించండినాగరాజు రవీందర్ గారూ , మూర్తి గారూ , వసంతకిశోర్ మహోదయులూ , హనుమచ్ఛాస్త్రి గారూ , మంద పీతాంబర్ గారూ , మిస్సన్న మహాశయులూ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు . చంద్ర శేఖర్ మహోదయా , మోచెర్ల వారి అడుగు జాడల్లోనే నడిచి పూరించిన పద్యమది . అందులో నా ప్రతిభ ఏమీ లేదు. మీ మెచ్చుకోలుకు సవినయంగా చేతులు మోడ్చి నమస్కరిస్తున్నాను .
రాజారావు గారూ మీ అత్యంత మధురమైన , మనోజ్ఞమైన పద్యధారాప్రవాహంలో తనిపినందులకు శతథా కృతజ్ఞతా పూర్వకాభివాదాలు .
హనుమచ్ఛాస్త్రి గారి , మందాకిని గారి పూరణలు ప్రశంసార్హం .
చిన్న సవరణ తో ..
రిప్లయితొలగించండిపెద్దవాడైన శ్రీ కృష్ణుని జూచి వ్రేపల్లె వాసులు ఆశ్చర్యంతో ...
మతిపోయెన్ మన కృష్ణు జూడ , గతమున్ మాయింట పాల్వెన్నలన్
జత గాళ్ళందర గూడి దొంగిలి, కనన్ జారేను గా పిల్లిలా !
పతి లోకంబుల కాయె నేడు కనగా , బాలుండు పాలుండయెన్ !
యితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?
హనుమచ్ఛాస్త్రి గారు,మందాకిని గారు,రాజా రావు గారు కమనీయమైన పూరణలు చేసారు. మీ యందఱికీ హృదయపూర్వకాభినందనలు
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసవరించిన తర్వాత మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
మందాకిని గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘రక్కసులనున్ + ఇక్కట్ల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘రాక్షసులనే యిక్కట్ల పాల్జేసెగా’ అంటే సరి!
లక్కరాజు వెంకట రాజారావు గారూ,
విష్ణు నందన్ గారిపై మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
నన్ను సమ్మానించిన డా. విష్ణు నందన్ గారిని ప్రశంసించిన నాగరాజు రవీందర్, గన్నవరపు నరసింహ మూర్తి, వసంత కిశోర్, గోలి హనుమచ్ఛాస్త్రి, చంద్రశేఖర్, మంద పీతాంబర్, లక్కరాజు వెంకట రాజారావు, మిస్సన్న గారలందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండివిష్ణు నందన్ గారూ !మూర్తి గారూ ! ధన్యవాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారూ, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారు, హనుమచ్ఛాస్త్రి గారు, విష్ణునందన్ గారు, మూర్తిగారు అందరికి ధన్యవాదములు. మిత్రులందరి పూరణలూ అలరించాయి. ఔను తాటక అనబోయి తారక అన్నాను. టైపాటు.
గతకాలమ్మున చాయి నమ్ముచును తా కంపించె కాంగ్రేసునే!
రిప్లయితొలగించండిశతమానమ్మని డింపులయ్యకిక తా జంద్యమ్ము నూనించెనే!
మతిపోగొట్టుచు పాకిమూకలను తా మంత్రించెనే బాంబ్లతో!
ఇతఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?